Sunday 1 May 2016

           సతీ దేవి వృత్తాంతం (పార్ట్ -8)

దక్షుడి యజ్ఞం  విధముగా భగ్నమవుటచే చిన్నాభిన్నులైన రుత్వికులు ,మునిగణములు బ్రహ్మ  సహా వైకుంఠ మునకు వెళ్లి దామోదరుడిని మొక్కి దేవతలను , రక్షింపమని వేడుకొనిరి . విష్ణుమూర్తి లక్ష్మీ దేవితో సహా కైలాసమునకు వెళ్ళిరి . ఆ సమయములో పరమేశ్వరుడు భాదతో నారాయణుడి మంత్రము పటించుచు ఉండెను . వీరభాద్రాది గణములు అందరు శివుని కొలుచుచు వుండిరి . అప్పుడు విష్ణుమూర్తి శివుడిని విచారము వీడమని ప్రస్తుత కార్యక్రమము ఆలోచింపమని కోరెను . దక్షుడు తన పాపములకు ఫలితము అనుభవించెను . దక్ష యజ్ఞము పూర్తి కాని పక్షములో లోకములో కరువు కాటకములు ఏర్పడి సృష్టి కార్యక్రమమునకు భంగము వాటిల్లును . లోక కళ్యాణం కోసం దక్ష యజ్ఞము పూర్తి అగునట్లు చేయమని హరి అడుగుట చేత ,దయాళువు భక్త సులభుడు అగు శంకరుడు ,సరే అని తన గణముతో ,వచ్చిన వారందరితో దక్ష యజ్ఞ వాటికకు వెళ్ళెను . దక్షుడి శిరము కనిపించకపోవడంతో ఉత్తరముగా శిరస్సు వుంచి పడుకున్న గొర్రె తల నరికి తెప్పించి దానిని దక్షుడి దేహమునకు అతికించెను . పరమేశ్వరుడి కరుణా కటాక్షములతో దక్షుడు నిద్ర మేల్కొనినట్లులేచి కూర్చుండెను . ఎదురుగా ఉన్న శివుడిని చూసి నమస్కరించి చనిపోయిన కూతురును తలచుకుని మనసంతా భాదతో నిండిపోగా మాట్లాడలేకున్నా ,దైర్యము తెచ్చుకుని శివుడిని స్తుతించెను . 
అప్పుడు శివుడు దక్షుడికి హితవు చెప్పి శివకేశవులు ఒకటే అని చెప్పి యజ్ఞము పూర్తి చేయమని చెప్పెను . దక్షుడు దేవతలందరికీ హవిస్సులు ఇచ్చి సంపూర్ణ భాగము శివుడికి ఇచ్చి యజ్ఞము పూర్తి చేసెను . అంత బ్రహ్మ విష్ణువు ,అకిల దేవతలు ,మునీంద్రులు ,సంతోషముతో శివుడి కీర్తిని పొగుడుతూ గానము చేస్తూ వారి వారి నివాస స్థలములకు వెళ్ళెను . శివుడు  మండుతున్న సతీ దేవి దేహమును చూసి భాద అదికమవగా ఆ మండుతున్న దేహమును భూజమున ధరించి వెళ్ళిపోయెను . 


  



                                                శశి ,

ఎమ్. ఎ (తెలుగు ),తెలుగు పండితులు 



No comments:

Post a Comment