Saturday 14 May 2016

వైద్యనాధ జ్యోతిర్లింగం

             వైద్యనాధ జ్యోతిర్లింగం 

ప్రసిద్దమైన శ్రీ వైద్యనాధ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని భిర్ జిల్లాలోని పార్లిలో నెలకొనివుంది . ఒకసారి రాక్షస రాజు రావణాసురుడు హిమాలయానికి వెళ్లి శివ భగవానుడి దర్శనార్ధం ఘోర తపస్సుని చేసెను . ఆ తపస్సులో ఒకదాని తర్వాత ఒకటిగా తన శిరస్సులని ఖండించి శివలింగానికి అర్పణ చేసెను . ఆ విధంగా తన తొమ్మిది తలలను ఖండించి శివార్పణం చేసి ,పదవ తలను కూడా శివలింగానికి అర్పించబోవగా పరమేశ్వరుడు అత్యంత ప్రసన్నుడై అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు . శిరస్సుని ఖండించబోతున్న రావణుడి చేయిని పట్టుకుని అతని చర్యను నివారించి ,అంతకు ముందు తనకు సమర్పించిన తొమ్మిది తలలను యదా స్థానంలో ఉండేలా అనుగ్రహిస్తాడు . నీ తపస్సుకు మెచ్చానని ఏదైనా వరం కోరుకోమని ఆనతి ఇస్తాడు . అప్పుడు రావణుడు తనకు ప్రీతిపాత్రమైన శివలింగాన్ని తన రాజధాని లంకా నగరానికి తీసుకేల్లెందుకు అనుమతిని ఇవ్వమని కోరతాడు . ఆ వరం అనుగ్రహించి శివుడు ఓ షరతు కూడా పెడతాడు . మార్గ మద్యలో ఎక్కడా లింగానిని కింద పెట్టకుడదని ఆ షరతు . రావణుడు ఆ షరతుకు అంగీకరించి శివలింగాన్ని తీసుకుని లంకా నగరానికి పయనమవుతాడు . మార్గ మద్యం లో అనుకోని పరిస్థుతులలో ఓ గోపా బాలుని చేతిలో శివలింగం పెడతాడు . ఆ బాలుడికి శివలింగం భారంగా తోచడం చేత తప్పనిసరి పరిస్థుతులలో నేలపై పెడతాడు . ఆ తర్వాత రావణుడు ఎంత ప్రయత్నించినా ఆ లింగాన్ని పైకెత్తలేకపోయాడు . అలా ఆ శివ లింగం వైద్యనాధ పేరుతో అక్కడే ప్రతిష్టించబడి పూజలు అందుకుంటోంది . 



హర హర మహాదేవ శంభో శంకరా 

                                                            శశి ,

                               ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 







                            

No comments:

Post a Comment