Sunday 15 May 2016

నాగేశ్వర జ్యోతిర్లింగం

              నాగేశ్వర జ్యోతిర్లింగం 

శివ భగవానుడి సుప్రసిద్ద జ్యోతిర్లింగమైన  నాగేశ్వరజ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రం లోని ద్వారకలో వుంది . పూర్వం సుప్రియుడు అనే పేరుగల గొప్ప ధర్మాత్ముడు ,సదాచారుడు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు . అతడు పరమేశ్వరుడి కి అపార భక్తుడు . సుప్రియుడు ఎల్లప్పుడూ ఈశుడి అర్చనలో ,ఆరాధనలో ,ధ్యాన నిమగ్నుడై ఉండేవాడు . తన సమస్త కర్మలు శివునికే అర్పిస్తూ మనోవాక్కాయ కర్మల ద్వారా పరిపూర్ణంగా శివ ద్యానంలోనే గడిపేవాడు . ఇతని శివ భక్తిని చూసి దారుకుడు అనే రాక్షసుడు సహించలేకపోయాడు . అతని శివ పూజలని ఎలాగైనా నిరోధించాలని చూస్తూ ఉంటాడు . ఒకసారి సుప్రియుడు ఒక పడవలో ప్రయాణం చేయడం దారకుడి కంట పడింది . అదే అదనుగా భావించి పడవను ముట్టడించి ,సుప్రియుడిని ,మిగిలిన యాత్రికులని భందీలుగా చేసి తన రాజధాని లోని కారాగృహంలో భందించాడు . అల భందించడం వల్ల సుప్రియుడి శివ పూజలను నిరొధించగలిగాను అనుకుంటాడు . కాని సుప్రియుడు కారాగృహంలో కుడా నియమానుసారం శివ పూజలు చేస్తుంటాడు . అది తెలుసుకున్న దారకుడు కోపం పట్టలేక సుప్రియుడిని సంహరించబోతే శివుడు జ్యోతిర్లింగా రూపంలో ప్రత్యక్షమై సుప్రియుడికి పాశుపతాస్త్రాన్ని అందిస్తాడు . ఆ అస్త్రం తో సుప్రియుడు దారకుడిని సంహరిస్తాడు . శివ భగవానుడి అదేశానుసారమే ఈ జ్యోతిర్లింగానికి నాగేశ్వర జ్యోతిర్లింగం అనే పేరు వచ్చింది . అప్పటి నుండి శంకరుడు భక్తుల పూజలు అందుకుంటూ వారి  నెరవేరుస్తూ  వున్నాడు . 

హర హర మహాదేవ శంభో శంకరా 


                                   శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment