Thursday 15 December 2016

రామాయణం అయోధ్యకాండ -నలుబదియైదవసర్గ

                                      రామాయణం 

                                      అయోధ్యకాండ -నలుబదియైదవసర్గ 

మహానుభావుడైన శ్రీరాముడు తండ్రి ఆజ్ఞ ప్రకారము దీక్షవహించి ,వనవాసములకు వెళ్లుచుండగా ,అయోధ్యావాసులందరూ భక్తి విశ్వాసములతో ఆయనను అనుసరించిరి . 
"త్వరలో తమకడకు రావలెను అని కోరుకొనువారు తమ ఆత్మీయులను ఎక్కువ దూరము అనుసరింపరాదు "అను నియమము ప్రకారము దశరథ మహారాజు ,అంతః పుర వాసులు అతి కష్టము మీది వెనుతిరిగిరి . కానీ శ్రీరాముని రధము వెంట పరుగిడు అయోధ్యావాసులు మాత్రము తమ ఇండ్లకు రాలేదు . 
ఆ పౌరులందరూ రామా !వెనుతిరుగుము అని అరుస్తూ రధము వెంట పరుగులు తీయ సాగిరి . శ్రీరాముడు వారిని చూచి "మీ ఆధారాభిమానములకు మిక్కిలి సంతోషము ,ఇంత ప్రేమను భరతుడి మీద చూపండి . అప్పుడు నాకు ఇంకా సంతోషము కలుగును . రాజా శాసనము నాకు మీకు శిరాశావహింపవలసినది . కావున నేను వెళ్లిన పిమ్మట మహారాజు మనసుకు ఊరట కలుగునట్లు మసలుకొనుడు అది నాకు తృప్తి కలిగించును "అని పలికెను . 
ఆ పౌరులలో వృద్దులు బ్రాహ్మణులు జ్ఞాన సంపన్నులు తపోబలము కలవారు ముసలి వారగుటచే దూరము నుండే "ఓ రామ రధాశ్వములారా !వనముల వైపు వెళ్ళకుము . శ్రీరాముని వనములకు కాక నగరమునకు తీసుకు రండు . మీ శ్రావణ శక్తి అద్భుతము కావున మా మాటలు విని మరలుడు "అని పలుకగా శ్రీరాముడు రధమును నిలిపి రధము దిగి వారి వద్దకు పాదచారుడై వచ్చి వారిని ఊరడించెను . తిరిగి ముందుకు సాగెను . 
శ్రీ రాముడి వనవాసము తనకు కూడా ఇష్టము లేదు అన్నట్లు తమసా నది తీరము వచ్చెను . సుమంత్రుడు రధమును ఆపి గుఱ్ఱములను తీసి వాటి అలసట తీర్చెను . 

రామాయణము నలుబది అయిదవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment