Tuesday 31 May 2016

రామాయణము ద్వితీయోధ్యాయం

                              రామాయణము      

                          ద్వితీయోధ్యాయం 


గౌతముడు పలికెను 

ఓ విప్రా కార్తీక మాసము నందలి శుక్ల పక్షమున పాడ్యమి నుండి 9 దినములు భక్తి శ్రద్దలతో సాధారణముగా రామాయణ కదా అమృతము గ్రోలుము . నేటి నుండి 12 సంవత్సరముల కాలము ముగియగానే ఈ రాక్షసత్వము నుండి నీకు విముక్తి లభించును . అంతవరకును ఈ శాప ఫలితమును అనుభవించ వలసిందే . 

                               సౌదాసుడు వచించెను 

వెంటనే విప్రుడైన ఆ సౌదాసుడు గురువు పలికిన అనుగ్రహ వచనములకు సంప్రీతుడై ఆయన పాదములకు నమస్కరించి ఇట్లు విన్నవించెను . ఓ గురువరా ఈ రామాయణమును రచించిన మహాత్ముడు ఎవరు ఇందలి వృత్తాంతము ఎవరిదీ ?మొదలగు విషయములను అన్నింటిని సంగ్రహముగా తెల్పుము . 

గౌతముడు పలికెను 

ఓ విప్రుడా వినుము రామాయణ మహా కావ్యమును వాల్మీకి మహర్షి రచించెను . ఆ రామ వృత్తాంతము శ్రద్ధాదారములతో విన్నవాడు తన పాపములనుండి విముక్తుడై మరల తన రూపమును పొందును . దేవా కార్యార్దమై శ్రీ మహా విష్ణువు శ్రీ రాముడిగా ఈ లోకమున అవతరించెను అతడు రావణాది రాక్షసులను హతమార్చెను ఆ మహాత్ముని చరితమును వినుము . మహిమాన్వితమైన ఆ రామాయణము సమస్త పాపములను రూపుమాపును దానిని కార్తీక శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు విన్నచో మహా పుణ్య ఫలము లభించును . అని పలికి తఫో భళా సంపన్నుడై గౌతమ ముని తన ఆశ్రమముకు వెళ్ళెను . రాక్షస శరీరము ప్రాప్తించిన కారణముగా ఆ విప్రుడు మిగుల దుఖితుడయ్యేను అతడు నిత్యము అమితమైన ఆకలి దప్పులతో అలమటించుచుండెను . అందువలన అతనిలో కోపము ఎక్కువయ్యెను . అతడు నల్ల త్రాచు పామువలె భయంకరుడై నిర్జనములైన వన ప్రదేశములలో తిరుగసాగెను . వివిధములగు ప్రసిద్దములైన క్రూర మృగములు మనుష్యులు సర్పములు పక్షులు వానరములు మొదలగు ప్రాణులు అన్నింటిని అతడు భక్షిన్చుచుండెను . ఓ విప్రులారా ఆ రాక్షసుని కారణముగా అనేకములైన ఎముకలతోడను పసుపు ఎరుపు కలెభరములుథొను రక్తమును త్రాగేడి భూతప్రేతములతోడను నిండి అచటి ప్రదేశము లన్నియు భయంకరముగా ఉండెను . అతడు నూరు యోజనముల వైశాల్యము గల ఆ భూభాగము అంతయును 6 మాసములలోనే మిగుల కలుషిత మొనర్చి పిమ్మట మరియొక వనముకు వెళ్ళెను అక్కడ కూడా అతడు నిత్యము నారా మాంసమునే భాక్షింపు చు ఉండెను . సకల ప్రాణులకు భయంకరుడై వున్నా ఆ రాక్షసుడు క్రమముగా నర్మదా నదీ తీరము చేరెను ఇంత లోపల మిగుల ధార్మికుడైన ఒకానొక విప్రుడు అచటికి వచ్చెను . అచ్చటికి వచ్చిన ఆ బ్రాహ్మణుడి పేరు గర్గుడు అతడు సుప్రసిద్దుడు కళింగ దేశమునకు చెందినవాడు . అతడు తన భుజముపైన గంగా జలముతో నిండిన పాత్రను మోయుచు విశ్వేశ్వరుని స్తుతించుచు శ్రీ రాముని నామములను గానము చేయుచు మిక్కిలి సంతోషముతో అచటికి చేరెను . రాక్షసుడిగా మారి యున్న ఆ సౌదాసుడు అచటికి విచ్చేసిన ఆ మునీశ్వరుని చూసి నాకు నేటికి కావలిసిన ఆహారము లభించినది అని అనుకోనచు అతడు చేతులు పైకెత్తి ఆ మునిని సమీపించెను ఆ గర్గ మహర్షి కీర్థించుచున్న దైవ నామములను విని అతడు దూరముననే నిలబడి పోయెను ఆ బ్రాహ్మణోత్తముని చంపుటకు ఆశక్తుడై ఆ రాక్షసుడు ఆయనతో ఇట్లు పలికెను . 

