Tuesday 10 December 2019

రామాయణము యుద్ధకాండ -డెబ్బదితొమ్మిదవసర్గ

                             రామాయణము 

                                  యుద్ధకాండ -డెబ్బదితొమ్మిదవసర్గ 

రావని ఆజ్ఞతో తన సైన్యమును తీసుకుని యుద్ధరంగమునకు వచ్చిన మకరాక్షునికి శ్రీరామునికి మధ్య తీవ్రమైన యుద్ధము జరిగెను . అంతట ఖరుడి కుమారుడైన మఖరాక్షుడు శ్రీరాముని దాటికి నిలవలేక ఆ మాహాబాహు చేతిలో మరణించెను . ఆ సమయములో జయజయ ద్వానములు వానర సైన్యములో మిన్ను ముట్టినవి . 

రామాయణము యుద్ధకాండ డెబ్బదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము యుద్ధకాండ -డెబ్బదియెనిమిదవసర్గ

                                    రామాయణము 

                                   యుద్ధకాండ -డెబ్బదియెనిమిదవసర్గ 

కుంభ నికుంభులు సమరభూమికి బలి అయ్యారని తెలిసిన రావణుడు ప్రజ్వలించిన అగ్ని వలె అసహనంతో మండిపడెను . వెంటనే అతడు ఖరుని పుత్రుడైన మకరాక్షుని పిలిపించి ,రామలక్ష్మణులను సంహరించిరమ్మని ఆజ్ఞాపించెను . 
రావణుని ఆజ్ఞ ప్రకారము మకరాక్షుడు సైన్యముతో సహా ,యుద్ధమునకు బయలుదేరి వెళ్లెను . 

రామాయణము యుద్ధకాండ డెబ్బదియెనిమిదవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Tuesday 22 October 2019

రామాయణము యుద్ధకాండ -డెబ్బదియేడవసర్గ

                                      రామాయణము 

                                     యుద్ధకాండ -డెబ్బదియేడవసర్గ 

తన సోదరుడైన కుంభుడు మరణించుట చూసిన నికుంభుడు యుద్దములో విజృంభించెను . తుదకు మారుతి చేతిలో చచ్చెను . అది చూసిన వానరవీరులు దిక్కులు పిక్కటిల్లేలా కోలాహలధ్వనులు చేసిరి . ఆ ధ్వనులకు భూమి కంపించినట్టుగా ,ఆకాశము బద్దలైనట్టుగా అనిపించెను . అప్పుడు రాక్షస సైనికుల గుండెలు గుభిల్లుమనినవి . 
పిమ్మట శ్రీరామునికి ఖరుడి కుమారుడైన మకరాక్షుడికి మధ్య మిక్కిలి భయంకరంగా యుద్ధము జరిగినది . 

రామాయణము యుద్ధకాండ డెబ్బదియేడవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము యుద్ధకాండ -డెబ్బదియారవసర్గ

                              రామాయణము 

                             యుద్ధకాండ -డెబ్బదియారవసర్గ 

భయంకరముగా జరుగుతున్న ఆ యుద్దములో అంగదుడు కంపనుడు అను రాక్షసుడిని ,ప్రజంఘుడు అను వానిని చంపివేసెను . కుంభుడితో కూడా తలపడెను . కుంభుడి దాటికి తట్టుకొనలేక స్పృహ తప్పు స్థితిలో వున్న అంగదునికి తోడుగా సుగ్రీవుడు వచ్చి ,కుంభుడిని ఎదిరించి చంపివేసెను . అది చూసిన రాక్షస సైనికులు భయముతో వణికిరి . 

       రామాయణము యుద్ధకాండ డెబ్బదియారవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము యుద్ధకాండ -డెబ్బదియైదవసర్గ

                                  రామాయణము 

                                    యుద్ధకాండ -డెబ్బదియైదవసర్గ 

సుగ్రీవుడు శ్రీరాముడితో జరిగిన యుద్ధమును అంతా అలోచించి ,హనుమతో "హనుమా !మన వానరవీరులు కాగడాలచేతబూని ఈ రోజు రాత్రి సమయములో లంకా నగరమునకు నిప్పుపెట్టవలెను "అని ఆజ్ఞాపించెను . సుగ్రీవుడి ఆజ్ఞ మేరకు వానరులు ప్రాకారమును దాటి లంకా నగరంలోకి ప్రవేశించి ,ఆ నగరములోకల ప్రాకారములు ఇళ్లకు నిప్పు పెట్టసాగెను . దానితో భయపడిన రాక్షసులు పారిపోసాగిరి . ఇళ్లకు నిప్పు అంటుకోవటంతో ,ఆ లంకా నగరము అంతా హాహాకారములు చెలరేగినవి . అది గమనించిన రావణుడు కుంభకర్ణుని కుమారులైన కుంభుడు ,నికుంభుడు అనువారిని వారికి తోడుగా అనేక బలగములను ఇచ్చి యుద్ధమునకు పంపెను . యుద్ధము కోసమే ఎదురుచూస్తున్న వానరవీరులు రెట్టింపు ఉత్సాహముతో యుద్ధమునకు దిగిరి . ఆ రాత్రి సమయములో వానరులకు రాక్షసులకు మధ్య భయంకరమైన యుద్ధము జరిగెను . 

రామాయణము యుద్ధకాండ డెబ్బదియైదవసర్గ సమాప్తము . 

                           శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Tuesday 15 October 2019

రామాయణము యుద్ధకాండ -డెబ్బదినాలుగవసర్గ

                                  రామాయణము 

                                    యుద్ధకాండ -డెబ్బదినాలుగవసర్గ 

ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రము ప్రభావమున రామలక్ష్మణులు స్పృహతప్పి నేలపై పది ఉండిరి . ఆ బ్రహ్మాస్త్ర ప్రభావంతో ఆ సాయంత్రము అరువదియేడు కోట్లమంది వానరులు మరణించిరి . మిగిలినవారు గాయములతో కొనఊపిరితో ఉండిరి . అంతటా హాహాకారములు మారుమ్రోగగా విభీషణుడు ,హనుమంతుడు ధైర్యము తెచ్చుకుని తమవారెవరెవరు మరణించిరో ,ఎవరు సజీవంగా వుంటిరో తెలుసుకొనుటకు యుద్ధరంగము కలియతిరగసాగిరి . వారికి శరీరమంతా గాయములతో చూపు సరిగా కనిపించని స్థితిలో ఉన్న జాంబవంతుడు కనిపించాడు . 
విభీషణుడు జాంబవంతుడిని పలకరించగా ,జాంబవంతుడు అతడి కంఠస్వరమును గుర్తించి హనుమ క్షేమసమాచారమును అడిగాడు . రామలక్ష్మణుల క్షేమసమాచారము అడగకుండా ,హనుమ క్షేమసమాచారము అడిగినందుకు ఆశ్చర్యపోయిన విభీషణుడు కారణము అడుగగా ,"హనుమ జీవించి ఉంటే ఎంతమంది మరణించినా విజయము మనదే ,హనుమంతుడు లేనట్టయితే ఎంతమంది జీవించి వున్నా విజయము సాధించలేము "అని సమాధానము చెప్పి ,హనుమతో "హనుమా !మహాపరాక్రమవంతా !ఇప్పుడు వానరభల్లూక సేన జీవనము నీ చేతిలో వున్నది . నీవు నీ పరాక్రమమును ప్రదర్శించుచు ,సముద్రమును దాటి ,హిమగిరిని చేరి ,అక్కడ కల వృషభగిరికి ,కైలాస పర్వతమునకు మధ్యకల ఓషదగిరిపై కల మృతసంజీవనీ ,విశల్యకరణి ,సంధానకరణి ,సావర్ణ్యకరణి అను పేర్లు కల ఓషధులను వెనువెంటనే ఏమాత్రము ఆలస్యము చేయక తీసుకునిరా "అని పలికెను . 
జాంబవంతుని మాటలు విన్న హనుమ క్షణము కూడా ఆలస్యము చేయక ,వెంటనే తన శరీరమును పెంచి ,సముద్రమును లంఘించి ,హిమగిరి చేరి అచటకల మహిషదీ పర్వతమును చూసేను . తనకు కావలిసిన ఓషదులకోసము వెతుకగా అవి కనిపించలేదు . వెంటనే హనుమ తన బలమును ప్రదర్శించుచు ఆ పర్వతమును పెకలించి ,దానిని తీసుకుని ఆకాశములో ఎగురుతూ వానరసైన్యము మధ్యకు చేరెను . 

ఆ ఓషధీ వాసనలు తగిలినంతనే  మరణించిన వానరులందరూ నిద్రనుండి లేచినట్టు లేచి కూర్చుండిరి . వారి శరీరములపై కల గాయములన్నీ మాయమయినవి . రామలక్ష్మణులు కూడా పూర్తి స్వస్తులై లేచిరి . వానరసైన్యము హనుమను పొగిడిరి . జయజయద్వానములు చేసిరి . ఆ శబ్దములకు లంకలోని రాక్షసులు భయపడిరి . అప్పుడు హనుమ ఆ ఓషధీ పర్వతమును మరల తీసుకువెళ్లి యధాస్థానంలో పెట్టి ,తిరిగి వానరసైన్యము మధ్యకు వచ్చి చేరెను . 

రామాయణము యుద్ధకాండ డెబ్బదినాలుగవసర్గ సమాప్తము . 

                                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







రామాయణము యుద్ధకాండ -డెబ్బదిమూడవసర్గ

                                   రామాయణము 

                                 యుద్ధకాండ  -డెబ్బదిమూడవసర్గ 

తన సోదరులు ,పుత్రులు మరణించుటచే వారిని తలుచుకుని దుఃఖించుచున్న రావణుడిని చూసిన అతని కుమారుడు ఇంద్రజిత్తు ,తండ్రికి ధైర్యము చెప్పి ,అగ్నికార్యము చేసి అగ్ని దేవుడికి హవిస్సులను సమర్పించి ,బ్రహ్మాస్త్రమును తీసుకుని అదృశ్య రూపములో యుద్ధరంగమునకు వెళ్లెను . అక్కడి ఎవ్వరికి కనపడకుండా వానరసైన్యముపై బాణవర్షమును కురిపించెను . అతడి బాణపరంపరకు వానరసైన్యము రక్తసిత్తమయ్యెను . పెక్కుమంది యుద్ధ భూమిలో పడిపోయిరి . 
సుగ్రీవుడు ,నలుడు ,నీలుడు ,హనుమంతుడు ,జాంబవంతుడు మొదలగు వీరులుకూడా ,ఇంద్రజిత్తు చేతిలో గాయములపాలయ్యిరి . వారు తిరిగి దాడి చేయుటకు ఇంద్రజిత్తు ఎక్కడఉన్నాడో తెలియలేదు . రామలక్ష్మణులపై ఇంద్రజిత్తు మంత్రించి బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను . అది వారిని బాదించకపోయినను ,బ్రహ్మదేవుడుపై కల గౌరవముతో వారు స్పృహ తప్పినట్టుగా యుద్దభూమిపై పడిపోయిరి . అది చూసిన రాక్షస వీరులు ఇంద్రజిత్తుకి జయజయద్వానములు చేసిరి . అది చూసిన ఇంద్రజిత్తు లంకా నగరంలోకి ప్రవేశించి తండ్రి వద్దకు వెళ్లి జరిగిన యుద్ధమును ఉత్సాహముతో చెప్పెను . 

