Monday 16 May 2016

రామేశ్వర జ్యోతిర్లింగం

          రామేశ్వర జ్యోతిర్లింగం 

శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడు లోని రామేశ్వరం లో వుంది . పురుషోత్తముడు అయిన శ్రీ రాముడే స్వయంగా ఇక్కడ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ట చేసెను . సీతాన్వేషణలో శ్రీరామడు లంకకు పయనమై వెళుతుండగా దాహార్తుడై హిందు మహా సముద్రం చివరకు చేరుకున్నాడు . అక్కడ దాహం తీర్చుకోబోగా ఆకాశవాణి మాటలు ఈ విధముగా వినిపిస్తాయి . "నన్ను పూజించాకుండానే జలపానం చేస్తున్నావా "అని అప్పుడు రాముడు   ఇసుకతో శివ లింగాన్ని తయారు చేసి భక్తితో పూజిస్తాడు . అందుకు సంతుష్టుడైన శివుడు ప్రత్యక్షమై రావణుడి చర నుండి సీతను త్వరలోనే విడిపిస్తావు అని  ఆశీస్సులు అందిస్తాడు . ఈ జ్యోతిర్లింగం గురించి మరో కద కుడా ప్రచారంలో వుంది . రావణ వధానంతరం తనను దర్శించడానికి వచ్చిన ఋషి ,ముని పుంగవులతో రాముడు "రావణుని వధించిన పాపానికి ఏదైనా ప్రాయశ్చిత్తం చెప్పండి "అని కోరతాడు . వారంతా శివ లింగాన్ని ప్రతిష్టించమని చెబుతారు . హనుమంతుడు శివలింగాన్ని తీసుకురావడానికి కైలాసానికి వెళ్ళాడు సమయము మించిపోతోందని సీతా దేవి సైకత లింగాన్ని చేయగా రాముడు సీతా సమేతుడై సైకతలింగాన్ని ప్రతిష్ట చేస్తాడు . కైలాసం నుండి వచ్చిన హనుమంతుడు అప్పటికే ప్రతిష్ట అయిపోవడం చూసి అలుకవహించాగా శ్రీ రాముడు ఆన్జనేయుడిని అనునయిస్తూ నీకు వీలయితే సైకత లింగాన్ని పెకలించమని చెబుతాడు . సైకత లింగాన్ని పెకలించ ప్రయత్నించిన హనుమంతుడు పెకలించలేకపోగా ఆమడ దూరంలో పడి  మూర్ఛ పోతాడు . మూర్చ నుండి తేరుకున్న హనుమంతుడు శివ మహిమను తెలుసుకుని పూజిస్తాడు . అప్పటి నుండి  భక్త వత్సలుడు భక్తుల పూజలు అందుకుంటూ వారి కోరికలను తీరుస్తున్నాడు . 



 హర హర మహాదేవ శంభో శంకరా . 


                                      శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 







No comments:

Post a Comment