Thursday 3 March 2016

                          అత్వ సంధి 

సూత్రం  ;అత్తునకు సంధి బహుళముగా నగు . 

అత్తు అనగా హ్రస్వమయిన ఆకారం . హ్రస్వము అనగా దీర్గము లేని ,అని అర్దము . 
ఉదా ; క =క్ +అ (క హ్రస్వమయిన ఆకారం ). 

బహుళము అనగా ; క్వచిత్ ప్రవృత్తి క్వచిద ప్రవృత్తి క్వచిద్ విభాషా ,క్వచిదన్ దేవ విధెర్విధానమ్ బహుదా సమీక్ష్య చతుర్విధం బహుళకం వదన్తి . 

అనగా ప్రవృత్తి ,అప్రవృత్తి ,విభాష ,అన్యకార్యం అనే నాలిగిటిని బహుళకం అంటారు . 

ప్రవృత్తి ;విధింపబడిన కార్యం నిత్యం గా రావడం . అనగా కొన్నిచోట్ల హ్రస్వమయిన ఆకారానికి సంధి నిత్యం గా వస్తుంది . 

ఉదా ; వచ్చుచున్న +ఆడు =వచ్చుచున్నాడు . 

అప్రవృత్తి ;విధింపబడిన కార్యం అసలు రాకపోవడం . 

ఉదా ; వెల +ఆలు       అని వుండగా అత్వసంది ప్రకారం వేలాలు అవ్వాలి కాని, అత్వ సంధి రాక యడాగమం అయి వెలయాలు అవుతుంది . అనగా అత్వ సంధి రాదు . 

విభాష ;విధింపబడిన కార్యం లక్ష్యం లో ఒక్కోసారి రావడం ,మరోసారి రాకపోవడం . 

మేన +అల్లుడు   అని వుండగా 
అత్వసంది వచ్చిన 
మేనల్లుడు        అవుతుంది 
అత్వ సంధి రాకపోయిన 
యడాగమం వచ్చి 
మేనయల్లుడు అవుతుంది . 

అన్యకార్యం ;విధింపబడిన కార్యం కాక వేరొకటి రావడం . 

ఉదా ; తామర +ఆకు 
అని వుండగా అత్వసంది ప్రకారం తామరాకు అవ్వక 'ప 'ఆగమం గా వచ్చి 
తామరపాకు  అవుతుంది . 
అలాగే     బొమ్మ +ఇల్లు    
అని వుండగా అత్వసంది ప్రకారం బొమ్మిల్లు అవ్వక రేఫ ఆగామమయి 
బొమ్మరిల్లు అవుతుంది . 




                                                                                                      శశి ,

                                                                                                    ఎం .ఎ తెలుగు ,తెలుగు పండితులు . 

                                                                                           


























2 comments:

  1. శశిగారు...నమస్సులు...మీ బ్లాగ్ చాలా బాగుంది. మంచి పని చేస్తున్నారు.

    ReplyDelete
  2. చేవ ఉన్న. చేవున్న అగునా, లేక చేవయున్న అగునా ఆర్యా..ఎందుకు అగును తెలియజేయగలరు దయచేసి

    ReplyDelete