రామాయణము యుద్ధకాండ డెబ్బదిమూడవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



రామాయణము యుద్ధకాండ -డెబ్బదిరెండవసర్గ

                                    రామాయణము 

                                     యుద్ధకాండ -డెబ్బదిరెండవసర్గ 

మిక్కిలి తేజోమూర్తి ఐన లక్ష్మణుడి చేతిలో అతికాయుడు మరణించిన వార్త విన్న రావణుడు మిక్కిలి బాధపడి తన సభలోని వారితో ఇలా పలికెను . "మన రాక్షసులలో మిక్కిలి బలశాలురైన అనేకమంది రాక్షసవీరులు శత్రువుల చేతిలో మరణించారు . ఇంతకూ ముందు ఎప్పుడు ఓటమి ఎరుగని మహావీరులు కూడా శ్రీరాముడి సైన్యము ముందు నిలవలేక మరణించారు . శ్రీరాముడు మెచ్చుకోదగిన మహావీరుడే . మన లంకా నగర రక్షణ వ్యవస్థను పటిష్టము చేయండి . లంకా నగర ద్వారముల వద్ద రక్షణను అధికము చేయండి . "అని చెప్పి దీనావదనుడై అంతః పురములోకి ప్రవేశించెను . 

రామాయణము యుద్ధకాండ డెబ్బదిరెండవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Tuesday 1 October 2019

రామాయణము యుద్ధకాండ -డెబ్బదియొకటవసర్గ

                                  రామాయణము 

                                      యుద్ధకాండ -డెబ్బదియొకటవసర్గ 

రావణుని కుమారులలో ,అతికాయుడు మిక్కిలి బలశాలి ,పర్వతము వలె దృఢమైన దేహము కలవాడు . బ్రహ్మ నుండి వరములు పొందినవాడు . దేవదానవుల దర్పములు అనిచినవాడు . అతడు తన పినతండ్రులు ,తన సోదరులు శత్రువులు మరణించారని తెలిసి ఎంతో కోపముతో రధమును అధిరోహించి ,యుద్ధమునకు వెళ్లెను . అతడి భారీ దేహమును చూసిన వానరసైన్యము కుంభకర్ణుడే మరలా లేచి వచ్చాడా ?అని భ్రమించి ,భయముతో పరుగులు తీయసాగిరి . 
అది చూసిన శ్రీరాముడు విభీషణుడిని అతికాయుడు గురించి అడిగెను . అప్పుడు విభీషణుడు శ్రీరామునితో" రామా !అతడు రావుణుడి కుమారుడైన అతికాయుడు . మహావీరుడు ,అస్త్రవేత్తలలో శ్రేష్ఠుడు . సామ భేద దాన దండోపాయమములలో చతురుడు . యితడు రావణుడి పత్ని ధాన్యమాలీ యొక్క కుమారుడు . యితడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి ,అనేక అస్త్రశస్త్రములను పొందాడు . సురాసురులచే చావులేకుండా వరమును కూడా పొందాడు . అతడు ధరించిన దివ్యమైన కవచము ,అతడు ఎక్కి వస్తున్న రధమును బ్రహ్మదేవుడే ఇతడికి అనుగ్రహించాడు . ఇతడి చేతిలో వందలమంది దేవతలు ,దానవులు పరాజితులయిరి . ఇంద్రుని వజ్రాయుధము కూడా ఇతడి ముందు నిర్వీర్యమయినది . వరుణుని యొక్క పాశము కూడా నిర్వీర్యమైనది . వెంటనే ఇతడిని నిహతుడిని చేయనిచో మన వానరసైన్యమును మొత్తమును నాశనము చేయగలడు "అని పలికెను . 
బీకరుడైన అతికాయుడు యుద్ధరంగములోకి ప్రవేశించుట చూసిన ,కుముదుడు ,ద్వివిదుడు ,మైందుడు ,నీలుడు ,శరభుడు మొదలైన వానరవీరులు ఒక్కుమ్మడిగా అతడిపై దాడికి దిగిరి . కానీ వారందరూ అతికాయుడి పరాక్రము ముందు నిలవలేక పోయిరి . అతికాయుడు తనను ఎదిరించని వానరుల జోలికి వెళ్ళుటలేదు . తనతో యుద్ధమునకు వచ్చిన వాడిని వదులుటలేదు . ఇదంతా గమనించిన లక్ష్మణుడు ,అతికాయుడితో యుద్ధమునకు దిగెను . వారిరువురి మధ్య యుద్ధము భయంకరముగా జరిగెను . చివరికి లక్ష్మణుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమును తప్పించుకొనలేక అతికాయుడు మరణించేను . 
అతికాయుడు మరణించుట చూసిన వానరవీరులందరూ లక్ష్మణుని వేనోళ్ళ పొగిడిరి . వారందరూ ఆ విధముగా పొగుడుతుండగా ,లక్ష్మణుడు తన అన్న ఐన శ్రీరాముడి వద్దకు చేరెను . 

రామాయణము యుద్ధకాండ డెబ్బదియొకటవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







Monday 30 September 2019

రామాయణము యుద్ధకాండ -డెబ్బదియవసర్గ

                                   రామాయణము 

                                   యుద్ధకాండ -డెబ్బదియవసర్గ 

నరాంతకుడు అంగదుని చేతిలో మరణించుట చూసిన దేవాంతకుడు ,త్రిశరుడు ,మహోదరుడు అంగదుని మీదకు దాడికి వెళ్లి ఒక్కసారిగా అంగదునితో యుద్ధమునకు దిగెను . అది చూసిన హనుమంతుడు నీలుడు అంగదునికి తోడుగా అచటికి వెళ్లిరి . వారందరి మధ్య యుద్ధము ఉదృతముగా సాగెను . హనుమంతుడి ముష్టి ఘాతములకు దేవాంతకుడు అసువులు కోల్పోయి నేలపై పడిపోయెను . 
నీలుడి చేతిలో మహోదరుడి తలపై బలముగా కొట్టగా అతడు అక్కడికక్కడే మరణించెను . హనుమంతుడి చేతిలో త్రిశరుడు మరణించెను . పిమ్మట మహాపార్శ్వుడు ఋషభుడి చేతిలో మరణించెను . రాక్షస వీరులు వీరందరూ మరణించుట చూసి భయముతో తమ చేతిలోని ఆయుధములను పారవేసి ,పారిపోసాగిరి . 

రామాయణము యుద్ధకాండ డెబ్బదియవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము యుద్ధకాండ -అరువదితొమ్మిదవసర్గ

                               రామాయణము 

                                 యుద్ధకాండ -అరువదితొమ్మిదవసర్గ 

కుంభకర్ణుడి మరణముతో విలపించుచున్న రావణుని అతడి పుత్రుడైన త్రిశరుడు అనువాడు ఓదార్చి ,యుద్ధమునకు బయలుదేరెను . అతడి యుద్ధమునకు బయలుదేరుట చూసిన దేవాంతకుడు ,నరాంతకుడు ,అతికాయుడు అను పేర్లు కల రావణుని కుమారులు కూడా సమరోత్సాహముతో యుద్ధమునకు బయలుదేరి ,రావణుని కి నమస్కారము చేసి ,ప్రదక్షణ చేసెను . అప్పుడు రావణుడు తన కుమారులకు తోడుగా ,మహాపార్శ్వుడు ,మహోదరుడు అను తన సోదరులను యుద్ధమునకు వారితో పాటుగా పంపెను . 
వారెందరో ఎంతో ఉత్సాహముతో యుద్ధ భూమిలోకి అడుగుపెట్టిరి . అక్కడి వానరులతో యుద్ధమును ఆరంభించిరి . వానరులు తన గోళ్ళతో ,పళ్లతో రాక్షసులను గాయపరిచి హింసించసాగిరి . యుద్ధము ఉదృతముగా సాగెను. అప్పుడు నరాంతకుడు సుగ్రీవుడి సైన్యము వైపుగా యుద్ధము చేస్తూ సాగెను . దారిలో కనిపించిన అనేక వానరులను చంపసాగెను . దానితో వానరులు బయపడి పారిపోసాగిరి . అది చూసిన సుగ్రీవుడు ,అంగదుని నరాంతకుడితో యుద్ధమునకు పంపెను . వారిరువురి మధ్య జరిగిన యుద్దములో అంగదుని చేతిలో నరాంతకుడు మరణించెను . 

రామాయణము యుద్ధకాండ అరువదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Sunday 29 September 2019

రామాయణము యుద్ధకాండ -అరువదియెనిమిదవసర్గ

                                   రామాయణము 

                                      యుద్ధకాండ -అరువదియెనిమిదవసర్గ 

కుంభకర్ణుడు శ్రీరాముడి చేతిలో మరణించగానే రాక్షసవీరులు భయముతో లంకలోకి పారిపోయిరి . వారందరూ రాక్షసరాజైన రావణుని వద్దకు వెళ్లి ,కుంభకర్ణుని మరణవార్తను తెలిపిరి . 
ఆ వార్త విన్న వెంటనే రావణుడు స్పృహ తప్పి పడిపోయెను . చాలా సేపటి తర్వాత లేచి ,కుంభకర్ణుని తలచుకుని నేలపై పడి ఎక్కీఎక్కీ ఏడవసాగెను . 

రామాయణము యుద్ధకాండ అరువదియెనిమిదవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 

