Sunday 8 May 2016

ఓంకారేశ్వర జ్యోతిర్లింగం

           ఓంకారేశ్వర జ్యోతిర్లింగం 





ఓంకార జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ లోని పవిత్ర నర్మదా నదీ తీరంలో వుంది.  ఈ ప్రదేశంలో నర్మదా నది రెండు పాయలుగా చీలి మధ్యప్రదేశం ఒక ద్వీపంగా ఏర్పడింది . ఈ ద్వీపాన్ని మాంధాత పర్వతమని ,శివపురి అని అంటారు . నది నుండి ఒక పాయ ఉత్తరం వైపుగా మరో పాయ దక్షిణం వైపుగా ప్రవహిస్తుంది . దక్షిణంవైపు ప్రవహించేదే ప్రధాన పాయగా గుర్తించబడుతోంది . మాంధాత పర్వతం మీద ఓంకారేశ్వర జ్యోతిర్లింగా దేవాలయం నెలకొని వున్నది . ప్రాచీన కాలంలో మాంధాత మహారాజు ఈ పర్వతం మీద గొప్ప తపస్సు చేసి శివ భగవానుని ప్రసన్నం చేసుకున్నాడు . ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి రెండు స్వరూపాలు వున్నాయి ఒకదానిని అమరేశ్వర నామంతో పిలుస్తారు . ఇది నర్మదా నది దక్షిణ తీరంలో ఓంకారేశ్వరుడికి కొద్ది దూరంలో వుంటుంది . వేరు వేరుగా వున్నా రెండింటిని ఒకటిగానే పరిగనిస్తారు . వీటికో పురాణ గాద వుంది . ఒకసారి నారద మహర్షి వింధ్య పర్వతం మీద తపస్సు చేస్తుండగా అతనికి వింధ్య పర్వతం కన్నా పెద్దది ఈ ప్రపంచంలోనే లేదన్నంతగా కనబడటమే కాక ఇది ఓ పెద్ద మానవాకారంలో కనబడుతుంది . అయితే నారదుడు మేరు పర్వతమే వింధ్య పర్వతం కన్నా పెద్దది అంటాడు . దానితో వింధ్య పర్వతుడు నర్మదా నది ఒడ్డున శివుని గురించి గొప్ప తపస్సు చేస్తాడు . వింధ్య తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం అనుగ్రహిస్తాడు . వింద్యాచాలానికి వరమిచ్చే వేల సమస్త ఋషులు, మునిగణంఇక్కడికి విచ్చేస్తారు . వారి ప్రార్ధనల ప్రకారం శివ భగవానుడు తన ఓంకారేశ్వర నామక లింగాన్ని రెండు భాగాలుగా చేసాడు . అలా ఒకదానికి ఓంకారేశ్వరుడు  ,రెండో దానికి అమరేశ్వరుడు అనే పేర్లు వచ్చాయి. 

హర హర మహాదేవ  శంభో శంకరా . 


                                             శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 











No comments:

Post a Comment