Thursday 5 May 2016

ద్వాదశ జ్యోతిర్లింగములు సోమనాధ జ్యోతిర్లింగం

                   ద్వాదశ జ్యోతిర్లింగములు 

                            సోమనాధ జ్యోతిర్లింగం 

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ సోమనాధ ఆలయం గుజరాత్ లోని "కథియవాడ "క్షేత్రం లోని సముద్ర తీరం లో వుంది . దీనినే ఇదివరకు "ప్రభాస క్షేత్రం "అని కూడా పిలిచేవారు . ఇక్కడి జ్యోతిర్లింగం గురించి ఒక పురాణ గాధ వుంది . 
    దక్ష ప్రజాపతి తన 27 మంది కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహము చేసాడు . కాని చంద్రుడు  మాత్రం దక్షుడి చిన్న కుమార్తె అయిన రోహిణి పైనే ఎక్కువ ప్రేమానురాగాలతో ఉండేవాడు . ఇది గమనించిన దక్షుడు తన అల్లుడికి ఎన్నో విధాల నచ్చచెప్ప చూసాడు . కానీ ప్రయోజనం లేకుండా పోయింది . దానితో ఉగ్రుడైన దక్షుడు చంద్రుని భయంకరమైన క్ష్యయ వ్యాధి గ్రస్తుడవు కమ్మని శపించాడు . ఆ శాపానికి చంద్రుడు సమస్త జగముపై తన సుదాశీలత్వాన్ని వర్షించే శక్తిని కోల్పోయాడు . అప్పుడు బ్రహ్మ దేవుడు చంద్రుడితో ప్రభాస క్షేత్రం లో మ్రుత్యుంజయుడైన శివుడిని ఆరాధిస్తే శాపవిమోచన మవడమే కాకుండా వ్యాధి నుండి విముక్తి లభిస్తుందని చెభుతాడు . శివుడికై చంద్రుడు తపస్సు చేయగా అమరత్వం కలిగేలా వరము ఇచ్చి దక్షుడి మాట ప్రకారము నెలలో 15 రోజులు నీ కళ తగ్గిపోతు వస్తుంది మరో 15 రోజులు నీ కళ రోజు రోజుకి పెరుగుతూ వెన్నెల వెలుగులు చిందిస్తావు . అని పరమేశ్వరుడు చెప్పగా చంద్రుడు సంతోషించి పార్వతీ దేవితో కూడి ఈ క్షెథ్రమన్దె నివసించమని శివుడిని కోరాడు . చంద్రుడి కోరిక మేరకు శివుడు జ్యోతిర్లింగ రూపంలో పార్వతి సమేతుడై ఈ సోమనాధ క్షేత్రంలోనే నివాసం ఏర్పరుచుకున్నాడు . చంద్రుడిని సోముడు అంటారు . చంద్రుడు శివుడిని తన నాదుడిగా భావించి తపస్సు చేసాడు కావున ఈ క్షేత్రానికి సోమనాధ క్షేత్రమనే పేరు స్తిరపడింది . 




సర్వే . జనా సుఖినో భవంతు . 
  

                                     శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 









No comments:

Post a Comment