Friday 6 May 2016

మల్లికార్జున జ్యోతిర్లింగం

          మల్లికార్జున జ్యోతిర్లింగం

శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో శ్రీశైల శిఖరం పై వుంది . ఇది దక్షిణ కైలాసం గా పేరుగాంచింది . ఈ జ్యోతిర్లింగం గురించి శ్రీశైల మహత్యం గురించి పురాణ గాధలున్నాయి . శివుని కుమారులైన కార్తికేయుడు ,గణపతి తమకు వివాహము జరిపించమని తల్లితండ్రులైన పార్వతి పరమేశ్వరుల వద్దకు వెళ్తారు . ఎవరికీ వారు ముందుగా తమ వివాహమే జరిపించమని పట్టు పడతారు దానితో వారిద్దరికీ పార్వతీ పరమేశ్వరులు ఓ పరిక్ష పెడతారు . ఇద్దరిలో ఎవరు ముందుగా సమస్త భూమండలాన్ని చుట్టి వస్తారో వారికి ముందు వివాహం చేస్తామని చెబుతారు . కార్తికేయుడైన కుమారస్వామి  తన నెమలి వాహనాన్ని తీసుకుని ప్రదక్షణ చేసి రావాలని త్వరత్వరగా బయలుదేరి వెళతాడు . గణపతి స్తులకాయుడు అవటం వలన అందులో ఆయన వాహనం మూషికము అవడం వలన కుమారస్వామి  లాగా వేగిరపడక ఎదురుగా ఉన్న తల్లితండ్రులకు ప్రదక్షన చేయడం కంటే శాస్త్ర సమ్మతం అయినది ఏది ఉంటుందని సూక్షం తో తెలుసుకుని వారి చుట్టూ ఏడుసార్లు ప్రదక్షణ చేస్తాడు . కుమారస్వామి తన భుప్రదక్షణ పూర్తి చేసుకుని తిరిగి వచ్చేసరికి వినాయకుడికి సిద్ది ,భుద్ది అనే ఇరువురు  వివాహం జరుగుతుంది . ఈ సంగటన కు కోపం పట్టలేని కుమారస్వామి క్రౌంచ పర్వతం మీదకు వెళ్ళిపోతాడు . కుమారుని అలక తీర్చడానికి తల్లి పార్వతి దేవి కుడా అతని వెంటే వెళ్ళింది . ఆమె వెనుకనే శంకరుడు కుడా వెళ్లి అక్కడ జ్యోతిర్లింగంగా వెలిసాడు . అప్పటి నుండి మల్లికార్జున జ్యోతిర్లింగం పేరుతో ప్రసిద్ది పొందాడు . ఈ లింగాన్ని మల్లికాపుష్పాలతో అర్చన చేసే సాంప్రదాయం వుంది . 

                                                          శ్రీశైల శిఖరం 

హర మహాదేవ శంభో శంకరా 

                                     శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు 






No comments:

Post a Comment