Saturday 7 May 2016

మహా కాళేశ్వర జ్యోతిర్లింగం

             మహా కాళేశ్వర జ్యోతిర్లింగం 



పరమ  పవిత్రమైన మహా కాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని నగరం లో వుంది . క్షిప్రానదీ తీరంలో ఉన్న ఈ ఉజ్జయినీ నగరానికి "అవంతికాపురి "అనే పేరు కూడా వుంది . ఇది భారతదేశం లోని పరమ పవిత్రమైన సప్త నగరాలలో ఒకటి . ఈ జ్యోతిర్లింగం గురించి ఓ పురాణ గాధ ప్రచారం లో వుంది . పూర్వం అవంతికా పురంలో వేదాధ్యాయనా పరుడు తఫో నిష్టా గరిష్టుడు ,అత్యంత తేజశ్శాలి అయిన బ్రాహ్మణుడు ఉండేవాడు . అతనికి శివ భక్తులు అయిన నలుగురు కుమారులు వున్నారు . అక్కడికి సమీపంలోని రత్నమాల పర్వతాలపై దూషణుడు అనే దుష్ట రాక్షసుడు తిరుగుతుండేవాడు . అతడు బ్రాహ్మణుల తపస్సుకు భంగం చేయాలన్న తలంపు తో అక్కడకు వచ్చాడు ఆ రాక్షసుడు బ్రహ్మ వరాలు పొందిన మహా శక్తి శాలి కుడా . వర గర్వంతో దూషణుడు చేసే అకృత్యాలు ఎవరు భారిమ్పలేనివిగా ఉండేవి .  దుష్ట దూషణుడు ఉజ్జయిని నగరాన్ని ముట్టడించి అక్కడంతా అల్లకల్లోలం సృష్టిస్తాడు . శివ భక్తులైన బ్రాహ్మకుమారులు నలుగురు తమ నగరాన్ని రక్షించమని శంకరుని శరణు కోరారు . వారలా శివుని ప్రార్ధించడం సహించలేని రాక్షసుడు ఉగ్రుడై వారు నలుగురిని అంతం చేయాలని అనుకుంటుండగా భక్త వత్సలుడు అయిన శివుడు తన హుంకారంతో ఆ రాక్షసుడిని అక్కడికక్కడే భాస్మమోనర్చాడు . భగవంతుడు అక్కడ హుంకార సహితంగా ప్రత్యక్ష మవడం వల్ల ఆయనకు మహా కాలుడు అనే పేరు వచ్చింది . అందువల్లే శివుడు అక్కడ మహ కాలేశ్వరుదు పేరుతో జ్యోతిర్లింగముగా వెలిసి భక్తుల కోరికలను తీరుస్తున్నాడు . 



హర హర మహాదేవ శంభో శంకరా . 


                                                  శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 







No comments:

Post a Comment