Thursday 12 May 2016

త్రయంభకేశ్వర జ్యోతిర్లింగం

               త్రయంభకేశ్వర జ్యోతిర్లింగం 



శ్రీ త్రయంభకేశ్వర జ్యోతిర్లింగం మహా రాష్ట్ర లోని నాసిక్ లో వుంది . శివ పురాణం లో ఈ జ్యోతిర్లింగానికి ఎంతో విశిష్ట స్థానం వుంది . ఒకసారి గౌతమ మహర్షి ఆశ్రమంలో నివసించే బ్రాహ్మణ పత్నులకు గౌతముని పైన ఆయన ధర్మ పత్ని అహల్య పైన అసూయ కలుగుతుంది . అప్పుడు వారందరూ తమ భర్తలను గౌతమ మహర్షికి అపకారం కలిగించేలా ప్రేరేపించారు . దీనికోసం బ్రాహ్మణులు అందరు గణపతిని ఆరాధన చేసి ప్రసన్నుడిని చేసుకుని గౌతముడిని ఆశ్రమం నుండి వెడల గొట్టే ఉపాయం అడుగుతారు . గణపతి విధి లేని పరిస్థితులలో గోవు రూపం దాల్చి గౌతముడి పొలానికి చేరి అక్కడ మేస్తుంటాడు . పొలం లోని పంటను అంతా నాశనం చేస్తున్న గోవుని చూసి గౌతముడు సుకుమారంగా ఓ గడ్డి పరకతో దానిని అదిలిస్తాడు . ఆ స్పర్శకే గోవు ప్రాణాలు విడుస్తుంది . గౌతముడు ఎంతో భాద పడి ఏదయినా ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటాడు . అప్పుడు శివుడు ప్రత్యక్షమై దుష్టులైన గౌతముడి ఆశ్రమ వాసులని అంతమొందిన్చాలనుకోగా గౌతముడు వారి తప్పులను మన్నించమని వేడుకుంటాడు . గౌతమ మహర్షి మాటలతో ఆగ్రహాన్ని విడిచిన శంకరుడు గోదావరిని పిలిచి అక్కడ నివాసం ఏర్పరుచుకోమంటాడు . గోదావరి అందుకు అంగీకరించి శివుడిని కుడా అక్కడే ఉండమని వేడుకోవడంతో శివుడు జ్యోతిర్లింగ రూపంలో వెలుస్తాడు . అప్పటి నుండి నాసిక్ లో శివ భగవానుడు త్రయంభకేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు . 


సర్వే జనా సుఖినో భవంతు . 

                                       శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 







No comments:

Post a Comment