రాక్షసుడు పలికెను 

ఏమాశ్చర్యము ఓ మునివరా !మహాత్ముడవైన నీకు నమస్కారము మీ దైవ నామస్మరణ ప్రభావమున నావంటి రాక్షసులు కుడా దూరముననే నిలిచి పోవుచున్నారు . నేను ఇదివరలో లెక్కలేనంత మంది బ్రాహ్మణులను భక్షిన్చియుంటిని . 
ఓ బ్రాహ్మణుడా దివ్య నామము అనే ఆయుధమే నీకు భద్రకవచమై మహా భయము నుండి నిన్ను కాపాడుచున్నది . రాక్షసులమైన మేము కుడా పరమ శాంతిని పొందు చుంటిమి భగవంతుని మహిమ నిజముగా ఎంత గొప్పది . ఓ మహాత్మా నీవు అన్ని విధములుగా రాగ ద్వేషములు లేనట్టి బ్రాహ్మనోత్తముడవు కనుక నీవు రామ కధను తెలిపి దాని ప్రభావముతో మహా పాపినైన నన్ను ఈ రాక్షస రూపము నుండి విముక్తుని గావింపుము . 
ఓ మునీశ్వరా నేను ఇదివరలో నా గురువును అవమానించితిని . తత్ఫలితముగా రాక్షస శరీరమును పొందుము అని శపింప భడితిని . పిమ్మట గురువు నన్ను అనుగ్రహించి నాతో ఇట్లు వచించెను . 
పూర్వ కాలమున వాల్మీకి మహర్షి శ్రీ రామ గాధను ఓక మహా కావ్యముగా రచించెను . కార్తీకమాస శుక్ల పక్షము నందు 9 దినములు ప్రయత్న పూర్వకముగా దీనిని వినుత వలన మహా పుణ్య ఫలము లభించును ఇంకను ఆ మహాత్ముడు మనోహరమైన శుభప్రదమైన వచనములను ఇట్లు పలికెను పాడ్యమి నుండి 9 దినములు రామాయణ కదా అమృతమును గ్రోలవలెను అని అప్పుడు ఆ రాక్షసుడు ఆమునితో" సర్వ శాస్తార్ధ కోవిద మహాత్మా ,పూజ్యుడవైన ఓ గార్గ మహర్షి అందువలన ఆ పవిత్ర కధను వినిపించి పాపాత్ముడైన నన్ను శాప విముక్తుడిని గావించి రక్షింపుము" అని విన్నవించెను . 

గార్గ మహర్షి పలికెను 

మహాతుడవైన ఓ రాక్షసోత్తమా నీ భుద్ది పవిత్రమైనది . శ్రీ రామును ధ్యానము నందే నిరతులైన వారిని ఎవ్వరును భాదిమ్పజాలరు రామ భక్త పరులు వున్నా చోట త్రిమూర్తులైన బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వరులు వుందురు . రామాయణ ప్రవచనము శ్రవణము చేయుచుండేడి నరులున్న చోట దేవతలు సిద్దులు మొదలగు దివ్య జాతుల వారును వుందురు అందువల్లన కార్తీక మాసము నందలి శుక్ల పక్షము నందు 9 దినములు అనుక్షణము సావదానవుడవై రామాయణ గాధను వినుము . ఆ పవిత్ర రామాయణ వృత్తాంతమును విన్నంత మాథ్రమునె ఆ సౌదాసుని రాక్షసత్వము తొలగిపోయెను . అంతట అతడు రాక్షస స్వభావములనుండి బయట పడి దేవతా సముడు అయ్యెను . పిదప ఆ బ్రాహ్మణోత్తముడు కోటి సూర్య కాంతులతో ప్రకాశించెను . అంతట శ్రీ రామ చంద్రుడు శంక చక్రములను ,గదను ధరించి అభయ హస్తములతో అచట ప్రత్యక్షమై విప్రోత్తముడైన సౌదాసుని కొనియాడిన పిమ్మట ఆ ప్రభువు పరందామముకు చేరెను . 

నారదుడు వచించెను 

ఓ విప్రులారా అందువలన రామ కదా అమృతమును అస్వాదిమ్పుడు . ఈ రామాయణ గాధను భక్తితో పతించెఇ వారు ,వినేది వారు గంగా స్నాన ఫలమును పొందెదరు . 


 ద్వుతీయోద్యయః సమాప్తః 




శశి ,

ఎం . ఎ ?(తెలుగు ),తెలుగు పండితులు 





















No comments:

Post a Comment