Thursday 26 September 2019

రామాయణము యుద్ధకాండ -అరువదియేడవసర్గ

                                    రామాయణము 

                                 యుద్ధకాండ -అరువదియేడవసర్గ 

అంగదుని ప్రోత్సాహముతో ఉత్సాహితులైన హనుమదాది వానరవీరులు తిరిగి సమరభూమికి యుద్ధకాకాంక్షతో వెళ్లిరి . అప్పుడు కుంభకర్ణుడు గదను చేతపట్టి దొరికిన వానరుడిని దొరికినట్టు విసిరివేసెను . కుంభకర్ణుని దెబ్బకు వానరుల దేహములన్నీ చెల్లాచెదురయ్యెను . కుంభకర్ణుడు ఇంకా రెచ్చిపోయి ,ఒకేసారి ఏడుగురిని ,పదిమందిని ,ఇరువదిమందిని ,ముప్పదిమందిని రెండుచేతులతో కబలించుచుండును . అప్పుడు వానరులు ధైర్యము తెచ్చుకుని ,పెద్దపెద్ద వృక్షములు రాళ్లను పట్టుకుని యుద్ధమునకు సిద్ధమయ్యెను . ద్వివిదుడు అను వానరుడు పర్వతమును తీసుకువచ్చి కుంభకర్ణుని మీదకు విసిరెను . కానీ ఆ పర్వతము కుంభకర్ణుని చేరక ,అతడి సైన్యముపై పడెను . ఆ దాటికి కుంభకర్ణుని సైన్యము ,రథములు ,గుఱ్ఱములు నుగ్గునుగ్గయ్యేను . వెంటనే ద్వివిదుడు మరో శిఖరము ను విసరగా ఇంకా కొంతమంది రాక్షస సైనికులు ,రథములు ,గుఱ్ఱములు చనిపోయెను . 
అప్పుడు ధైర్యము తెచ్చుకున్న వానరులు రాక్షసుఁలను ,వారి గుఱ్ఱములను నుగ్గునుగ్గు చేయసాగిరి . హనుమంతుడు ఆకాశములో నిలిచి ,అనేక వృక్షములను ,రాళ్లను కుంభకర్ణుని మీద వర్షించసాగెను . కుంభకర్ణుడు వాటన్నిటిని తన శూలముచే ముక్కలు చేసెను . అప్పుడు హనుమ ఒక గిరిశిఖరమును కుంభకర్ణుని మీదకు విసిరెను . ఆ దెబ్బకు కుంభకర్ణుని శరీరమంతా రక్తసిత్తమయ్యెను . అప్పుడు కుంభకర్ణుడు తన శూలముతో హనుమను వక్షస్థలముపై కొట్టెను . ఆ దెబ్బకు హనుమ ఒక మహానాదం చేసెను . గాయపడిన హనుమను చూసిన రాక్షసులు సంతోషించిరి . వానరులు భయపడిరి . అప్పుడు వానరులకు ధైర్యము చెప్పి నీలుడు ,ఋషభుడు ,శరభుడు ,గవాక్షుడు ,గంధమాదనుడు అను వానరులు కుంభకర్ణుని వైపుగా పరుగు తీసిరి . వారందరూ కుంభకరుని అనేక వృక్షములతో ,గిరిశిఖరములతో ,చేతులతో పిడికిళులతో కొట్టిరి . అప్పుడు కుంభకర్ణునికి దెబ్బ తగలలేదు సరికదా తాకినట్టు కూడా అనిపించలేదు . అప్పుడు కుంభకర్ణుడు ఆ వానరప్రముఖులను గట్టిగా కొట్టెను . అది చూసిన వానరులు పెద్ద సంఖ్యలో కుంభకర్ణుని వైపుగా పరుగిడిరి . తనవైపుగా వచ్చిన వానరులను చేతితో పట్టుకుని ,నోటిలో వేసుకోసాగేను . దొరికినవాళ్లను కాళ్లతో తొక్కసాగెను . కుంభకర్ణుని దాటికి భయపడిన వానరులు శ్రీరామునితో మొరపెట్టుకొనెను . 
అప్పుడు అంగదుడు కుంభకర్ణుని మీదకు దూకి వక్షస్థలం పై బలముగా కొట్టెను . ఆ దెబ్బకు కుంభకర్ణుడు కొద్దీ సేపు స్పృహ తప్పెను . అంతలోనే తేరుకుని అంగదుని కొట్టగా అతడు స్పృహతప్పి నేలపై పడిపోయెను . వెంటనే కుంభకర్ణుడు సుగ్రీవునిపై దాడికి వెళ్లెను తన మీదకు వస్తున్న కుంభకర్ణుని చూసిన వానరరాజు ఆకాశములోకి ఎగిరి ఒక పర్వతశిక్షరమును త్రిప్పి త్రిప్పి అతడి వక్షస్థలముపై కొట్టెను . అప్పుడు ఆ పర్వతము ముక్కముక్కలయ్యేను . కుంభకర్ణుని దాటికి సుగ్రీవుడు కూడా స్పృహ తప్పెను . స్పృహ తప్పిన సుగ్రీవుడిని కుంభకర్ణుడు  లంకకు ఎత్తుకుపోసాగెను . అది చూసిన వానరులు హాహాకారములు చేసిరి . లంకలోకి శత్రువును ఎత్తుకుని వస్తున్న కుంభకర్ణునిపై భవనములపై నుండి పుష్పవర్షము కురిపించిరి . లంకలోకి వెళ్తుండగా ,సుగ్రీవునికి స్పృహ వచ్చెను చుట్టూ చూసి పరిస్థితి అర్ధమవ్వుటచే ,సుగ్రీవుడు కుంభకర్ణుని గోళ్ళతో రక్కుతూ ,పళ్లతో కొరుకుతూ బాధించసాగెను . అది తట్టుకొనలేక కుంభకర్ణుడు సుగ్రీవుని నేలపై బలముగా విసిరికొట్టెను . అప్పుడు రాక్షసులు సుగ్రీవుని బాగా కొట్టిరి . వారి నుండి తప్పించుకుని ,ఆకాశములోకి ఎగిరి శ్రీరాముని వద్దకు సుగ్రీవుడు చేరాడు . 
రక్తసిత్తమైన శరీరముతో కుంభకర్ణుడు సుగ్రీవుడు తప్పించుకుని పోవుటచే కోపముతో ఊగిపోతూ ,వెంటనే మళ్లీ యుద్దభూమికి వెళ్లెను . అతడు కోపముతో ఆకలితో ఊగిపోతూ ,యుద్ధభూమిలో దొరికినవాడిని దొరికినట్టు అతడు వానరుడా ,రాక్షసుడా అని చూడకుండా అందరిని తినసాగేను . అతడు ఒకేసారి పది మందిని ,ఇరువది మందిని ,వందమందిని ఒకేసారి చేతితో తీసుకుని భక్షించసాగెను . భయపడిన వానరులు శ్రీరాముని వద్దకు పరుగిడిరి . అప్పుడు శ్రీరాముడు ధనుస్సుని ధరించి వాయువ్యాస్త్రమును మంత్రించి ప్రయోగించెను . ఆ అస్త్ర దెబ్బకు కుంభకర్ణుని చేయి తెగి పడిపోయెను . ఆ చేయి కింద నున్న కొంతమంది వానరులపై పడుటచే కొందరు వానరులు మరణించిరి . మరి కొంత మంది గాయపడిరి . శ్రీరాముడు అర్ధచంద్రాకార బాణములను రెండింటిని కుంభకర్ణునిపై వేయగా అతడురెండు కాళ్ళు తెగిపోయెను . అప్పుడు శ్రీరాముడు ఇంద్రాస్త్రముతో కుంభకర్ణుని శిరస్సుని ఖండించెను . కుంభకర్ణుని శిరస్సు శ్రీరాముడు తన బాణములతో ఖండించినప్పుడు ,ఎగిరి లంకలో పడెను . అది పడున్నప్పుడు తగులుటచే రాజవీధులకు ఇరువైపులా కల గృహాగోపురములు ముక్కలైపోయెను . ప్రాకారము కూలిపోయెను . దేవతలు సంతోషముతో జయజయద్వానములు చేసిరి . అప్పుడు వానరులంతా మిక్కిలి సంతోషించిరి . 

రామాయణము యుద్ధకాండ అరువదియేడవసర్గ సమాప్తము . 

                                   శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









Sunday 15 September 2019

రామాయణము యుద్ధకాండ -అరువదిఆరవసర్గ

                                      రామాయణము 

                                   యుద్ధకాండ -అరువదిఆరవసర్గ 

పెద్ద పర్వతము వంటి బయంకరాకారుడైన కుంభకర్ణుడు యుద్ధభూమిలో అడుగు పెట్టగానే . అతడి భయంకరమైన ఆకారమును చూసి కొందరు వానరులు పారిపోసాగిరి . అది చూసిన నలుడు ,నీలుడు ,గవాక్షుడు మొదలగు వానర ప్రముఖులు వారితో "వానరులారా !మీరు బయపడి పారిపోవలదు . రాక్షసులు శత్రువులను బయపెట్టుటకు సాదారణముగా ఇటువంటి ఆకారములను ధరిస్తారు . కనుక ఇదంతా మాయ . మన ప్రతాపము ముందు రాక్షసుల ప్రతాపము ఎట్టిది ?మన ప్రభువైన శ్రీరామ చంద్రుని ప్రతాపమును తట్టుకొని ఎదురు నిలబడగల వీరుడు ఎవ్వడు లేడు . మీరు బయపడకు యుద్ధము చేయండి "అని పలికెను . 
ఆ మాటలు విన్న వానరులు ధైర్యము తెచ్చుకుని అనేకమైన రాళ్లను ,చెట్లను కుంభకర్ణుడి మీదకు విసిరిరి . అవి కుంభకర్ణుని తాకినంతనే ,అవి నుగ్గునుగ్గయినవి . కుంభకర్ణుడు కోపముతో వానరులపై తన ప్రతాపమును చూపించెను . వానరులను విసిరివేసెను . కొందరిని అణగతొక్కేను . అతడి బీభత్సమును చూసిన వానరులు కొందరు సముద్రములో పడిరి ఇంకొందరు ఆకాశములో ఎగురుతూ పారిపోసాగిరి . మరి కొందరు చెట్లనెక్కి ,ఇంకొందరు పర్వతములో ,గుహలలో దాగుకొనిరి . మిగిలినవారు వచ్చినదారినే మరలిపోవుటకు సిద్దమయ్యిరి . వారిని చూసిన అంగదుడు వారికి ధైర్యము చెప్పి తిరిగి యుద్ధరంగమునకు తీసుకు వచ్చెను . అప్పుడు ఋషభుడు ,శరభుడు ,మైందుడు ,ధూమ్రుడు ,నీలుడు ,కుముదుడు ,సుషేణుడు ,గవాక్షుడు ,రంభుడు ,తారుడు ,ద్వివిదుడు ,పనసుడు ,హనుమంతుడు మున్నగు వానర ప్రముఖులు కుంభకర్ణుని ఎదుర్కొనుటకు త్వరత్వరగా కదిలిరి . 

రామాయణము యుద్ధకాండ అరువదిఆరవసర్గ సమాప్తము . 

            శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






రామాయణము యుద్ధకాండ -అరువది అయిదవసర్గ

                                రామాయణము 

                               యుద్ధకాండ -అరువది అయిదవసర్గ 

మహోదరుని మాటలు విన్న కుంభకర్ణుడు మహోదరునితో "మహొదరా !సహజముగా బయాస్వభావులు ఇటువంటి మాటలు మాట్లాడతారు . మీవంటి వారి మాటలు వినుట వలనే మహారాజుకి ఇప్పుడు ఈ ఆపద వచ్చిపడినది . మీ వంటివారంతా మహారాజు అభిమానము పొందుటకు అతడేమి చేసినను సమర్ధించుచు వుండెదరు . "అని పలికి రావణునితో 
"అన్నా !నేను ఇప్పుడే ఈ క్షణమే బయలుదేరి యుద్ధమునకు వెళ్లి నీకు ఆందోళన కలిగించుచున్న ఆ రాముడిని హతమార్చెదను . నాకు సైన్యము కూడా అవసరము లేదు . "అని పలికెను . ఆ మాటలు విన్న రావణుడు "నాయనా !కుంభకర్ణా !నీవు యుద్ధమున ఆరితేరినవాడవు . శ్రీరాముడంటే ఈ మహోదరునికి చాలా భయము . అందులకే ఈ విధముగా పలుకుచున్నాడు . నాకు కల బంధువులలో నీవంటి ఆత్మీయుడు సమర్థుడు లేడు . శత్రువును జయించి విజయోత్సాహముతో వచ్చుటకు ఇప్పుడే బయలుదేరి రణరంగమునకు వెళ్లుము . అందులకే నిన్ను నిద్ర నుండి మేల్కొల్పినది . వానరులు కపట స్వభావులు . కావున నీవు వంటరిగా యుద్ధమునకు వెళ్ళవద్దు . నీ సైన్యమును తీసుకువెళ్ళు "అని పలికి కుంభకర్ణుని వివిధ ఆభరణములతో తానె స్వయముగా అలంకరించెను . పిమ్మట కుంభకర్ణుని ఆశీర్వదించెను . 
పిమ్మట కుంభకర్ణుడు రావణుని చుట్టూ ప్రదక్షిణ చేసి శిరస్సు వంచి నమస్కారము చేసి ,యుద్ధమునకు బయలుదేరుతూ తన సైన్యమునకు ఉత్సాహము కలిగించు విధముగా మాట్లాడేను . పిమ్మట అతడు సైన్యముతో సహా యుద్ధరంగమునకు వెళ్తుండగా వారికి అనేక అపశకునములు కనిపించినవి . అయినను చావు మూడిన కుంభకర్ణుడు ఆగక యుద్ధరంగమునకు వెళ్లెను . 

