Tuesday 3 May 2016

కుబేర వృత్తాంతం

       కుబేర వృత్తాంతం (పార్ట్ -1)



కాంపిల్యము అను ఒక నగరమున వేద వేదాంగములు అధ్యయనము చేసి,సకల సద్గుణములు కలిగిన యజ్ఞదత్తుడు అను బ్రాహ్మణుడు నివసించుచుండెను . అతని కుమారుడు గుణనిధి గారాభముచే దుష్ట స్నేహితులను కలిగి సకల దురవ్యసనములకు లోనై  ఉండేవాడు . అతని తల్లి కొడుకు మీద ప్రేమతో అతడి దురవ్యసనములను భర్తకు తెలియకుండా రహస్యముగా వుంచేది . గుణనిధి ఒకరోజున జూదములో తన రత్నపు ఉంగరమును పోగోట్టుకొనేను . యజ్ఞదత్తుడు  రాజుగారి కొలువు నుండి వస్తూ తన కుమారుడు గుణనిధి ఉంగరమును ఒక జూదరి ధరించుట చూసి అతడిని నిందించెను . అతడు గుణనిధి దురవ్యసనముల గురించి తెలుపగా ఎంతో భాద పడుతూ ,ఇంటికి వచ్చి భార్యను నిందించెను . 
  గుణనిధి తన గురించి తండ్రికి తెలిసిందని తెలిసి బయముతో ఇల్లువదిలి పారిపోయెను . దూర దేశాలకు పోతూ ,మార్గ మద్యలో ఒక సరోవర తీరములో విశ్రమించి ,తర్వాత ఆ సరస్సులోని నీటిని తాగి తన తప్పును తలచుకొని భాదపడెను . ఆ దారిలో పరమ శివ భక్తుడు ఒకడు శివుడికి నైవేద్యము పెట్టడానికై అనేక రకముల పిండి వంటలను తీసుకుని వెళ్తుండగా గుణనిధి ఆకలి వలన అతడిని వెంబడించెను . ఆకలి భాదతో ఆ ఆహారమును ఎలాగైనా దొంగాలించాలని అక్కడే వేచి ఉండెను . నాడు మహా శివరాత్రి పర్వదినము అవటం వల్ల అందరు జాగారము చేస్తున్నారు . వారు నిద్రపోవువరకు వేచి వుండి గుణనిధి వారంతా నిద్రించిన తర్వాత శివాలయములోకి వెళ్లి ప్రసాద పాత్రను దొంగలించి పోవుచుండగా అతడి అడుగుల చప్పుడుకు ఒక భక్తుడికి మెలకువ వచ్చి దొంగ దొంగ అని అరవగా రాజ భటులు అతడిని వెంభడించి భానములతో కొట్టెను . దానితో గుణనిధి ప్రాణము పోయెను . గుణనిధి ప్రాణములు పోయినంతనే యమపురి నుండి యమభటులు ,కైలాసము నుండి శివ భటులు వచ్చారు . శివరాత్రి పర్వదినమున పరమశివుని దర్శించి లింగోద్భవ కాలము వరకు వేచివుండి ,శివ ప్రసాదమునకై పరితపించుతచే శివానుగ్రహమునకు పాత్రుడయ్యాడని శివ భటులు యమభటులకు ధర్మ సుక్ష్మములను వివరించి గుణనిధి ని కైలాసమునకు తీసుకుపోయెను . 
గుణనిధి శివాజ్ఞ ప్రకారము కలింగాధిపథి అగు నరిందముడు అనే రాజుకు కుమారుడై జన్మించి పూర్వ జన్మ వాసనా ప్రభావము వలన ,శివానుగ్రహము వలన బాల్యము నుండి శివభక్తుడై శివ ధర్మములోనరించుచు యుక్త వయస్కుడై రాజు అయ్యెను . సకల జన రంజకముగా పాలించుచు ,సత్కార్యములనోనరించుచు ,సంమార్గాములో పుణ్యము గడించి మరణించెను . ఆ ఫున్య ఫలము చేత అతడు అలకానగారాదీశుడై ,శివుడికి పరమ మిత్రుడై సిరులను పొంది కుబేరుడు అనే పేరుతో ప్రసిద్దుడయ్యేను . 


                               శశి ,

ఎం . ఎ ,(తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment