Monday 30 May 2016

రామాయణం ప్రధమోద్యాయః

                       రామాయణం    ప్రధమోద్యాయః 

సూతుడు మునులతో ఇంకనూ ఇట్లనెను 

ఓ ద్విజోత్తములారా !శ్రీ మద్రామాయణము ధర్మార్ధ కర్మ మోక్ష ఫల ప్రాప్తికి సాధనము . ఇందలి వృత్తాంతం పవిత్రమైనది ,మానవులెల్లరు భక్తి నిరతులై వినదగినది . 
పూర్వ జన్మలయందలిపాపములనుండి విముక్తులైన వారికి  మాత్రమే ఈ జన్మలో రామాయణము అందు ప్రీతీ జనించును . ఇది తధ్యము . 
పాప బంధనములలో చిక్కుకోనిన వాడు రామాయణ వృత్తాంతము ప్రారంభము కాగానే దాని యెడ నిరాదరణ చూపును . నిమ్న జాతికి చెందిన  గాధలను వినుటలో ఆశక్తి చూపును . తత్ఫలితముగా ఆ మార్గములోనే పయనించును . 
కనుక ఓ బ్రాహ్మనోత్తములారా !'రామాయణం 'అను పేరు గల సర్వ శ్రేష్ట కావ్యము వినుడు . దానిని వినుట  వలన మానవునికి జనన మరణ భయములు దూరమగును .  వార్ధక్య భీతుయు వుండదు . అతడు పాప రహితుడై ముక్తిని పొందును . 
ఆ రామభద్రుని వృత్తాంతం ప్రముఖమైనది . సర్వ శ్రేష్టమైనది . వరములను ఇచ్చునది . తన యొక్క ప్రభావముచే సమస్త లోకములను వికసింపు చేయునది . ఆ అది కావ్యము కోరిన కోర్కెలు దీర్చు కల్పవృక్షము . కావున ఆ కావ్య గాధను విన్న మానవులు పరమ పదము చేరుదురు . 




ఓ మహర్షులారా !కార్తీకమునందును ,మాఘమునందును చైత్రమాసము నందును ,శుక్లపక్ష పాడ్యమి మొదలుకుని తొమ్మిది దినములు పగటి పూట అమృత తుల్యమైన రామాయణ గాధను శ్రవణము చేయుట మంచిది . శుభదాయకమైన శ్రీ రామ వృత్తాంతమును ఈ విధముగా ఆస్వాదించిన వానికి ఉత్తములైన మనొరధములన్నీ సిద్ధించును . అతడు సకల పాపముల నుండియు ముక్తుడగును మరియు అతనితో పాటు పూర్వులైన 10 తరముల వారునూ ,తరువాత 10 తరముల వారును పరందామమును చేరుదురు . అట్లు చేరిన వారికి ఇక ఎన్నడును దుఖములే వుండవు . 

చైత్ర ,కార్తీక ,మాఘ మాసములయందు గల శుక్ల పక్షముల యందు 9 దినములలో రామాయణమును పారాయణము చేయుట ఎక్కువ ఫలమును ఇచ్చును . అట్లే దీక్షతో దానిని శ్రావణము చేయుట వలన కుడా ఆ ఫలితమును పొందవచ్చును . 
ఆది కావ్యమైన రామాయణము స్వర్గ సుఖములను ప్రసాదించును మోక్షమును ప్రాప్తింప చేయును . ఘోరమైన కలియుగము నందు వర్నాశ్రామాది ధర్మములన్నియు అడుగంటును అందువలన జనులు ఇహపర లాభాములకై వరుసగా 9 దినములు రామాయణ కదా శ్రవణము చేయవలెను . ఓ మహర్షులారా దుర్భరమైన ఈ కలియుగమున రామనామ జపపరులైన వారు రామనామ ప్రభావముచే క్రుతార్ధులగుదురు . వారిని కలియుగ బాధలు అంటవు . రామాయణ కధ పఠన ,శ్రవనములు జరిగెడి గృహము ఒక పుణ్య తీర్ధమై ఉండును . దుష్టులు సైతము ఆ ఇంట అడుగిడినచో వారి పాపములు సైతము అంతరించును . 
ఓ తపో ధనులారా శ్రీ మద్రామాయణమును భక్తి శ్రద్దలతో శ్రవణము చేయు నంత వరకు జనుల యొక్క దేహములు పాప భూయిష్టములై ఉండును . 
రామాయణ గాధను పఠన శ్రవణము లు చేసెడి బుద్ధి కలుగుత దుర్లభము . కోట్లకొలది జన్మల పుణ్య ఫల ప్రభావముననే ఆ జనులకు ఆ అదృష్టము పట్టును . 
ఓ ద్విజోత్తములారా చైత్ర ,కార్తీక ,మాఘ మాసముల యందు శుక్ల పక్షమున క్రమముగా 9 దినములు రామాయణ గాధను వినుత వలననే సౌదాసుడు శాప విముక్తుడయ్యెను . 
గౌతమ మహర్షిని అవమానించుట చే కలిగిన శాపముల వలన సౌదాసుడు అను వానికి రాక్షస రూపము ప్రాప్తించెను . రామాయణ శ్రవణ ప్రబావమున అతనికి ఆ శాపము నుండి విముక్తి లభించెను రామ భక్తి తత్పరుడై ఈ గాధను సావధానముగా వినిన మనుజుడు మహా పాపములనుండే గాక ఉప పాతకముల నుండియు విముక్తుడగును. 


     ఇతి ప్రధమోధ్యాయః సమాప్తః 


                 శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 













No comments:

Post a Comment