                        రామాయణము యుద్ధకాండ అరువది అయిదవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 













రామాయణము యుద్ధకాండ -అరువదినాలుగవసర్గ

                                  రామాయణము 

                                 యుద్ధకాండ -అరువదినాలుగవసర్గ 

కుంభకర్ణుని మాటలు విన్న మహోదరుడు "కుంభకర్ణా !'నేను ఒక్కడినే యుద్ధమునకు వెళ్లి శత్రువులను తుదముట్టించెదను '. అని నీవు పలికిన మాటలు సరిగా లేవు . దండకారణ్యములో రాముడు ఒక్కడే మన రాక్షసులను అనేక వేలమందిని చంపినాడు . అక్కడ మరణించగా మిగిలిన రాక్షసులు లంకకు వచ్చి తలదాచుకున్నారు . వారు ఇప్పటికి ఆనాటి రాముడి పరాక్రమమును తలుచుకుని వణికిపోతుంటారు . మన లంకలో వున్న సమస్త రాక్షసులుయుద్దమునకు వెళ్లినా రాముడిని ఎదిరించగలమని నమ్మకము లేదు . అటువంటిది నీవు ఒక్కడివే యుద్ధమునకు వెళ్ళుట వలన ప్రయోజనములేదు . "అని పలికి అక్కడే వున్న రావణునితో 
 "మహారాజా !మీరు అంగీకరించినచో నావద్ద ఒక ఉపాయము వున్నది . మహోదరుడు ,ద్విజిహ్వుడు ,సంహాద్రి ,కుంభకర్ణుడు ,వితర్దనుడు 'అను ఈ అయిదుగురు యుద్ధమునకు వెళ్ళినారని లంకలో దండోరా వేయించుము . మేము యుద్దములో మా శాయశక్తులా యుద్ధము చేస్తాము . రాముడిని అంతమొందించి వచ్చినచో అంతా సంతోషమే . అట్లు కానీ యెడల మేము రణరంగము నుండి దెబ్బలతో వచ్చెదము . మీ పాదములపై వాలి అందరూ చూస్తూ ఉండగా రామలక్ష్మణులను భక్షించేసాము  అని  అసత్యము చెబుతాము . వెంటనే నీవు ఆ విషయమును దండోరా వేయించి ,సంతోషముతో వున్నట్టుగా వుండు . ఈ విషయము జనుల ద్వారా తెలిసిన సీత వేరే దిక్కు లేక నిన్ను చేరును . అప్పుడు విజయము మనదే "అని పలికెను 

రామాయణము యుద్ధకాండ అరువదినాలుగవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






రామాయణము యుద్ధకాండ -అరువదిమూడవసర్గ

                                    రామాయణము 

                                  యుద్ధకాండ -అరువదిమూడవసర్గ 

కుంభకర్ణుడు రావణుడి మాటలు విని పెద్దగా నవ్వుచు ,"మహారాజా !మనము ఇదివరలో ఈ విషయము గురించి చర్చించి ఉంటిమి . నీ హితవు కోరి కొన్ని మంచి మాటలు చెప్పితిమి . కానీ మా మాటలు నీవు పెడచెవిన పెడితివి . ఇప్పటికైనా నా మాటలు వినుము . సీతాదేవిని శ్రీరామునికి అప్పగించుము . అదే నీకు నిన్ను నమ్ముకుని వున్న వారికి ఈ లంకా నగరమునకు మంచిది . "అని పలికెను . 
ఆ మాటలు విన్న రావణుడు "కుంభకర్ణా !నేను నీకంటే పెద్దవాడను . పైగా ఈ దేశపు రాజుని అయినా నన్ను ఇలా శాసించుచున్నావేమి ?అనవసర విషయములు వదిలి ఇప్పుడు చేయవలసిన పనిని ఆలోచించుము . నీకు నిజముగా నాపై ఆదరాభిమానములు వున్నచో యుద్ధరంగములో పరాక్రమించుము . చిక్కులలో పడిన వాడికి గట్టిగా చేయూతనిచ్చి ,గట్టెక్కించేవాడే నిజమైన ఆప్తబంధువు . "అని పలికెను . 
రావణుడి మాటలు విన్న కుంభకర్ణుడు తన అన్న రావణుడు కోపముగా వున్నాడని గ్రహించి అతడితో "అన్నా !నీ మేలు కోరి మంచి మాటలు చెప్పాను . నేను ఉండగా నీవు శత్రువుల గురించి బయపడవలిసిన అవసరము లేదు . నీకోసము నేను ఇప్పుడు యుద్ధమునకు వెళ్లెదను నీకు ప్రశాంతత లేకుండా చేసిన ఆ రాముడిని లక్ష్మణుడిని ,వానరారాజు సుగ్రీవుడిని ,మన లంకలో ప్రవేశించి లంకా దహనము చేసిన హనుమను ,మృత్యు ముఖమునకు పంపెదను . "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ అరువదిమూడవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







Tuesday 10 September 2019

రామాయణము యుద్ధకాండ -అరువదిరెండవసర్గ

                                  రామాయణము 

                                 యుద్ధకాండ -అరువదిరెండవసర్గ 

కుంభకర్ణుడు రావణుని వద్దకు బయలుదేరి వెళ్తుండగా కుంభకర్ణుని పై భవనములపై నుండి పుష్ప వర్షము కురిపించుచుండిరి . తనవద్దకు వచ్చిన కుంభకర్ణుని చూసిన రావణుడు సంతోషముతో అతడిని కౌగిలించుకొనెను . పిమ్మట కుంభకర్ణుడు తన అన్న పాదములకు నమస్కారముచేసి ,తన ఆసనంపై కూర్చుండి "అన్నా !నన్ను నిద్రలేపి పిలిపించిన కారణము తెలుపుము "అని పలికెను . 
అప్పుడు రావణుడు "కుంభకర్ణా !దశరధుని కుమారుడు మిక్కిలి బలశాలి అయిన శ్రీరాముడు వానరారాజు సుగ్రీవుడితో ,వానర సైన్యముతో కలిసి అభేద్యమైన మహా సముద్రమును దాటి వచ్చినాడు . అతడు మన రాక్షసవంశ నాశనమునకు పూనుకున్నాడు . వారి చేతిలో ఇంతవరకు మనము జయించినదే లేదు . ఇప్పుడు లంకను కాపాడగలిగినవాడవు నీవే అందుకే నీ నిద్రకు భంగము కలిగించినాను . ఓ మహాబాహు !నీకు అప్పగించిన పని దుష్కరమైనదే . కానీ ఈ సోదరుని కొరకు నీవు ఈ కార్యమును సాధింపక తప్పదు . ఈ లోకములొకల సమస్త ప్రాణులలో నిన్ను ఎదిరించి నిలవగలవాడు ఎవ్వడు లేడు . నీ పరాక్రమముతో శత్రు సైన్యమును చిన్నాభిన్నము చేయుము "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ అరువది రెండవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




రామాయణము యుద్ధకాండ -అరువదియొకటవసర్గ

                              రామాయణము 

                            యుద్ధకాండ -అరువదియొకటవసర్గ 

భయంకరమైన ,పర్వతము వంటి ఆకారము కల కుంభకర్ణుని ,అతడిని చూసి పారిపోతున్న వానరులను చూసిన శ్రీరాముడు విభీషణుడితో "విభీషణా !ఇతడెవరు ?ఇంతటి పెద్ద భయంకరమైన ఆకారము కల రాక్షసుడిని నేను ఇంతవరకు చూడలేదు . ఇతడి పరాక్రమము ఎట్టిది ?"అని ప్రశ్నించెను . 
ఆ మాటలు విన్న విభీషణుడు "మహాప్రభూ !యితడు విశ్రవసుని కుమారుడు . ఇతడి పేరు కుంభకర్ణుడు . యితడు పుట్టినప్పటినుండే మహా బలవంతుడు . ఇతడికి బ్రహ్మదేవుడు ఆరునెలలు నిద్ర ,ఒక రోజు ఆహారము విధించెను . యితడు అనేకసార్లు దేవతలను సైతము యుద్దములో తరిమికొట్టాడు . ఇప్పుడు యుద్ధము కోసము రావణుడు ఇతడిని నిద్రనుండి లేపించి ఉంటాడు . అతడిని చూసి భయముతో మన వానరులు ఇలా పరుగెతున్నారు . అతడు రణరంగములో పరుగులుపెట్టిన అతడిని ఎదిరించుట కష్టము , మన సైన్యము కూడా అతడి ముందు నిలబడలేదు . కనుక ముందు వారికి ధైర్యము చెప్పవలెను "అని పలికెను . 
విభీషణుడి మాటలు విన్న శ్రీరాముడు నీలుడిని సమస్తసైన్యముతో లంకను మోహరించి యుద్ధమునకు సిద్ధముగా ఉండమని ,పారిపోవుతున్న వానరులకు ధైర్యము చెప్పమని ,అనేక వృక్షములను ,శిలలని ప్రోగుచేయమని ఆజ్ఞ ఇచ్చెను . శ్రీరాముని ఆదేశము ప్రకారము పారిపోవుచున్న వానరులకు ధైర్యము చెప్పి ,శిలలతో వృక్షములతో లంక నాలు ద్వారముల వద్ద వానరులు యుద్దమునకై సిద్ధముగా ఉండిరి . 

రామాయణము యుద్ధకాండ అరువదియొకటవసర్గ సమాప్తము . 

