Wednesday 21 December 2016

రామాయణము అయోధ్యకాండ -ఏబదిఒకటవసర్గ

                                       రామాయణము 

                                అయోధ్యకాండ -ఏబదిఒకటవసర్గ 

శ్రీ రాముడిపై కల సహజమైన అనురాగముతో లక్ష్మణుడు మేల్కొని ఉండుట గమనించిన గుహుడు "లక్ష్మణా !నీవు నిద్రించుము . నేను జాగరూపుడనై సీతారాములను చూచుకొనెదను . రాముడు యెడల నాకు అపార రెమభావము కలదు రాముడు నా మిత్రుడు కావున చింతించక హాయిగా నిద్రించుము . పైగా మహారాజు పుత్రుడు సుకుమారుడు అయినా శ్రీరాముడు నేలపై పరుండుట చూసిన వారికి నిద్రేలా పట్టును . నీవునూ రాజా కుమారుడవు . కావున ఈ రాత్రి సీతారాముల రక్షణ భారము నాకు అప్పగించి హాయిగా నిద్రించుము "అని పలికెను . 
అప్పుడు లక్ష్మణుడు గుహునితో "గుహా! నీ ఆదరాభిమానములకు మిక్కిలి సంతుష్టుడను అయ్యాను . కానీ నాకు అయోధ్యలోని  పరిస్థితి తలుచుకుంటే నిద్ర రావటం లేదు . అంతః  పురస్త్రీలందరూ ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళఇంకిపోయి మౌనముగా వుండివుంటారు . కౌశల్యా మాత ,దశరథ మహారాజు ,సుమిత్రా  మాత లను తలుచుకుంటేనే దుఃఖము ఆగడము లేదు వారు నేటి రాత్రి గడిచేసరికి జీవించివుంటారో లేదో అనుమానమే . సుమిత్రా మాత శత్రుజ్ఞుడి కోసం జీవించినా దశరథ మహారాజు ,కౌశల్యా మాతలు నిశ్చయముగా జీవించరు . ఆ సందేహమే నన్ను మిక్కిలి కలవరపరుచుచున్నది . 
వనవాస దీక్ష ముగిసి తిరిగి అయోధ్యకు వెళ్లువరకు ఆ మహారాజు క్షేమముగా ఉండునో లేదో . మళ్ళీ ఆయన దర్శన భాగ్యము కలుగునో లేదో "అంటూ పరిపరి విధములుగా బాదడుచున్న లక్ష్మణుడిని గుహుడు ఓదార్చెను . ఇంతలో తెల్లవారెను . 

           రామాయణము అయోధ్యకాండ ఏబది ఒకటవసర్గ సమాప్తము . 

               శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  










No comments:

Post a Comment