Tuesday 17 May 2016

ఘుష్మేశ్వర జ్యోతిర్లింగం

                    ఘుష్మేశ్వర జ్యోతిర్లింగం 



ఘుష్మేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో వుంది . ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇదే ఆకరి జ్యోతిర్లింగం . దీనికి ఘుశ్మేశ్వరుడు ఘ్రునేశ్వరుడు అనే పేర్లు కుడా వున్నాయి . ఈ జ్యోతిర్లింగాన్ని గురించి ఓ పురాణ గాధ ప్రచారంలో వుంది . దక్షిణ దేశంలో దేవగిరి పర్వత సమీపంలో సుదాముడు అనే అత్యంత తేజశ్శాలి ,తపో నిష్టా గరిష్టుడు అయిన బ్రాహ్మణుడు ఉండేవాడు . అతని బార్య పేరు సుదేహ ,వారిద్దరూ అన్యోన్యంగా ఎంతో ప్రేమా వుంటూ సంసార జీవితం సాగిస్తూ వుండేవారు . కాని ఎంత కాలానికి వారికి సంతానం మాత్రం కలుగలేదు . సుదేహ సంతానం కావాలని ఎంతగానో పరితపించిపోయింది . 
   సంతానం కోసం ఆమె పట్టుపట్టి సుదాముడికి తన చెల్లితో రెండో వివాహం జరిపించింది . భార్య సుదేహ కోరిక ,పట్టుదలపై ఆమె చెల్లెలు ఘుశ్మను పెళ్ళిచేసుకుంటాడు సుదాముడు . ఆమె శివభగవానుని భక్తురాలు . ఆ పరమేశ్వరుడి కరుణ వలన ఆమెకు పుత్రుడు జనియించాడు . ఇది సుదేహకు అసూయ కలిగించింది . చివరకు ఆమె ఆ బాలుడిని అంతం చేసేందుకు కుడా వెనుకాడలేదు . ఘుశ్మ అన్నింటికీ భగవానుడు వున్నాడనుకుని శివార్చనలో నిమగ్నమైనది . శివుడు ప్రత్యక్షమై ఆమె బిడ్డను ఆమెకు తిరి ఇవ్వటమే కాక ఇంతటి అకృత్యానికి పాల్పడిన సుదేహను శపించబోతుంటే ఘుశ్మ అడ్డుతగిలి తన సోదరిని క్షమించమని వేడుకుంది . అంతే కాదు లోక కళ్యాణార్ధం ఆ దేవా దేవుడిని అక్కడే కొలువై ఉండమని కోరింది ఆమె కోరికను మన్నించిన శివుడు అక్కడే జ్యోతిర్లింగ రూపంలో వెలిసాడు . ఘుశ్మా దేవి ద్వారా ఆరాధించబడ్డ కారణంగా శివుడు అక్కడ ఘుష్మేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ది పొందాడు . 


సర్వే జనా సుఖినో భవంతు 


                                      శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment