Tuesday 3 May 2016

కుబేర వృత్తాంతం

                  కుబేర వృత్తాంతం 


పద్మ కల్పమందు పౌలస్త్యునకు అరిందముడు విశ్రవసుడను పేరున జన్మించెను . విస్రవసునకు వైశ్రవనుండు పుట్టెను . వైశ్రవనుండు ఘోర తపస్సు ఆచరించ శివుడు ప్రత్యక్షమై విశ్వకర్మ చే సముద్ర మధ్యంబున నిర్మింప చేసి దానికి  వైశ్రవనుని  ప్రభువును చేసెను . తర్వాత కొన్నాళ్ళకు వైశ్రవనుని సవతి తమ్ముడు అగు రావణాసురుడు వైశ్రవనుని తరిమివేసి లంక ను ఆక్రమించెను . అప్పుడు వైశ్రవనుడు పూర్వము శివుడు తన కొనగోటితో బ్రహ్మ శిరస్సుని నరికిన ప్రదేశంలో కాశి నగరమును ఏర్పరుచుకుని అందు లింగ ప్రతిష్ట కావించి పరదేవతా ప్రతిష్ట కావించి , ఉపవాసముతో ఒంటి కాలిపై నిలబడి ఘోర తపస్సు చేసెను . అంత కొన్ని దినములకు అతను చిక్కి శల్యమై ఎముకలు చర్మము మాత్రమే మిగిలెను . తపో వేడికి భయపడిన దేవతలు శివుడిని ప్రార్ధించ శివుడు ప్రత్యక్షమయ్యెను . వైశ్రవనుడిని వారము కోరుకోమనగా అతడు "శివా ఎల్లవేళలా నిన్ను పూజించు ఏకాగ్రతను ప్రసాధింపుము నీవు నాకు మిత్రుడుగా ఈ నగర మందే వుండు "అని కోరగా శివుడు సంతోషించి అతడిని యక్ష కిన్నేరులకు అధిపతిని చేసెను . కుబేరుడు అనే పేరుతో అలకాపురమును పాలించమని వరము ప్రసాదించెను . నవనిధుల నిషేపము గురించి చెప్పి మానవులకు ధనము ప్రసాదిస్తు ఉండమని ఆదేశించి అతని పూర్వ జన్మ వ్రుత్తాన్తములను తెలిపి అద్రుశ్యుడు అయ్యెను . ఆ కాశీ నగరములో పరమేశ్వరుడు బ్రహ్మచారిగా కొంత కాలము తపాస్సు చేసెను . పిదప కొంత కాలమునకు ఆత్మ శక్తి సతీ భవాని అనే పేరుతో పుట్టి శివుడిని వివాహము చేసుకొనెను . సతీ దేవి మరణా ననంతరం ఆమె చెవి ఈ నగరములో పడి అచట విశాలాక్షి పేరుతో వెలుగొన్దెను . తదనంతరం ఆమే పార్వతి పేరుతో జనించి శివుడిని చేరెను . 




సర్వే జనా సుఖినో భవంతు . 


                                                      శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 













No comments:

Post a Comment