                                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





రామాయణము యుద్ధకాండ -అరువదియవసర్గ

                                  రామాయణము 

                                   యుద్ధకాండ -అరువదియవసర్గ 

లంకకు వచ్చిన రావణుడికి మనసులో శ్రీరాముని బాణములు ఏ పక్కనుండి వచ్చి తనను బాధించునో అని భయము కలిగెను . పిమ్మట అతడు తన బంగారు సింహాసనంపై కూర్చుండి ,తనవారితో "దేవేంద్రుడి వంటి పరాక్రమము కలిగిన నేను ఒక మానవుడి చేతిలో ఓడిపోయాను . నేను చేసిన ఘోర తపస్సుఅంతా వ్యర్ధమయిపోయినది . 'నీకు మనుష్యుల వలన ప్రాణభయము కలది దీనిని గుర్తుంచుకో 'అని బ్రహ్మదేవుడు పలికిన మాటలు నేడు నిజమైనవి .
 లోగడ ఇక్ష్వాకు వంశములో ప్రముఖుడైన 'అనరణ్యుడు 'అను రాజు 'మా వంశములో పుట్టిన మహావీరుడి చేతిలో నీవు మరణించెదవు 'అని శపించేను . దశరధుని కుమారుడైన శ్రీరాముడే ఆ మహావీరుడని నేడు నాకు స్పష్టమవుచున్నది . 
పూర్వము నేను వేదవతి అవమానించి ఆమె శాపమునకు గురి అయితిని . ఆమె సీతగా పుట్టి నా మృత్యువునకు కారణమవుచున్నది .  
ఇదివరకు నేను నా బలమును ప్రదర్శించుటకు కైలాసగిరిని కంపింపచేసాను . దానితో కోపించిన పార్వతీదేవి 'ఒక స్త్రీ కారణముగా నీకు మరణము సంభవించును 'అని శపించెను . 
ఒకానొకప్పుడు శివపార్వతులను దర్శించుటకు కైలాసమునకు వెళ్ళినప్పుడు శివుడి వాహనము అయిన నంది నన్ను అడ్డగించెను . వానరముఖముతో వున్న ఆ నందిని చూసి నేను పరిహాసముగా నవ్వాను . అప్పుడు కోపించిన నందీశ్వరుడు 'రావణా !వానరులమూలముగానే నీ వంశము నాశనమవుతుంది 'అని శపించెను . 
చాలారోజుల క్రితము రంభ అను అప్సరస తన ప్రియుడైన నలకూబరుడిని కలుసుకొనుటకు వెళ్ళ్తుండగా ,ఆమె అందచందములకు మోహితుడైన రావణుడు ఆమెను బలాత్కరించెను . అది తెలిసిన నలకూబరుడు 'నీవు పరస్త్రీ పై వ్యామోహపడి అధర్మమునకు పాల్పడినప్పుడు నీ తలవ్రక్కలగును 'అని శపించెను . 
పుంజికస్థల అను ఆమె వరుణిని కూతురు ఒకానొకసమయములో ఆమె బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లుచుండగా ,మార్గమధ్యములో నేను ఆమెను ఆపి బలాత్కరించాను . 'ఈ విషయము తెలిసిన బ్రహ్మదేవుడు నీవు పరకాంతతో ఉంటే నీ తల బ్రద్దలగును 'అని శపించెను . 
నాకు కల పై శాపములన్నిటిని గుర్తుపెట్టుకుని యుద్ధప్రయత్నములు చేయవలెను . రాక్షసులందరు అత్యంత జాగరూకులై లంకను రక్షించవలెను . మహా బలవంతుడైన కుంభకర్ణుని నిద్రనుండి లేపండి . అతడితో యుద్ధము గురించి ఇదివరకే చర్చించి వున్నాను . అతడు తొమ్మిది దినముల క్రితమే నిద్రకు ఉపక్రమించాడు . అతడు తన ఇష్టానుసారము నెలలతరబడి నిద్రపోవుచు ఉండును . అతడు యుద్ధరంగమునకు అడుగుపెట్టినచో ,వానరులను ఆ రాకుమారులను తప్పక వధించగలడు . కావున అతడిని వెంటనే నిద్రలేపండి "అని పలికెను . 
రావణుడి ఆజ్ఞ ప్రకారము వెంటనే కుంభకర్ణుని నిద్రలేపుటకు రాక్షసులు వెళ్లిరి . వారు తమతోపాటుగా అనేక రకముల ఆహారపదార్థములను తీసుకువెళ్లిరి . ముఖ్యముగా కుంభకర్ణునికి ఇష్టమైన మాంసాహారములను తీసుకువెళ్లిరి . వారంతా బయంకరాకారము కలిగి నిద్రపోవుచున్న కుంభకర్ణుని దగ్గరకు వెళ్లిరి . అతడి ఉచ్వాస నిస్వాసములు వారిని కదిపివేయుచు ఉండెను . వారు కష్టపడి నిలదొక్కుకుని కుంభకర్ణుని వద్ద పెద్దగా అరవసాగిరి . తమతో తీసుకువెళ్లిన వాయిద్యములు బిగ్గరగా వాయించసాగిరి . అయినను కుంభకర్ణునిలో ఉలుకుపలుకు లేదు . 

పిమ్మట వారంతా కుంభకర్ణుని వంటికి చందనము పూసిరి . సుగంధద్రవ్యములు పూసిరి పుష్పమాలలతో అలంకరించిరి . పిమ్మట వారు రోకళ్ళతో బలముగా కుంభకరుని కొట్టిరి . అయినను అతడిలో చలనము లేకపోవుటచే ,కొందరు రాక్షసులు పిడికిళ్లతో కొట్టిరి . ఇంకొందరు అతడి జుట్టుపీకిరి . మరికొందరు అతడి చెవులు కొరికిరి . కొంతమంది వందలకొద్దీ  కడవలతో నీటిని తీసుకొచ్చి ,అతడి చెవులో పోసిరి . అయినను కుంభకర్ణుడు ఉలకలేదు పలకలేదు . ఇక లాభములేదని ఏనుగులను తెప్పించి అతడిమీద నడిపించిరి . అప్పుడు కుంభకర్ణునికి అతడి శరీరము మీద పురుగు పాకినట్టు అనిపించి నిద్రలేచేను . 
అతడికి ఎదురుగా వున్న ఆహారము మొత్తము తిని ,తనకు బయపడి దాక్కున్న సైనికులను చూసి "సైనికులారా !భయములేదు బయటకు రండు . ఇప్పుడు నన్ను ఎందుకు నిద్రలేపారు . మన మహారాజుకు ఎటువంటి ఇబ్బంది కలుగలేదుకదా !"అని అడిగెను . అప్పుడు రావణుని సచివుడైన యూపాక్షుడు "ప్రభూ !దేవతలవలన సైతము మనకు ఏనాడు భయము కలుగలేదు . కానీ ఇప్పుడు మనకు మానవుని వలన భయము కలిగినది . వానరయోదులు లంకను చుట్టుముట్టినారు . సీతాపహరణము కారణముగా మన రాజుకు ఆపదవచ్చిపడినది . నేడు శ్రీరాముడి చేతిలో మన ప్రభువు పరాజితుడయ్యెను . "అని పలికెను . 
విషయము తెలుసుకున్న కుంభకర్ణుడు వెంటనే "ఇప్పుడే నేను సైన్యముతో వెళ్లి ,వానరులను రామలక్ష్మణులను చంపినా పిమ్మటే రావణుని దర్శించెదను "అని పలికెను . ఆమాటలు విన్న యూపాక్షుడు "!మహాబాహు !ముందుగా రాజునూ దర్శించుము . మహారాజుతో మాట్లాడి అతడి సలహా తీసుకుని యుద్ధరంగమునకు వెళ్ళుట మంచిది "అని పలికెను . వెంటనే కుంభకర్ణుడు రావణుని వద్దకు వెళ్లెను . రావణుని వద్దకు వెళ్తుండగా ప్రాకారము బయట నుండి కుంభకర్ణుని చూసిన వానరులు కుంభకర్ణుని బయంకరాకారము చూసి బీతిల్లిరి . 

