Sunday 18 December 2016

రామాయణము అయోధ్యకాండ -నలుబది ఎనిమిదవసర్గ

                                       రామాయణము 

                                           అయోధ్యకాండ -నలుబది ఎనిమిదవసర్గ 

రాముడు లేని నగరము ,ఆ నగరవాసులు కళావిహీనులై ఉండెను . శ్రీరాముడు లేకుండా ఇంటికి చేరిన భర్తలను చూసి భార్యలు మాయావతి వాడు అంకుశముతో పొడిచినట్లు ,తమ సూటి ఓటి మాటలతో భర్తలను భాదించెను . 
కైకేయి చేతికి రాజ్యము వచ్చిన ఆవిడ దాసులుగా ఆవిడ అదుపాజ్ఞలలో బతకలేము రాముండు వున్న అడవికే వెళ్లిన యెడల పురుషుల భాద్యత అంతయు శ్రీరాముడు ,ఆడవారి భాద్యత అంతయు సీతాదేవి చూసుకొనగలదని ఆ పుర స్త్రీలందరూ అనుకొనుచుండిరి . 
ఆ రోజు అయోధ్యలో ఎవరు అగ్నికార్యములు చేయలేదు . హోమాది కార్యక్రమము చేయలేదు . వేయి మాటలేల? ఇళ్లల్లో పొయ్యి సయితము వెలిగించబడలేదు . ఒక్క పూట ముందు వరకు సంగీత ,వాయిద్య రకరకాల ధ్వనులతో మారుమ్రోగిన ఆ పురి ఇప్పుడు స్మశానం వలె ఎటు చూసినా ఏడ్పులు ,దీన వదనాలతో సంతోషమన్నది మచ్చుకైనా లేకుండా పోయెను . 
సంతోషముగా ఉన్న అయోధ్యా నగరములో అకస్మాత్తుగా దుఃఖము అలముకున్నట్లుగా సూర్యుడు అస్తమించడంతో వెలుగు ను తరిమివేసి చుట్టూ చీకట్లు అలముకొనెను . 

రామాయణము అయోధ్యకాండ నలుబది ఎనిమిదవసర్గ సమాప్తము . 

            శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




No comments:

Post a Comment