Sunday 25 December 2016

రామాయణము అయోధ్యకాండ -ఏబదినాలుగవసర్గ

                                     రామాయణము 

                                  అయోధ్యకాండ -ఏబదినాలుగవసర్గ 

సీతారామలక్ష్మణులు ఆ వృక్ష సమీపమున ప్రశాంతముగా విశ్రాంతి తీసుకొనిరి . ప్రాతః కాలమున బయలుదేరి గంగా యమునా నదుల తీరమున కల ప్రయాగ దగ్గరలోని భారద్వాజముని ఆశ్రమము వైపు నడవసాగిరి . మధ్యాహ్న సమయము వరకు నడవగా ఆశ్రమము చేరువకు చేరుకొనిరి . ఆశ్రమము వద్దకు వెళ్లి అనుమతి పొంది పర్ణశాలలో ప్రవేశించి మునికి నమస్కారము చేసిరి . 
పిమ్మట తమను తాము పరిచయము చేసుకొనిరి . భారద్వాజముని వారిని ఆశ్రమములోకి సాదరముగా ఆహ్వానించి వారికి అతిధి మర్యాదలు చేసిరి . శ్రీరాముడు భారద్వాజ మునితో" జనావాసమునకు దగ్గరగా ఉంటే వారు నిరంతరము దర్శనమునకు వచ్చెదరు . కావున జనములకు దూరముగా ప్రశాంత వనవాసము చేయగోరుతున్నాను . కావున అటువంటి ప్రదేశము ఏదేని ఉంటే తెలుపుడు "అని పలికెను . 
అపుడు ఆ ముని "రఘుకుల తిలకా !ఇక్కడికి దగ్గరలో చిత్రకూట పర్వతము అనే పర్వతము కలదు . అక్కడ వివిధ  జలపాతములు ,కోకిలస్వరములు ,జింకల గుంపులు ,మదగజములతో మిక్కిలి రమణీయముగా ఉండును . అది మీకు శ్రేయస్కరము ". అని పలికెను . సుఖముగా పెరిగిన సీతారాములు బడలిక చేత ఆరోజు రాత్రి భారద్వాజాశ్రములో విశ్రమించిరి . ప్రాతః కాలమున లేచి భారద్వాజముని చెప్పిన చిత్రకూట పర్వతము చేరుటకు సన్నద్దులయ్యిరి . 

రామాయణము అయోధ్యకాండ ఏబదినాలుగవసర్గ సమాప్తము . 

            శశి ,

ఎం . ఏ (తెలుగు )తెలుగు పండితులు . 









No comments:

Post a Comment