రామాయణము యుద్ధకాండ అరువదియవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








Monday 9 September 2019

రామాయణము యుద్ధకాండ -ఏబదితొమ్మిదవసర్గ

                                      రామాయణము 

                                    యుద్ధకాండ -ఏబదితొమ్మిదవసర్గ 

రాక్షసుల సర్వసైన్యాధ్యక్షుడైన ప్రహస్తుడు మరణించిన విషయము తెలుసుకున్న రావణుడు కోపముతో వుడికిపోతూ రాక్షసప్రముఖులతో "ఇంద్రుని బలములను సైతము దెబ్బతీసిన మన సైన్యాధ్యక్షుడు తన బలముతో సహా నిహతుడైనాడు . మానవమాత్రుడే కదా అని శ్రీరాముడిని ,వానరులేకదా అని అతని సైన్యమును ఉపేక్షించరాదు . వారి విషయములో మనము జాగ్రత్తగా ఉండాలి . కనుక ఇప్పుడే నేను బయలుదేరి రణరంగమునకు వెళ్లెదను . నేడే రామలక్ష్మణులను ,వానరులను యుద్దభూమికి బలి ఇచ్చెదను . "అని పలికి తన సమస్త సైన్యముతోటి యుద్ధరంగమునకు వెళ్ళుటకు సిద్దపడెను . 
యుద్ధరంగమునకు వెళ్లిన రావణుడు చేతిలో వృక్షాలు ,శిలలు ఆయుధాలుగా కలిగిన అపారంగా వున్న వానరసైన్యమును చూసేను . శ్రీరాముడు లంక నుండి యుద్దభూమికి వస్తున్నరాక్షససైన్యములను చూసి విభీషణుడితో "ఈ సైన్యములు ఎవ్వరివి ?ఇప్పుడు యుద్ధమునకు వచ్చు వారెవరు ?"అని ప్రశ్నించెను . అప్పుడు విభీషణుడు "ప్రభూ !మహాకాయుడు ఎర్రని ముఖము కలిగి ఇటువచ్చుచున్న వాడు అకంపనుడు (రాక్షససైన్యములో ఇద్దరు అకంపనులు కలరు . హనుమ చేతిలో మరణించినవాడు రావణుని సేనాధిపతి ,ఇప్పుడు యుద్ధరంగమునకు వచ్చినవాడు రావణుడి కుమారుడు)సిమ్హద్వజము కలిగిన రధము మీద వచ్చినవాడు ఇంద్రజిత్తు బ్రహ్మదేవుడి వరము వలన యితడు యుద్ధరంగములో శత్రువులకు కనపడకుండా యుద్ధముచేయగలడు . పక్కన రథముపై వున్నవాడు 'అతికాయుడు 'రధికులలో శ్రేష్ఠుడు . 
ఉదయించుచున్నసూర్యుని వంటి  నేత్రములు కలవాడు మహోదరుడు . పిడుగు వంటి వేగము కల ఆ రాక్షసుడు 'పిశాచుడు 'ఉన్నతమైన వృషభము  ఎక్కి వస్తున్నవాడు త్రిశరుడు . విశాలమైన వక్షస్థలం కలిగిన ఆ యోధుడు కుంభాసురుడు . యితడు వచ్చుచున్న వీరుడు నికుంభుడు . యితడు కుంభకర్ణుడి కుమారుడు . వారందరిమధ్యలో అసమానమైన తేజస్సుతో ఉన్న వీరుడు రావణుడు . యితడు సమస్త రాక్షసులకు రాజు "అని పలికెను . 
అప్పుడు శ్రీరాముడు "ఔరా !రాక్షసేశ్వరుడైన రావణుడు మహా తేజస్సుతో వున్నాడు బలశాలి అయిన రావణుని పక్షమువారందరూ పర్వతమువలె దృఢకాయులు . ఇన్నాళ్లకు యితడు నాకంట పడినాడు . సీతను అపహరించిన దుర్మార్గుడిని వధించి నా  కోపము చల్లార్చుకుంటాను  . "అని పలికెను .  
రావణుడు యుద్ధరంగమునకు వచ్చుట చూసిన సుగ్రీవుడు ఒక పెద్ద పర్వతమును పీకి రావణుడిపైకి ప్రయోగించెను . అది చూసిన రావణుడు ఆ పర్వతమును తన బాణములతో ధ్వంసము చేసి ,సుగ్రీవుడిపైకి తన బాణమును ప్రయోగించెను . ఆ బాణపు దెబ్బకు సుగ్రీవుడు స్పృహతప్పి నేలపై పడిపోయెను . అది చూసిన రాక్షసులందరూ సంతోషముతో మహానాదములు చేసిరి . అప్పుడు గవాక్షుడు ,గవయుడు ,సుద్రంష్టుడు ,ఋషభుడు ,జ్యోతిర్ముఖుడు ,నభుడు మొదలయిన వానరవీరులు పెద్దశిలలు చేతపట్టుకుని రావణుడి మీదకు దాడికి వెళ్లిరి . రావణుడు తన బాణ పరంపరతో ఆ శిలలన్నిటిని నాశనము చేసి ,వారిపై బాణములు కురిపించగా వారు నేలపై పడిపోయిరి . అనంతరము రావణుడు వానరులపై సరవర్షము కురిపించెను . రావణుడి దాటికి తట్టుకొనలేక వానరులందరూ శ్రీరాముడి వద్దకు వెళ్లి శరణు వేడిరి . 
శ్రీరాముడు ధనుర్భాణములు ధరించి యుద్ధమునకు దిగబోగా ,లక్ష్మణుడు "అన్నా !ఆ దుష్టుడికి వధించుటకు నీవు కదలవలసిన పని లేదు . నీ సేవకుడనైన నేను చాలు "అని పలికెను . అప్పుడు శ్రీరాముడు "లక్ష్మణా !అలాగే యుద్ధమునకు వేళ్ళు . కానీ అతడిని సామాన్యుడిగా భావించకు . జాగ్రత్తగా నిన్ను నీవు రక్షించుకొనుచు ,రావణుడి గమనించి యుద్ధము చేయవలెను అతడు మహావీరుడు "అని పలికెను . అప్పుడు లక్ష్మణుడు అన్న మాటలన్నీ సావధానంగా విని ,అన్నాను కౌగలించుకుని ,అన్నకు ప్రదక్షిణ నమస్కారము చేసి ,ధనుర్భాణములు ధరించి యుద్ధరంగమునకు వెళ్లెను . ఆ యుద్ధరంగములో తన బాణములతో వానరులని వధించుచున్న రావణుడిని లక్ష్మణుడు చూసేను . 
ఇంతలో మహాతేజస్వి అయిన హనుమంతుడు రావణుని చూసి అతడి దగ్గరకు వెళ్లి అతడి రధమును ఎత్తి ,అతడితో "రావణా !బ్రహ్మదేవుడి వర ప్రభావమున దేవదానవయక్షగంధర్వులచే చావులేకుండా వరముపొందినావు . వానర మానవులచే చావుతధ్యము . నా ఎడమచేతితో నిన్ను ఇప్పుడే చంపగలను "అని పలికెను . ఆ మాటలు విన్న రావణుడు కోపముతో "వానరా !నీ ప్రతాపమును ఇప్పుడే చూపించు . ఆ పిదప నేను నిన్ను చంపివేయుదును . "అని పలికెను . ఆమాటలు విన్న హనుమ రావణుడితో "రావణా !నీ కుమారుడైన అక్షకుమారుడు నా చేతిలో మరణించిన విషయము గుర్తుతెచ్చుకో . అప్పుడు నా ప్రతాపమేమిటో నీకు తెలుస్తుంది "అని పలికెను . కోపముతో రావణుడు తన అరచేతితో హనుమ వక్షస్థలముపై ఒక దెబ్బ వేసెను . ఆ బిడ్డకు హనుమ అదిరిపడి వెంటనే తేరుకుని తన అరచేతితో ఒక్క దెబ్బ రావణుని కొట్టెను . ఆ దెబ్బకు రావణుడు చలించిపోయెను . ఇది చూసిన ఋషులు ,వానరులు ,సిద్దులు ,దేవతలు అందరూ హర్షద్వానాములు చేసిరి . 
కాసేపటికి తేరుకున్న రావణుడు హనుమ బలమును పొగిడెను . వెంటనే రావణుడు తన అరచేతితో బలముగా మరియొకసారి హనుమను కొట్టెను . ఆ దెబ్బకు హనుమ స్పృహతప్పి పడిపోగా ,రావణుడు నీలుడిపై తన బాణపరంపరను కురిపించెను . ఆ బాణపరంపరను తట్టుకొని నీలుడు ఒక మహా గిరిశిఖరమును తీసుకుని రావణుడిపై ప్రయోగించెను . మూర్ఛనుండి తేరుకున్న హనుమ రావణుని ఎదిరించుటకు చూచి ఇతరులతో యుద్ధముచేయువానితో యుద్ధము చేయరాదని అక్కడనుండి మరొకచోటకి వెళ్లెను . రావణుడు నీలుడు ప్రయోగించిన గిరిశిఖరమును తన బాణములతో ముక్కలు చేసెను . అప్పుడు నీలుడు కోపముతో మద్దిచెట్లనీ ,సాలవృక్షములను ,మామిడిచెట్లను వరుసగా రావణుడి మీదకు విసిరెను . రావణుడు వాటన్నిటిని ధ్వంసము చేసెను . అప్పుడు నీలుడు సూక్ష్మరూపము ధరించి రావణుడి ధ్వజపటముపై కూర్చుండెను . అది చూసిన రావణుడు క్రుద్ధుడయ్యెను . నీలుడు మహానాదమొనర్చెను . నీలుడు ధ్వజపటముపై ధనస్సుమీద ,కిరీటము మీద తిరుగుండుట చూసిన రామలక్ష్మణులు హనుమ మిక్కిలి ఆశ్చర్యపడిరి . రావణుడు అస్త్రములు ప్రయోగించబోగా నీలుడు తిరుగుతుండుటచే కుదరక మిన్నకుండిపోయెను . అది చూసిన వానరులందరూ సంతోషముతో కోలాహలధ్వనులు చేయుచు ,గంతులు వేసిరి . 
సూక్ష్మరూపమున తనను ఇబ్బందిపెడుతున్న నీలునిపై ఆగ్నేయాస్త్రమును ప్రయోగించెను . ఆ అస్త్రము నీలుని వక్షస్థలమునకు తగలగా అగ్నిపుత్రుడైన నీలుడు తండ్రి ప్రభావమున మరణించక స్పృహతప్పెను . స్పృహతప్పిన నీలుడిని చూసిన రావణుడు అతడి విషయము వదిలి లక్ష్మణుడివైపుగా వెళ్లెను . లక్ష్మణుడిమీద అనేక బాణములను ప్రయోగించెను . ఆ బాణములను లక్ష్మణుడు మధ్యలోనే త్రుంచి ,తానూ అనేక బాణములను రావణుడిపై ప్రయోగించేను . రావణుడు లక్ష్మణుని యుద్ధపటిమకు మెచ్చుకుని ,బ్రహ్మదేవుడు ఇచ్చిన బాణమును లక్ష్మణుని నుదిటిన తగిలేలా కొట్టెను ఆ దెబ్బకు లక్ష్మణుడు చలించిపోయెను . పిమ్మట లక్ష్మణుడు తేరుకుని రావణుడి ధనుస్సుని విరగకొట్టి ,రావణునిపై మూడు బాణములను ప్రయోగించేను . రావణుడు స్పృహతప్పిపోయి కాసేపటికి తేరుకొనెను . అప్పుడు రావణుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన శక్తి ఆయుధమును లక్ష్మణునిపై ప్రయోగించెను . లక్ష్మణుడు తన బాణములతో దానిని భగ్నమొనర్చాలని ప్రయత్నించినా ఆ అస్త్రము లక్ష్మణుని వక్షస్థలములో బలముగా నాటుకొనెను . లక్ష్మణుడు మూర్ఛపోయెను . మూర్ఛితుడైన లక్ష్మణుని ఎత్తుకుపోవుటకు రావణుడు ప్రయత్నించేను . అప్పుడు హనుమ తన పిడికిలితో రావణుని వక్షస్థలమున బలముగా కొట్టెను . ఆ దెబ్బ తట్టుకొనలేక రావణుడు మోకాళ్లపై చతికిలపడెను . అతని నోటినుండి ,చెవుల నుండి ,కళ్ళనుండి రక్తము కారేను . రావణుడు ఎలాగోలా రధముచేరికూలబడెను . అప్పుడు హనుమ లక్ష్మణుని ఎత్తుకుని రాముని వద్దకు చేర్చెను . 
కొంతసేపటికి లక్ష్మణుడు తేరుకొనెను . రావణుడు కూడా తేరుకుని తిరిగి వానరులపై తన బాణవృష్టిని కురిపించసాగెను . అప్పుడు శ్రీరాముడు హనుమ అభ్యర్థనమేరకు హనుమ భుజములపై కూర్చుని యుద్ధరంగమునకు వెళ్లెను . శ్రీరాముడు యుద్ధరంగములో వున్న రావణుని చూసి అతడితో "ఓ దుష్ట రావణా !నీవు నా పట్ల ఘోర అపరాధము చేసితివి . ఇన్నాళ్లు నాకు కనపడకుండా వున్నందువలన ప్రాణములతో వున్నావు . ఇప్పుడు నాకు కనిపించావు . నేను నీ పాలిట మృత్యువుని "అని పలికెను . ఆ మాటలు విన్న రావణుడు రాముని మోయుచున్న హనుమపై బాణములు వేసెను . అది చూసి కోపించిన రాముడు తన బాణములతో రావణుని రాధా చక్రములను ,ధ్వజపటమును ,రధసారధిని ధ్వంసముచేసెను . రావణుడు వేసే బాణములను అన్నిటిని నిర్వీర్యము చేసెను . పిమ్మట శ్రీరాముడి బాణమునకు రావణుడి విల్లు విరిగిపోయెను . రావణుడు యుద్ధభూమిలో నేలపై ఆయుధములేకుండా ఉండుట చూసిన రాముడు అతని కిరీటమును ధ్వంసముచేసి రావణునితో "రావణా !నీవు గొప్ప యుద్ధము చేసినావు . నా పక్షమున అనేకమంది వానరులను చంపినావు . నీవు చాలా అలసి వున్నావు . పైగా నీ వద్ద ఆయుధము ,రధము లేదు . లంకకు వెళ్లి విశ్రాన్తి తీసుకుని రేపు రా "అని పలికెను . రావణుడు లంకకు వెళ్లెను . రావణుడు అవమానంతో తలవంచుని వెళ్ళుట  చూసిన దేవతలు, సిద్దులు ,వానరులు సంతోషించిరి . 

రామాయణము యుద్ధకాండ ఏబదితొమ్మిదవసర్గసమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








Sunday 8 September 2019

రామాయణము యుద్ధకాండ -ఏబదియెనిమిదవసర్గ

                                       రామాయణము 

                                         యుద్ధకాండ -ఏబదియెనిమిదవసర్గ 

మిక్కిలి పరాక్రమశాలి ఐన ప్రహస్తుడు యుద్ధరంగమునకు వచ్చుట చూసిన శ్రీరాముడు ,విభీషణుడిని 'ఇతడెవరు 'అని ప్రశ్నించెను . శ్రీరాముడి మాటలు విని విభీషణుడు "స్వామీ !యితడు రాక్షసరాజైన రావణుడి సర్వసైన్యాధ్యక్షుడు ఇతడి పేరు ప్రహస్తుడు లంకాసేనలోని మూడు విభాగములకు యితడు అధిపతి ,మిక్కిలి బలశాలి "అని సమాధానము చెప్పెను . 
మహాబలశాలి అయిన ప్రహస్తుడు గర్జించుచు ,రాక్షసయోధులతో కలిసి వచ్చుటను అపారమైన వానరసేన చూసేను . అప్పుడు వానరులంతా ఎంతో కోపముతో గర్జించుచు మహావృక్షములను ,శిలలను చేతపట్టుకొనిరి . వానరరాక్షసయోధుల మధ్య భయంకరముగా యుద్ధము సాగెను . అప్పుడు ప్రహస్తుని సచివులైన నరాంతకుడు ,కుంభహనువు ,మహానాధుడు ,సమున్నతుడు అను నలుగురు రాక్షస యోధులు వానరులను చావుదెబ్బతీసిరి . అది చూసిన ద్వివిదుడు ఒక పర్వతశిఖరమును పట్టుకుని 'నారాంతకుడు 'అను వాడిని చావకొట్టెను . దుర్ముఖుడు అను వానరుడు ఒక మహా వృక్షమును తీసుకుని త్రిప్పుతూ 'సమున్నతుడు 'అను రాక్షసుడిని చంపెను . 
జాంబవంతుడు వీరావేశముతో ఒక శిలను చేతితో పట్టుకుని 'మహానాధుడు 'అను రాక్షసుని వక్షస్థలముపై బలముగా కొట్టెను . తారుడు అను కపియోధుడు ఒక వృక్షమును పెకలించి తీసుకువచ్చి ,'కుంభహనువు 'అను రాక్షసుని పరిమార్చెను . తన నలుగురు సచీవులు మరణించుట చూసిన ప్రహస్తుడు వెంటనే వానరులతో ఘోర యుద్ధమునకు దిగెను . అతడు వానరులను ముప్పతిప్పలు పెట్టసాగెను . అదిచూసిన నీలుడు ప్రహస్తునితో యుద్ధమునకు దిగెను నీలుడిని చూసిన ప్రహస్తుడు రెచ్చిపోయి బాణముల వర్షము కురిపించెను . 
వెంటనే నీలుడు ఒక మహావృక్షముని పెకలించి ,ప్రహస్తునిపై బలముగా మోదెను . ఆ దెబ్బ తిన్న ప్రహస్తుడు కోపముతో నీలుడిపై బాణముల వర్షము కురిపించెను . నీలుడు రెచ్చిపోయి వెంటనే ఒక మద్దిచెట్టుని తీసుకుని ప్రహస్తుని రధాశ్వములను చావకొట్టెను . అనంతరము నీలుడు ప్రహస్తుని ధనుస్సుని లాగుకొనెను . ప్రహస్తుడు ఒక రోకలిని తీసుకుని రథముమీదనుండి కిందకు దూకేను . అప్పుడు నీలుడు ఒక మహావృక్షముతో ప్రహస్తుని వక్షస్థలముపై కొట్టెను . నీలుడి దెబ్బకు లెక్కచేయక రోకలిబండతో నీలుని మీదకు దూకేను . ఒక పెద్ద శిలను తీసుకుని ప్రహస్తుని తలపై కొట్టెను . ఆ దెబ్బకు ప్రహస్తుడు మృత్యుముఖుడయ్యెను . ప్రహస్తుడు మరణించుట చూసిన రాక్షసులు ఆనకట్టతెగినా నీటి వలె లంక వైపుగా పరిగెత్తెను . పిదప నీలుడు విజయోత్సాహముతో శిబిరమునకు చేరెను . తోటివాళ్ళందరూ నీలుడిని పరిపరి విధములుగా పొగిడిరి . 

రామాయణము యుద్ధకాండ ఏబదియెనిమిదవసర్గ సమాప్తము . 

                             శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Saturday 7 September 2019

రామాయణము యుద్ధకాండ -ఏబదియేడవసర్గ

                                రామాయణము 

                                యుద్ధకాండ -ఏబదియేడవసర్గ 

హనుమంతుడి చేతిలో అకంపనుడు మరణించాడని తెలుసుకున్న రావణుడు మిక్కిలి కోపోద్రిక్తుడయ్యెను . పిదప అతడు ముఖమును చిన్నబుచ్చుకుని ,తన మంత్రులతో బాగుగా అలోచించి ,ప్రహస్తుని యుద్ధమునకు పంపుటకు నిశ్చయించుకుని ప్రహస్తునితో "యుద్దకుశులుడవైన ప్రహస్తా !మన లంకా నగరము భుట్టో శత్రువులు ముట్టడించి వున్నారు . అందువలన నగరము ప్రమాదంలో వున్నది . ఈ స్థితిలో ఈ నగరమును ,నేను ,కుంభకర్ణుడు ,సర్వసైన్యాధిపతివైన నీవు ,ఇంద్రజిత్తు ,నికుంభుడు మాత్రమే రక్షించగలము . ఇంకెవరు  ఇందుకు సమర్థులు కారు . కావున నీవు వెంటనే సమర్థులైన రాక్షససైన్యమును తీసుకుని యుద్ధమునకు వెళ్లుము . చపలచిత్తులైన ఆ వానరులు నీ యుద్ధ దాటికి తట్టుకొనలేక పారిపోవుదురు . వానరులంతా పారిపోవుటచే రామలక్ష్మణులు నీకు దాసోహమవుదురు . "అని పలికెను . 
ఆ మాటలు విన్న ప్రహస్తుడు "మహారాజా !ఈ విషయముల గురించే మనము ఇదివరకే మంత్రులతో చర్చించి ఉంటిమి . అప్పుడు అభిప్రాయబేధములు ఏర్పడినవి . 'సీతాదేవిని రామునికి అప్పగించుటే మంచిది లేనిచో అనర్ధము తప్పదు 'అని అప్పుడే నేను చెప్పాను కానీ నీవు నా మాట వినలేదు . ఆ ఫలితమును ఇప్పుడు మనము చూస్తున్నాము . సరే ఏదేమయినా నీవు నన్ను ఇన్నాళ్లు చక్కగా గౌరవంగా ఏ లోటు లేకుండా చక్కగా చూసుకున్నావు కనుక ఇప్పుడు నేను నీ కోసము యుద్ధమునకు వెళ్తాను నా  అర్పిస్తాను . "అని పలికి సైన్యమునకు ఆజ్ఞ ఇచ్చి సైన్యముతోడి యుద్ధరంగమునకు పరమ ఉత్సాహముతో బయలుదేరెను . దారిలో ప్రహస్తుడికి అనేక పాసకుణములు కనిపించెను . ఆ అపశకునములకు ప్రహస్తుడి ముఖము వాడిపోయెను . అయినను తూర్పుద్వారముద్వారా యుద్ధమునకు వెళ్లెను . రాక్షస సైన్యమును చూసిన వానరులు వారితో యుద్ధము చేయుటకు చెట్లను ,కొండరాళ్ళను తెచ్చుకొనెను . 

రామాయణము యుద్ధకాండ ఏబదియేడవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





Friday 6 September 2019

రామాయణము యుద్ధకాండ -ఏబదిఆరవసర్గ

                                  రామాయణము 

                                      యుద్ధకాండ -ఏబదిఆరవసర్గ 

యుద్ధరంగమున కుముదుడు ,నలుడు ,మైందుడు ,ద్వివిదుడు అను వానర వీరులు వీర విహారం చేస్తూ రాక్షసులను హతమార్చుట చూసిన అకంపనుడు కోపముతో యుద్ధరంగము మధ్యలోకి వచ్చి తన బాణ పరంపరతో వానరులను చంపుట మొదలుపెట్టేను . వానరవీరులందరూ ఆ బాణముల దాటికి తట్టుకొనలేక ,యుద్ధరంగముననుండి పారిపోవుట మొదలుపెట్టిరి . 
అప్పుడే అక్కడకు వచ్చిన హనుమ ను చూసిన వానరవీరులందరూ పరుగు ఆపి ,ధైర్యము తెచ్చుకుని ,హనుమ  చుట్టూ చేరిరి . హనుమ వారికి ధైర్యము చెప్పి యుద్ధరంగములోకి వచ్చెను . హనుమను చూసిన అకంపనుడు హనుమపై బాణముల వర్షము కురిపించేను . అకంపనుడిని చంపవలెనని నిశ్చయించుకున్న హనుమ ఆ బాణములను తన శరీరంలోకి ప్రవేశించి బాధిస్తున్నాలెక్కచేయక ,తన చేతిలో ఏ ఆయుధము లేకపోవుటచే దూరముగా వున్న ఒక పర్వతమును పీకి దానిని గుండ్రముగా త్రిప్పుతూ పరుగున యుద్ధరంగములోకి వచ్చి దానిని అకంపనుడి మీదకు విసిరెను .  . అది చూసిన హనుమ తన మీదకు వస్తున్నా ఆ పర్వతమును తన వాడి బాణములతో ధ్వంసము చేసెను . అది చూసిన హనుమ ఒక పెద్ద నల్లమద్దిచెట్టుని పీకి దానిని అకంపనుడి మీద ప్రయోగించుటకు తెస్తూ దారిలో కనిపించిన రాక్షసులను ఆ చెట్టుతో హతమారుస్తూ అకంపనుడి వైపుగా రాసాగేను . అది చూసిన అకంపనుడు హనుమ పైకి అనేక బాణములు ప్రయోగించేను . హనుమ శరీరమంతా ఆ బాణముల దాటికి రక్తసిత్తమయ్యెను . హనుమ ఏమాత్రము లెక్కచేయక , వృక్తమును పీకి దానితో అకంపనుడి శిరస్సున కొట్టెను . ఆ దెబ్బకు అకంపనుడు అక్కడికక్కడే మరణించెను . 
అకంపనుడు మరణించుట చూసిన రాక్షసులు భయముతో పారిపోవుట మొదలుపెట్టిరి . వానరవీరులు సంతోషముతో హనుమ చుట్టూ చేరి జయజయ ద్వానములు చేసిరి . వానరవీరులంతా సంతోషపడిరి . సుగ్రీవుడు మొదలగు వానరవీరులు రామలక్ష్మణులు ,జాంబవంతుడు ,విభీషణుడు హనుమ పరాక్రమమును పొగిడిరి . 

రామాయణము యుద్ధకాండ ఏబదిఆరవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




Tuesday 3 September 2019

రామాయణము యుద్ధకాండ - ఏబదిఐదవసర్గ

                                 రామాయణము

                                యుద్ధకాండ - ఏబదిఐదవసర్గ 

అంగదుని చేతిలో వజ్రద్రంష్టుడు నిహతుడయ్యాడని తెలిసిన రావణుడు తన ఎదుట నిలబడివున్న సేనాధిపతి అయిన ప్రహస్తునితో "ప్రహస్తా !వివిధ అస్త్రములు ప్రయోగించుటలో సమర్థుడు అగు అకంపనుని నాయకత్వములో శత్రు భయంకర పరాక్రమములు ఐన రాక్షసయోధులను శీఘ్రముగా యుద్ధమునకు పంపుము . ఆ అకంపనుడు శత్రుసైన్యమును నిగ్రహించుటలో దిట్ట . తన సైన్యమును రక్షించుకొనుటలో మేటి . సేనాపతులలో గట్టివాడు . యుద్ధయోధులలో సమర్థుడు . అనుక్షణము ఇతనికి యుద్ధప్రీతి మెండు . శత్రువులను ముప్పతిప్పలు పెట్టగల ఈ అకంపనుడు ,రామలక్ష్మణులను సుగ్రీవుడు వంటి వానరవీరులను జయించగలడు "అని పలికెను . 

రావణుడి ఆజ్ఞ అందుకున్న అకంపనుడు ,శత్రుభయంకరులైన అనేకమంది రాక్షస వీరులను తీసుకుని యుద్ధమునకు బయలుదేరెను . పూర్వము వలే (ధూమ్రాక్షుడు ,వజ్రద్రంష్టుడు )అకంపనుడు కూడా తనకు అనేక అపశకునములు కనిపించినా వాటిని లక్ష్య పెట్టక యుద్ధరంగమునకు వెళ్లెను . శ్రీరాముని  వానరవీరులు ,రావణుని కొరకు రాక్షసులు తమతమ ప్రాణములు అర్పించుటకు సిద్దపడి ఘోరయుద్ధమునకు సిద్దపడిరి . వానరరాక్షస వీరుల పాదముల తాకిడి వలన చెలరేగిన దుమ్ము ఆ రణరంగమును కప్పివేసెను . 
రాక్షసుల సేనాధిపతి అయిన అకంపనుడు తీవ్రపరాక్రమశాలురు అయిన రాక్షసయోధులను యుద్ధమునకు రెచ్చగొడుతూ వారిని ఉత్సాహపరుస్తూ ,యుద్ధముచేయసాగెను . వానరవీరులు రాక్షసులకు ఎదురుగా నిలబడి ,వారి శస్త్రములను బలవంతముగా లాగుకొని వారిని చెట్లతో ,కొండలతో చంపసాగిరి . ఇంతలో వానరవీరులైన కుముదుడు ,నలుడు ,మైందుడు ద్వివిదుడు మిక్కిలి కోపముతో సాటిలేని విధముగా తమ బలములను ప్రదర్శించిరి . ఆ వానరవీరులు మిక్కిలి వేగముగా సేనాగ్రబాగమున నిలిచి ,వృక్షములను చేత పట్టుకుని రాక్షసులతో ఘోరయుద్ధము చేసిరి . వారవీరులందరూ పెద్దపెద్ద శిలలను తీసుకుని రాక్షసులను పిండిపిండి చేసిరి . 

