Monday 26 December 2016

రామాయణము అయోధ్యకాండ -నలుబదియైదవసర్గ

                                           రామాయణము 

                                           అయోధ్యకాండ -నలుబదియైదవసర్గ 

శత్రు సంహారకులైన రామలక్ష్మణులు భారద్వాజముని ఆశ్రమములో ఆ రాత్రి గడిపి మరునాడు ఉదయము ఆ మునికి వీడ్కోలు పలికి ఆయన చెప్పిన చిత్రకూటము వైపు తమ ప్రయాణము సాగించిరి . పుతృడిని సాగనంపు తండ్రి వలె భారద్వాజముని శ్రీరాముడిని  చాలా దూరము అనుసరించెను . ప్రయాణ మార్గమును వివరించెను . గంగా యమునా సంగమము నుండి దక్షిణముగా సాగి యమునా నదిని దాటి అక్కడ కల శ్యామము అను పేరు కల మర్రి చెట్టుకు సీతాదేవిని నమస్కరించి శుభాశీస్సులు పొందమనిచెప్పెను , ఇంకా ముందుకు వెళ్లవలిసిన మార్గమును వివరించెను . 
ఆ విధముగా మార్గమును వివరించి పెక్కు దూరము అనుసరించి ఆ భరద్వాజముని వెనుతిరుగుటకు ఆగెను శ్రీరాముడు ఆయనకు నమస్కరించి వీడ్కోలు పలికెను . ఆయన చెప్పిన మార్గములో ముందుకు వెళ్తూ యమునా నదిని దాటుటకు నావను తయారుచేసుకుని అందు సీతాదేవి వస్త్రాభరణములు ,తమ తట్ట ,గుణపాము మొదలగు వస్తువులను పెట్టుకుని యమునను దాటిరి . అక్కడ నుండి కొంత దూరము ప్రయాణము చేసిన పిమ్మట నల్లని వర్ణము కల మఱ్ఱిచెట్టు కనిపించెను . సీతాదేవి దానికి ప్రదక్షిణ నమస్కారములు చేసెను . 
పిమ్మట ముందుకు సాగిరి అక్కడి ప్రక్రుతి పరమ రామణీయముగా వున్నది . అక్కడ తనకు కొత్తగా అందముగా కనిపించిన పూలను ,తీగలను సీత కోరుతుండగా రాముడు వాటిని తెచ్చిస్తూ ఉండెను . అలా ముందుకు సాగుతూ యమునా నాదీ తీరములో కందమూలాదులను భుజించి సమతల ప్రదేశములో నిద్రించెను . 

రామాయణము అయోధ్యకాండ నలుబది అయిదవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





 

No comments:

Post a Comment