Monday 9 May 2016

కేదారనాధ జ్యోతిర్లింగం

            కేదారనాధ జ్యోతిర్లింగం 

ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత పుణ్య క్షేత్రంగా ప్రసిద్ది చెందిన శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం పర్వత రాజైన హిమవంతుని కేదారనామక శిఖరం పై వుంది .  ప్రకృతి శోభ ఆహ్లాద కరంగా వుంటుంది ఈ శిఖరం పశ్చిమ భాగంలో పుణ్యమతి మందాకినీ నదీ తీరంలో అవతరించిన కేదారేశ్వర మహా దేవ మందిరం వుంటుంది. శిఖరం తూర్పున అలకనందా నది యొక్క సుందర తీరంలో భదరీనాధుని ప్రసిద్ద మందిరం వుంది . అలకనందా నది మందాకినీ నదులు రెండు క్రిందకి వచ్చి రుద్రప్రయాగలో సంగమిస్తాయి . ఈ విధంగా పరమ పవిత్ర గంగ  నదీ  స్నానం చేసే భక్తులకు కేదారేశ్వర ,భదరీనాధు ల చరణాలు కడిగిన జలాల స్పర్శ లభిస్తుంది . 
     హిమాలయాలలోని కేదారశిఖరం పైన ధర్మ కుమారులైన నర నారాయణులు అనేక సంవత్సరాలు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేసారు . తపస్సు చేసినన్నాళ్లు ఒంటికాలిమీద నిలబడి నిరాహారులై శివనామ స్మరణ చేసారు . వారి భక్తీ లోని  తపస్సు లోని నియమ నిష్టలకు మెచ్చిన పరమ శివుడు ప్రత్యక్షమై ఎం వరం కావాలో కోరుకోమన్నాడు . అప్పుడు నర నారాయణులు " నీవు లింగ రూపంలో ఇక్కడే ప్రతిష్టితమవ్వాలి . నీ నివాసంతో ఈ ప్రాంతమంతా పరం పవిత్రమవుతుంది ". అని భక్తి తో చేతులు జోడించారు . 
  శివ భగవానుడు వారి కోరికను మన్నించి మందాకినీ నదీ తీరంలో నర నారాయణులు తనను ప్రార్ధించిన ప్రదేశంలో లింగ రూపంలో వెలుస్తాడు . ఈ మహా శివ జ్యోతిర్లింగం పర్వత రాజైన హిమవంతుని కేదార నామ శిఖరం పై ఉండడంతో ఇది కేదార జ్యోతిర్లింగం గా ప్రసిద్ది చెందింది . 


హర హర మహాదేవ శంభో శంకరా . 


                                              శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 










No comments:

Post a Comment