Monday 19 December 2016

రామాయణము అయోధ్యకాండ -నలుబదితొమ్మిదవసర్గ

                                           రామాయణము 

                                         అయోధ్యకాండ -నలుబదితొమ్మిదవసర్గ 

పురుష శ్రేష్ఠుడైన శ్రీరాముడు వేకువజామున నదీ తీరమున ప్రజలను వదిలి వెళ్లిన పిమ్మట ,తండ్రి ఆజ్ఞను గుర్తుచేసుకుని సీతా లక్ష్మణులతో కూడి చాలా దూరము ప్రయాణము చేసెను . ఇన్తలో శుభొదయము అవగా  దక్షిణ దిశను కల వివిధ జన పదములను దాటుతూ ,అక్కడి పంట పొలాలను ,వనములను తిలకించుతూ ముందుకు సాగెను . 
ఆ విధముగా సీతా లక్ష్మణ సమేతుడై వనవాసమునకు వెళ్లుచున్న రాముడిని చూసిన అక్కడి ప్రజలు శ్రీరాముని వనవాసమునకు కారణమైన దశరథ మహారాజును నిందించుచుండిరి . వారి మాటలను వింటూ రాముడు ముందుకు సాగిపోయెను . అగస్త్యాశ్రమము దిశగా తన ప్రయాణమును సాగిo చేను . అక్కడి విశేషములను సీతాదేవికి  శ్రీరాముడు వివరించెను . 
సుమంత్రుడితో రాముడు " మఱల నా తల్లితండ్రుల దర్శన భాగ్యము ఎన్నాళ్లకు కలుగునో కదా ?సరయు నదీ తీరమున కల ఈ సుందర పుష్పవనములలో హాయిగా విహరించేది భాగ్యము తిరిగి ఎన్నాళ్లకు కలుగునో ?ఈ వనములలో మృగములను వేటాడు కోరిక నాకు లేదు  . కానీ దశరధమహారాజుకి వేట అంటే చాలా ఇష్టము . "అంటూ శ్రీరామచంద్రుడు వివిధ  గురించి సుమంత్రుడికి మృదుమధురంగా వివరించుచు  సుమంత్రుడు రధమును తోలుతుండగా రధము మీద ఆశీనుడైన శ్రీరాముడు ముందుకు సాగెను . 

రామాయణము అయోధ్యకాండ నలుబది తొమ్మిదవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





 

No comments:

Post a Comment