Tuesday 20 December 2016

రామాయణము అయోధ్యకాండ -ఏబదియవసర్గము

                              రామాయణము 

                     అయోధ్యకాండ -ఏబదియవసర్గము 

ఆ విధముగా శ్రీరాముడు ముందుకు సాగుతూ కోశాలదేశ పొలిమేరలు దాటిన పిమ్మట వెనకకు  కోశాల రాజ్యమునకు నమస్కారము చేసి ,తండ్రిగారి ఋణము తీర్చుకుని తిరిగి నిన్ను  అక్కడి జానపదులకు నమస్కారము చేసి ముందుకు సాగెను . 
ఆ విధముగా పెక్కు దూరము ప్రయాణము చేసిన పిమ్మట స్వచ్ఛమైన జలములతో కూడిన పవిత్రమైన గంగా నది కనిపించెను . అక్కడి ప్రక్రుతి ఎంతో రామణీయముగా శోభాయమానంగా ఉండెను . అక్కడ దేవతలు గంగా స్నానములు ఆచరించుచు కనిపించిరి . ఆ ప్రదేశమును చూసిన శ్రీ రాముడు సుమంత్రుని రధము ఆపమని చెప్పి ఈ పూట ఇక్కడే  పలికెను . 
ఆ ప్రాంతమును పరిపాలించు రాజు పేరు గుహుడు అతడు ధర్మపరుడు ,నిషాదరాజు ,శ్రీరాముని భక్తుడు . అతడు శ్రీరాముడు సీతా ,లక్ష్మణ సమేతముగా తన రాజ్యమునకు వేంచేసిన విషయమును తెలుసుకుని తానె పరుగుపరుగున శ్రీరాముని చెంతకు వచ్చెను . శ్రీరాముడు గుహునికి ఎదురేగి ఆయనను కౌగలించుకొనెను . 
గుహుడు సీతారామలక్ష్మణులు రకరకముల పిండివంటలు ,రుచికరమైన పలురకములైన ఆహారపదార్ధములను ,పండ్లను పాయసములను ,రసములను ,వారి గుఱ్ఱములకు గడ్డిని సిద్ధము చేయించెను . ఇంకను వారు విశ్రమించుటకు పరుపులు ఏర్పాటుచేయించెను . శ్రీరాముడు వాటినన్నినింటిని సున్నితముగా తిరస్కరించి గుఱ్ఱములకు గడ్డిని మాత్రము గ్రహించెను . వనవాస దీక్షలో విందు భోజనమును ఆరగించరాదని తెలిపెను . సీతారాములు అనంతరము దర్భ శయ్య పై పవళించిరి . గుహుడు ,లక్ష్మణుడు వారి రక్షణార్ధము రేయంతా మెలుకువగా ఉండెను . 

రామాయణము అయోధ్యకాండ ఏబదియవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ (తెలుగు ,తెలుగు పండితులు . 



 

No comments:

Post a Comment