Wednesday 11 May 2016

కాశి విశ్వనాధ జ్యోతిర్లింగం

          కాశి విశ్వనాధ జ్యోతిర్లింగం 

ద్వాదశ జ్యోతిర్లింగాలలో విశ్వనాధ జ్యోతిర్లింగం ఒకటి  . హిందువులు పరమ పవిత్రం    భావించి  ఒక్కసారయినా దర్శించాలని అనుకునే దివ్య క్షేత్రం కాశి .  కాశి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లో వుంది . ప్రళయ కాలం లో కుడా కాశి కి ఎ కొంచుం కూడా  విపత్తు  సంభవించదు . ఆ సమయం లో పరమేశ్వరుడు  తన నివాస స్థలమైన ఈ నగరాన్ని తన త్రిశూలం పై నిలుపుతాడు . సృష్టికి తొలి స్థలంగా ఈ నగరాన్ని పేర్కొంటారు . 


విష్ణు భగవానుడు  ఇక్కడే తపస్సు చేసెను . అగస్త్య మహర్షి ఇక్కడే శివుని గూర్చి తపస్సు చేసి శివుడిని సంతుష్టుడిని చేసుకొనెను . ఈ పరమ పవిత్ర నగరానికి ఉత్తరాన ఓంకారఖండం ,దక్షిణాన కేదారఖండం ,మద్యలో విశ్వేశ్వర ఖండం వున్నాయి . శక్తి మాత తపస్సు   చేసుకోవడానికి పరమేశ్వరుడు ఈ నగరాన్ని సృష్టించి తాను కుడా ఇక్కడే జ్యోతిర్లింగ రూపంలో వెలిసాడు . వారణాశి లో గంగా నదీ తీరం లో జ్యోతిర్లింగా రూపంలో శివభగవానుదు కాశి విశ్వనాదునిగా అనంత భక్త కోటి చేత విశేషమైన పూజలు అందుకుంటున్నాడు . ఇక్కడ గంగ హారతి ప్రసిద్ధం . 

 హర హర మహాదేవ శంభో శంకర 


శశి ,

                             ఎం . ఎ ( తెలుగు ),తెలుగు పండితులు . 















No comments:

Post a Comment