అత్వ సంధి
సూత్రం ;అత్తునకు సంధి బహుళముగా నగు .
అత్తు అనగా హ్రస్వమయిన ఆకారం . హ్రస్వము అనగా దీర్గము లేని ,అని అర్దము .
ఉదా ; క =క్ +అ (క హ్రస్వమయిన ఆకారం ).
బహుళము అనగా ; క్వచిత్ ప్రవృత్తి క్వచిద ప్రవృత్తి క్వచిద్ విభాషా ,క్వచిదన్ దేవ విధెర్విధానమ్ బహుదా సమీక్ష్య చతుర్విధం బహుళకం వదన్తి .
అనగా ప్రవృత్తి ,అప్రవృత్తి ,విభాష ,అన్యకార్యం అనే నాలిగిటిని బహుళకం అంటారు .
ప్రవృత్తి ;విధింపబడిన కార్యం నిత్యం గా రావడం . అనగా కొన్నిచోట్ల హ్రస్వమయిన ఆకారానికి సంధి నిత్యం గా వస్తుంది .
ఉదా ; వచ్చుచున్న +ఆడు =వచ్చుచున్నాడు .
అప్రవృత్తి ;విధింపబడిన కార్యం అసలు రాకపోవడం .
ఉదా ; వెల +ఆలు అని వుండగా అత్వసంది ప్రకారం వేలాలు అవ్వాలి కాని, అత్వ సంధి రాక యడాగమం అయి వెలయాలు అవుతుంది . అనగా అత్వ సంధి రాదు .
విభాష ;విధింపబడిన కార్యం లక్ష్యం లో ఒక్కోసారి రావడం ,మరోసారి రాకపోవడం .
మేన +అల్లుడు అని వుండగా
అత్వసంది వచ్చిన
మేనల్లుడు అవుతుంది
అత్వ సంధి రాకపోయిన
యడాగమం వచ్చి
మేనయల్లుడు అవుతుంది .
అన్యకార్యం ;విధింపబడిన కార్యం కాక వేరొకటి రావడం .
ఉదా ; తామర +ఆకు
అని వుండగా అత్వసంది ప్రకారం తామరాకు అవ్వక 'ప 'ఆగమం గా వచ్చి
తామరపాకు అవుతుంది .
అలాగే బొమ్మ +ఇల్లు
అని వుండగా అత్వసంది ప్రకారం బొమ్మిల్లు అవ్వక రేఫ ఆగామమయి
బొమ్మరిల్లు అవుతుంది .
శశి ,
ఎం .ఎ తెలుగు ,తెలుగు పండితులు .
శశిగారు...నమస్సులు...మీ బ్లాగ్ చాలా బాగుంది. మంచి పని చేస్తున్నారు.
ReplyDeleteచేవ ఉన్న. చేవున్న అగునా, లేక చేవయున్న అగునా ఆర్యా..ఎందుకు అగును తెలియజేయగలరు దయచేసి
ReplyDelete