Thursday 25 July 2019

రామాయణము యుద్ధకాండ -ముప్పదిరెండవసర్గ

                                      రామాయణము 

                                   యుద్ధకాండ -ముప్పదిరెండవసర్గ 

రావణుడు తెప్పించిన శిరస్సు దరనుర్భాణములు పరిశీలించి చూసిన సీతాదేవి అవి శ్రీరాముడివే అని అని భ్రమించి ,నిలువెల్లా వణికిపోతూ ,మొదలునరికిన అరటిచెట్టులా కూలిపోయెను . స్పృహ కోల్పోయెను . కొద్దిసేపటికి స్పృహ వచ్చిన తర్వాత బిగ్గరగా రోదించెను . కైకేయిని తిట్టుకొనెను . శ్రీరాముని తలుచుకుని కన్నీరుమున్నీరయ్యేను . తలకొట్టుకొనెను ఆ విధముగా మిక్కిలి దీనముగా సీతాదేవి రోదిస్తూ ఉండగా రావణుని అంగరక్షకుడైన ఒక రాక్షసుడు  వచ్చి ,రావణుని సమీపమున నిలబడి 'మహారాజుకు జయము "అని పలికి ,రావణుడు అతడిని చూసిన పిమ్మట రావణునితో 
ప్రభూ !ప్రహస్తుడు మంత్రులతో కలసి మీ దర్శనమునకై వేచి ఉన్నాడు . ఆ వార్తను తెలుపుటకై ఆయన నన్ను ఇచటికి పంపినాడు . మహారాజా !అత్యవసరమైన రాజ్యకార్యము వచ్చినట్లుంది . "అని పలికెను . అతడి మాటలు విన్న రావణుడు ప్రహస్తుడిని ,మంత్రులను కలవటానికి అశోకవనము నుండి బయటకు వెళ్లెను . రావణుడు అశోకవనము నుండి బయటకు వెళ్లిన పిమ్మట కుత్రిమమైన ఆ శిరస్సు ధనుర్భాణములు మాయమైపోయెను . 
రాక్షస రాజైన రావణుడు తన మంత్రులతో చర్చించి ,తన సమీపమునే నిలబడి వున్న తన సేనాధిపతులతో ,"మీరు వెంటనే దండోరా వేయించి ,మన సైన్యములను అన్నిటిని ,ఒక చోటకు చేర్చుము . సైన్యమునకు ఎందుకు తీసుకువస్తున్నారో చెప్పవద్దు . "అని పలికెను . రావణుని సైన్యాధిపతులందరూ రావణుని ఆజ్ఞ ప్రకారము సైన్యమును ఒక చోటకి చేర్చిరి . 

రామాయణము యుద్ధకాండ ముప్పదిరెండవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment