Wednesday 1 June 2016

రామాయణం - తృతీయ అధ్యాయః

                                       రామాయణం - తృతీయ అధ్యాయః 

సనత్కుమారుడు పలికెను 

మునిలోకమునకే వన్నె తెచ్చిన ఓ నారద మహర్షి నీవు తెలిపిన ఈ గాధ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించుచున్నది . రామాయణ మహత్యమును ఇంకను విపులముగా వివరింపుము . మరియు ఇతర మాసములలో రామాయణ పఠణ ,శ్రవణ ఫలితములను కూడా దయతో తెలుపుము . ఓ మునీశ్వరా ఆ విశేషములను నీ నోట విన్నప్పుడే మాకు నిజమైన త్రుప్తి కలుగును . 

నారదుడు పలికెను 

ఓ మహర్షులారా శ్రీ రాముని మహిమను భక్తితో వినుటకు ఆశక్తితో వున్నా మీరందరూ యదార్ధముగా దాన్యాత్ములు . ఇందు సందేహము లేదు . ఎవరు ఎంతగా ప్రయత్నించినను ,శ్రీ రాముని మహత్యమును గూర్చి వినేది భాగ్యము అబ్బుట దుర్లభము . అని బ్రహ్మ వాదులైన మునులు పేర్కొనిరి . ఓ రుశులారా వినుడు చిత్రమైన ,ఈ రామాయణ ఇతిహాసము అతి ప్రాచీనమైనది . సమస్త పాపములను పారద్రోలునది సంస్థ కష్టాలను నిర్మూలించునది . 
పూర్వ కాలమున ద్వాపర యుగమున సుమతి అను ఒక మహారాజు కలడు . అతడు చంద్ర వంశమున పుట్టినవాడు . సద్గుణ సంపన్నుడు . 7 ద్వీపములకు ఏకైక ప్రభువు ,ధర్మాత్ముడు ,సత్యసంధుడు ,సకల సంపదలతో తులతూగుచున్నవాడు . అనుక్షణము రామ కధలను వినుత అందే నిమగ్నుడై యుండెడివాడు . అహంకారము లేని వాడు . అతడు నిరంతరము స్వయముగా శ్రీ రాముని పూజించుటఏ కాక రామ పూజా పరాయనులను భక్తి శ్రద్దలతో సేవించుచు ఉండెడివాడు . పూజ్యులను పూజించుటలో నిరతుడు ,ఎత్తి తారతమ్యములను చూపక అందరిని సమానముగా గౌరవించుచు ఉండెడివాడు . ఉదార భుద్ది కలవాడు . అందరికిని మేలు చేయు చున్దేడివాడు . తనకు ఇతరులు చేసిన మేలును మరువని వాడు . చక్కని కీర్తి ,ప్రతిష్టలు కలవాడు . 
ఆ సుమతి మహారాజు భార్య మిక్కిలి గుణవంతురాలు ఆమె పేరు సత్యవతి . సర్వ శుభ లక్షణములు కలది . పతివ్రత . తన పతిని ప్రాణములతో సమానముగా చుసుకోనును . ఆ దంపతులు ఇరువురును నిరంతరము రామాయణ పఠణ ,శ్రావణము,లయందే నిమగ్నులై వుందురు . వారు నిత్యము అన్నదానములతో ,జల దానములతో భూత త్రుప్తి కలిగించుచు ఉండెడివారు . వారు చెరువులను ఉద్యాన వనములను దిగుడు బావులను అసంఖ్యాకముగా నిర్మింప జేసిరి . మహాత్ములైన ఆ మహారాజు ప్రవచన సమయము నందు ,శ్రవణ సమయమునందు భక్తి శ్రద్దలతో రామాయణము నందే నిమగ్నుడై ఉండెను .ఆ మహారాజును మహారాణిని దేవతలు సైతము నిరతము ప్రశంసించున్డెను . 
ముల్లోకములలోను మిక్కిలి ధర్మ పరులుగా పేరు గాంచిన ఆ దంపతులను చూడ గోరినవాడైన విభాండక మహర్షి శిష్యులతో కుడి అక్కడకి వచ్చెను . 
ఆ మహా ముని రాకను తెలుసుకుని ఆ మహారాజు భార్యా సమేతుడై పూజా ద్రవ్యములను సమృద్దిగా తీసుకుని ఎదురు వెళ్లి ఆయనను దర్శించెను . పిమ్మట ఆ మహారాజు అతిధి సత్కారములతో ఆ మునిని సంత్రుప్తుడను కావించి వున్నతాసనముపై ఆయనను కుర్చోపెట్టెను . అతడు అంతకంటెను ఎత్తు తక్కువగా వున్న ఒక ఆసనమున కుర్చుని నమస్కారము చేసి వినమ్రుడై ఆ మహర్షితో ఈ విధముగా అనెను . 

రాజు పలికెను 

అయ్యా పూజ్య మహర్షి మీ ఆగమముతో నేను ధన్యుడను అయ్యాను . సత్పురుషులరాక ,సుఖ సంతోషములను గూర్చునని పెద్దలు పల్కుదురు . మహాత్ముల అనుగ్రహము ప్రసరించేది చోట సంస్థ సంపదలు ,కీర్తి ,ప్రతిష్టలు ,అంతులేని ఆనందము ,దన ధాన్యములు ,సంతాన సమృద్ది ,వెళ్లి విరుసునని గొప్పవారు చెబుతూ వుంటారు . ఓ మహా ముని సత్పురుషుల కరుణ ప్రసరించేది చోట నిరంతరము సకల శ్రెయోబివ్రుద్దులు సమకూరును . 
ఓ బ్రహ్మర్షి విప్రోత్తములయొక్క పవిత్ర పాదోదకము శిరస్సున ధరించిన వానికి సకల తీర్ధముల లో స్నానం చేసిన ఫలితము లభించును . దీనికి సందేహము ఏమి లేదు . 
ఓ బ్రహ్మర్షీ శాంతాత్మా నా సమస్త సంపదలను భార్యా పుత్రులను మీ పాదముల చెంత సమర్పించుచున్నాను . ఈ సేవకుడు ఇంకను మీకు ఏమి చేయవలయునో ఆజ్ఞాపించండి . 
వినయముతో నమస్కరించుచున్న ఆ రాజును చూసి విభాండక మహా ముని ఆయనను తన చేతులతో తాకి మిక్కిలి సంతోషముతో ఇట్లు పలికెను . 

విభాండక మహర్షి పలికెను . 

ఓ మహారాజా నీవు పలికిన వచనములు అన్నీ మీ వశము యొక్క గొప్పతనానికి తగినట్లుగా వున్నాయి . ఇట్టి వినయశీలురు అందరును పరమ శ్రేయస్సును పొందుతారు . 
ఓ రాజా సన్మార్గములలొ సాగిపోవుచున్న నీ మీద నేను ప్రసన్నుడను అయ్యాను . ఓ మహాత్మా నీకు శుభ పరంపర ప్రాప్తించుగాక . నేను  అడిగిన విషయములను విశధపరుచుము . 
శ్రీ మహా విష్ణువును సంతృప్తి పరిచేటి పురాణములు చాలా కలవు . మాఘ మాసము నందు రామాయణ ప్రవచన ,శ్రవణములకు పూనుకొని వున్నావు  . పరమ సాద్వి అయిన నీ ధర్మపత్ని ఈ రామ కార్యమున నీకు సహధర్మ చారినియై నిలిచినది . ఇట్టి నీ సేవా కార్యక్రమములకు కారణం ఏంటో సవిస్తారముగా తెలుపుము . 

రాజు పలికెను 

ఓ పూజ్య మహర్షి మీరడిగిన విషయములను అన్నింటిని తెలిపెదను వినుము ,మా దంపతుల చరిత్రము సమస్త లోకములకు ఆశ్చర్యమును కలిగించుచున్నది . 
ఓ సాదు శిరోమణి పూర్వ జన్మలో నేను మాలిని అను పేరు కల శూద్రుడను సమస్త ప్రాణులకు హాని కలిగించుటే పనిగా రోజు చెడు మార్గములలో ప్రవర్తిస్తూ ఉండేవాడిని . ఇతరులపై పితూరీలను చెబుతూ ఉండేవాడిని . ధర్మ మార్గములకు వ్యతిరేఖినై దేవతా వస్తువులను అపహరించుచు వుండేవాడను . మహా పాపులతో కలిసి తిరుగుతూ దేవతా వస్తువులతో జీవిస్తూ ఉండేవాడిని . గో హత్యలను  ,బ్రాహ్మణ హత్యలను చేసేడివాడను . నిత్యమూ దొంగతనాలు ,హత్యలు చేస్తూ వుండే వాడిని . ఎప్పుడు పరుషముగా మాట్లాడేవాడిని . పాపాత్ముడనై ,వేశ్యాలోలుడనై జీవిస్తూ వుండే వాడిని . 
ఇట్లు కొంత కాలము గడిచిన తరువాత పెద్దల మాటలను పెడచెవిన పెట్టిన కారణముగా భండువులు అందరు నాకు దూరమయ్యారు . అప్పుడు భాద కలిగి అడవులపాలయ్యాను . 
ప్రతి రోజు జంతువులను చంపి వాటి మాంసములు తింటూ ఆకలి తీర్చుకుంటూ ఉండేవాడిని . ఆ అడవిలో బాటసారులను అడ్డగించి వారిని దోచుకోసాగాను . ఆ నిర్జన ప్రదేశములో అనేక కష్టాలకు ఓర్చుకుంటూ ఒంటరిగా జీవిన్చుచు ఉండేవాడిని . 
ఇలా వుండగా ఒకనాడు వేసవి వేడి వలన ,ఆకలి దప్పుల వలన తట్టుకోలేక బాగా అలసిపోయాను . ఇంతలో ఆ నిర్జన అరణ్యములో దైవ మహిమ వలన నాకు వశిష్టుని ఆశ్రమము కనిపించెను . 
ఆ ఆశ్రమము సమీపములో ఒక మహా సరస్సు వున్నది . చాలామంది మునీశ్వరులుఅక్కద ఆ సరస్సు వద్ద వున్నారు . ఆ సరస్సులోని నీటిని తాగి దాని వొడ్డున సేద తీర్చుకున్నాను . పిమ్మట చెట్లు పీకి పాటి వేర్లతో ఆకలి తీర్చుకున్నాను . 
నేను వశిష్టుని ఆశ్రమమునకు దగ్గరలోనే పగిలిపోయిన స్పటిక శిలలను పేర్చి గోడలను నిర్మించితిని . ఆ గోడలపై కర్రలను పరచి వాటిపై ఆకులను గడ్డిని కప్పి ఒక చక్కని గృహమును ఏర్పరుచుకొని దానిలో నివశింప సాగితిని . 
అక్కడ వేటగాని వృత్తిని అవలంభించి చాటు మాటుగా దాక్కుని అనేక విధములైన జంతువులను చంపుతూ వాటి మాంసములను తింటూ 20 సంవత్సరములపాటు అక్కడే వున్నాను . 
ఈ సాద్వి పూర్వ జన్మలో వింధ్య పర్వత ప్రాంతములో నిషాద వంశములో జన్మించింది . అప్పుడు ఈమె పేరు కాళి . నేను వశిష్టాశ్రమ దగ్గరలో నివశించుచు వుండగా ఈమె నా దగ్గరకు వచ్చింది . బంధువులు అందరు దూరమై పోవుటచే ఈమె మిక్కిలి దుఃఖముతో భాదతో ఉండెను . 
ఓ బ్రహ్మర్షి ఈమె ఆకలి దప్పులతో అలమటిన్చుచ్చు అన్నపానములై ఎంతో బాధపడుతుండెను . అట్లు నిర్జన వనము నందు సంచరించుచు దైవానుగ్రహముతో ఈమె నా దగ్గరకు చేరింది . వేసవి కాలము సూర్య తాపమునకు తోడు ఎదురైనా కష్టముల కారణముగా మనస్తాపము ఈమెను పీల్చి పిప్పిచేసినది . అట్లు దుఖములతో కృశించి ఉన్న ఈమెను చూసి నాకు మిక్కిలి జాలి కలిగింది . 
ఓ బ్రహ్మర్షి వెంటనే ఈమెకు జలములను మాంసమును అడవి పండ్లను ఇచ్చాను . వాటి ని తినటంతో శ్రమ అంతా తొలగిపోయి ఈమె మిక్కిలి సంతోషించెను . పిమ్మట ఈమె తన వృత్తాంతము నాకు చెప్పెను . ఓ మహా ముని ఆ విశేషములను చెబుతాను వినుము . 
ఓ విద్వాంసుడా నిషాద కులమున పుట్టిన ఈమె పేరు కాళి . దావికుడు ఈమె తండ్రి  వింధ్య పర్వత ప్రాంతమున నివసిస్తువుండెను . ఈమె రోజు దొంగిలిస్తూ వుండేది . ఎల్లప్పుడూ ఇతరులపై చాడీలు చెప్పుట ఈమెకు సహజము . పతిని చంపిన హంతకురాలు అవుత వలన ఈమెను బందువులు అడవుల పాలు చేసిరి . క్రమముగా ఈమె నా వద్దకు చేరినది . 
ఓ మునీశ్వరా ఈ విధముగా ఈమె తన జీవితము గురించి నాకు తెలిపెను పవితేమైన వశిష్టాశ్రమ సమీపమున నేను ఈమె దంపతులుగా జీవించుచు వుంటిమి . ప్రతి దినము మేము మాంసాహారముతో కాలము గడుపు చుంటిమి . 
మేము ఇద్దరమూ ఋషులు తినగా మిగిలిన ప్రసాదమునకై వశిశ్తాస్రమముకు వెళ్లి వచ్చుచు వుంటిమి . ఇట్లుండగా ఒకనాడు పవిత్రమైన ఆ ప్రదేశమున దేవర్షుల సమూహము ఉన్నప్పటికీ ఆకలి తొందరచో అచటికి చేరితిమి . మాఘ మాసమున ప్రతి దినము రామాయణ పారాయణము నందు నిరతులైన విప్రులు అక్కడ మాకు కనబడిరి . ఆకలితో ఉండుట వలన మేము మిక్కి అలసిపోయి వుంటిమి . ఆ వశిష్టాశ్రమమునకు మేము అప్రయత్నముగా చేరితిని . మాలో ఏర్పడిన భక్తి కారణముగా రామాయణ గాధను వరసగా 9 దినములు వింటిమి . ఆ సమయము నందే మేము ఇద్దరమూ మృతి చెందాము మా రామాయణ శ్రవణ పుణ్య కారణముగా శ్రీ మహా విష్ణువు సంతసించి తీసుకొని పోవుటకై తన దూతలను పంపెను . ఆ దూతలు మా ఇరువురిని విమానముపై పరమ పదమునకు వెళ్ళిరి . ఆ విధముగా మేము ఇద్దరమూ ఆ దేవా దేవుని సన్నిదికి చేరితిమి 
 ఓ మహర్షీ మేము అచట ఎంత కాలము ఉన్నామో ఏ ఎ సుఖ్ భోగములు అనుభవించామో తెలిపెదను వినుము . 
అనేక వేల సంవత్సరముల వరకు ఆ శ్రీ రామ దామమున వుండి పిదప బ్రహ్మ లోకమునకు చేరితిమి . ఆ సత్య లోకము నందు ఎంతో కాలము వుంది పిదప ఇంద్ర లోకమునకు వచ్చాము . ఆ స్వర్గము నందు కొంత కాలము వుండి అచట దివ్య భోగములను అనుభావించితిమి . ఓ మునీశ్వర అనంతరము క్రమముగా మేము ఇరువురము భోలోకమున రాజ కుటుంభములలో జన్మించితిమి . రామాయణ మహిమా ప్రభావమున ఈ లోకము నందు అపూర్వ సంపదలను పొందితిమి.  మేము అప్రయత్నముగానే రామాయణ శ్రవణము చేసినను ఇట్టి వైభవము మాకు లభించినది . ఓ ధర్మాత్మా జనన మరణ భయములను వార్ధక్య భీతిని పారద్రోలునట్టి రామాయణ కదామ్రుతము వరుసగా 9 దినములు భక్తి శ్రద్దలతో సేవించవలెను . ఓ విప్రోత్తమా అప్రయత్నముగానైనా రామాయణ శ్రావణము చేసినచో తత్ప్రభావమున మానవులకు అనంత పుణ్య ఫలములు లభించును . 

నారదుడు పలికెను 

అంతట విభాండక మహర్షి ఈ సంస్థ గాధను విని మాహారాజుకి నమస్కరించి తన తపో వనమునకు వెళ్ళెను . ఓ విప్రోత్తములారా అందువలన వినండి . చక్రధరుడు దేవదేవుడు అయిన శ్రీ రాముని ఈ కధ సకల కోరికలను సిద్ధింప చేసెడి కామధేనువు వంటిది . రామాయణ మహా కావ్యము సమస్త ధర్మ ఫలములను ప్రసాదించును . కావున ఈ రామ గాధను మాఘ మాసము నందు శుక్ల పక్షమున క్రమముగా 9 దినములు ప్రయత్న పూర్వకముగా వినవలెను . శ్రీ మద్రామాయణము అతి పవిత్రమైనది . సమస్త పాపములను రూపు మాపునది దీనిని చదివిన వారికిని , వినిన వారికి శ్రీ రాముని అందు గాడ మైన భక్తి కుదురుకొని ఉండును . 

ఇతి త్రుతీయోధ్యాయః సమాప్తః 


                       శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు 












































No comments:

Post a Comment