రామాయణము యుద్ధకాండ ఏబదియైదవసర్గ సమాప్తము . 

                               శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు .  







Monday 2 September 2019

రామాయణము యుద్ధకాండ -ఏబదినాలుగవసర్గ

                                     రామాయణము 

                                      యుద్ధకాండ -ఏబదినాలుగవసర్గ 

అంగదుని అండతో వానరులు రెట్టింపు ఉత్సాహముతో రాక్షసులను చావకొట్టసాగిరి . అది చూసిన వజ్రద్రంష్టుడు వానరులపై బాణములను ప్రయోగించుట మొదలుపెట్టేను ఒక్కో బాణముతో అయిదుగురిని ,ఏడుగురిని ,ఎనిమిదిమందిని కొట్టసాగెను . ఆ బాణపు దెబ్బలకు తట్టుకొనలేక వానరులంతా అంగదుని వద్దకు పరుగులు తీసిరి . రక్తాలొడుతున్న శరీరములతో ఉన్న వానరులద్వారా విషయము గ్రహించిన అంగదుడు వజ్రద్రంష్టుడు తో యుద్ధమునకు సిద్దపడెను . వానరులపై బాణములు వేస్తున్న వజ్రద్రంష్ఠుడిపై ఒక పెద్ద చెట్టుని పీకి విసిరెను . వజ్రద్రంష్టుడు ఏ మాత్రము కంగారుపడకుండా తన బాణముతో ఆ చెట్టుని ముక్కలు చేసెను . వేయి బాణములతో అంగదుని గాయపరిచేను . కానీ అంగదుడు ఆ దెబ్బలను ఏ మాత్రము లెక్కచేయలేదు . 
వెంటనే అంగదుడు పెద్దకొండను తీసుకుని విసిరెను వజ్రద్రంష్టుడు కంగారుపడకుండా ,రథముమీదనుండి కిందకు దూకేను . అంగదుడు విసిరిన కొండవలన వజ్రద్రంష్టుడి రధము నుగ్గునుగ్గయ్యేను . అప్పుడు అంగదుడు పెద్దపెద్ద వృక్షములతో వున్న మరో కొండను తీసుకొచ్చి వజ్రద్రంష్టుడి తలమీద మోదెను . ఆ దెబ్బకు వజ్రద్రంష్టుడు  స్పృహకోల్పోయి కింద పడిపోయెను . కొద్దిసేపటికి తేరుకొనెను . అతడిని చూసిన అంగదుడు అతడితో మరల యుద్ధమునకు దిగెను . ఇద్దరు తమ బాహువులతోనే యుద్ధము చేసుకొనిరి . ఇద్దరి శరీరములు బాగా గాయపడుట వలన రక్తసిత్తములై ఉండెను . ఆ సమయములో అంగదుడు వజ్రద్రంష్టుడి ఒరలో వున్న ఖడ్గమును తీసి అతని ఖడ్గముతో అతడి శిరస్సునే నరికివేసెను . అప్పుడు వజ్రద్రంష్టుడు ప్రాణములు కోల్పోయి నేలపై పడిపోయెను . అది చూసిన రాక్షసులందరూ భయముతో లంక వైపుగా పరుగులు తీసిరి . వానరులంతా అంగదుని చుట్టూ చేరిరి . 

రామాయణము యుద్ధకాండ ఏబదినాలుగవసర్గ సమాప్తము . 

                           శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





Sunday 1 September 2019

రామాయణము యుద్ధకాండ -ఏబదిమూడవసర్గ

                                రామాయణము 

                               యుద్ధకాండ -ఏబదిమూడవసర్గ 

రాక్షసరాజైన రావణుడు ధూమ్రాక్షుడి మరణ వార్త విని కోపముతో ఊగిపోతూ ఒక మహాసర్పము వలె బుసకొట్టను . పిదప రావణుడు వీరుడు ,మహాబలశాలి ఐన వజ్రద్రంష్టుడిని యుద్ధమునకు వెళ్ళమని ఆజ్ఞాపించెను . 
మాయావి ,రాక్షసులలో ప్రముఖుడు ఐన వజ్రద్రంష్టుడు రావణుని ఆజ్ఞను తలదాల్చి ,అనేకమంది రాక్షసులను వెంట తీసుకుని గజములు ,అశ్వములు ,గాడిదలు ఒంటెలు ధ్వజపటములతో సర్వసన్నద్ధుడై ,రకరకముల ఆయుధములతో తన సైన్యముతో దక్షిణద్వారము వైపుగా యుద్ధమునకు వచ్చెను . అక్కడ అంతకు ముందే అంగదుడు తన సేనతో యుద్దమునకై సిద్ధముగా ఉండెను . వానర వీరులు రాక్షసులసైన్యము వచ్చుట చూసి సమరోత్సాహముతో పెద్దగా గర్జనలు చేసెను . 
వజ్రద్రంష్టుడికి వచ్చేదారిలో అనేక అపశకునములు ఎదురయ్యెను . వాటిని లెక్కచేయక సమరోత్సాహముతో ముందుకు కదిలెను . వానరరాక్షసయోదులమధ్య సమరం మొదలయ్యెను . అస్త్రములు అన్ని ప్రయోగించిన పిమ్మట అవి అయిపోవడంతో కొందరు వీరులు బాహుయుద్దమునకు తలపడిరి . వానరులను చంపుతున్న రాక్షసులను చూసిన అంగదుడు కోపముతో ఓకే పెద్ద చెట్టును పీకి ,దానితో వారిని కొట్టెను ఆ దెబ్బకు వారందరూ మరణించిరి . అది చూసిన మిగిలిన రాక్షసులు భయముతో కంపించిపోయిరి . 

రామాయణము యుద్ధకాండ ఏబదిమూడవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 
 






Wednesday 28 August 2019

రామాయణము యుద్ధకాండ -ఏబదిరెండవసర్గ

                                      రామాయణము 

                                         యుద్ధకాండ -ఏబదిరెండవసర్గ 

ధూమ్రాక్షుడు సైన్యముతో వచ్చుట చూసిన హనుమ ,మిగిలిన వానరులు రెట్టింపు ఉత్సాహముతో యుద్ధమునకు దిగెను . రాక్షసులు శూలములతో ,గదలతో రకరకాల ఆయుధములతో వానరులపై దాడికి దిగిరి . వానరులంతా రాళ్లతో ,చెట్లతో యుద్ధమునకు దిగిరి . వారి గోళ్లు ,పళ్లే వారికి ఆయుధములు . సమరప్రదేశమంతా రక్తసిత్తమయ్యెను . పచ్చి నెత్తురు తాగే రాక్షసులు వానరుల దాటికి నోటా రక్తము కక్కినారు . 
వానరుల విజృంభణ గమనించిన ధూమ్రాక్షుడు వానరులను అనేక బాణములతో బాధించుట మొదలుపెట్టేను . ఆ బాణ పరంపరలకు వానరులు తట్టుకొనలేక విలవిలలాడుట చూసిన హనుమ ధూమ్రాక్షుడి రథముపైన పెద్ద కొండరాయిని విసిరెను . అది గమనించిన ధూమ్రాక్షుడు తన గదను తీసుకుని రధమునుండి కిందకు దూకేను . పిమ్మట అతడు హనుమపైకి తన ముళ్ల గదను ప్రయోగించెను . అప్పుడు హనుమ పెద్ద పర్వతముతో ధూమ్రాక్షుడిపైకి దాడికి దిగెను . ధూమ్రాక్షుడి గద తనను గాయపరిచినా లెక్కచేయకుండా హనుమ పర్వతముతో దాడి చేయుటచే ధూమ్రాక్షుడు అక్కడికక్కడే నామరూపములు లేకుండా మరణించెను . ధూమ్రాక్షుడు మరణించుట చూసిన అతడి సైన్యము భయముతో పరుగులు తీసిరి . 

రామాయణము యుద్ధకాండ ఏబదిరెండవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


Tuesday 27 August 2019

రామాయణము యుద్ధకాండ -ఏబదిఒకటవసర్గ

                                రామాయణము 

                             యుద్ధకాండ -ఏబదిఒకటవసర్గ 

రామలక్ష్మణులు కోలుకోవటం చూసిన వానరుల సమూహము పెద్దగా కోలాహలంగా ధ్వని చేసెను . ఆ ధ్వనిని విని ఏమి అర్ధము కానీ రావణుడు తన పక్కనే వున్న కొంత మంది రాక్షసులను విషయము కనుక్కురమ్మని పంపెను . వెంటనే ఆ రాక్షసులు వెళ్లి రామలక్ష్మణులు సజీవంగా ఉండుట చూసి వచ్చి  రావణుడికి అదే విషయమును తెలిపిరి . ఆ మాటలు విన్న రావణుడు విషసర్పముల వంటి ఇంద్రజిత్తు బాణములు ఎలా విఫలము అయ్యోయో తెలియక ఆలోచించసాగెను . 
పిమ్మట రావణుడు" ధూమ్రాక్షుడు "అనే రాక్షసుడిని యుద్ధరంగమునకు వెళ్ళుటకు ఆజ్ఞాపించెను . వెంటనే 'ధూమ్రాక్షుడు 'అపారమైన సైన్యమును వెంట పెట్టుకుని పశ్చిమ ద్వారము వైపుగా యుద్ధమునకు బయలుదేరెను . అప్పటికే అక్కడ హనుమ లెక్కలేనంత వానరసైన్యముతో కూడి పశ్చిమద్వారము వద్ద యుద్ధము కొరకై నిలిచి ఉండెను . ధూమ్రాక్షుడు యుద్దమునకై రధము మీద వచ్చుచుండగా అతనికి అనేకమైన అపశకునములు కనిపించెను . ఆ అపశకునములు అపారంగా వున్న వానరసేనను చూసేసరికి ధూమ్రాక్షునికి కలవరపాటు మొదలయ్యెను . 

రామాయణము యుద్ధకాండ ఏబదిఒకటవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



Sunday 25 August 2019

రామాయణము యుద్ధకాండ -ఏబదియవసర్గ

                             రామాయణము 

                              యుద్ధకాండ -ఏబదియవసర్గ      

వానరులు భయముతో పారిపోవుట చూసిన సుగ్రీవుడు వానరులంతా ఎందుకిలా పారిపోవుచున్నారని ఆలోచించెను . అప్పుడే విభీషణుడు అక్కడికి వచ్చెను . సుగ్రీవుడికి విభీషణుడిని చూసే వానరులు పారిపోవుచున్నారని అర్ధము చేసుకున్నాడు . వెంటనే జాంబవంతుడు పారిపోవుచున్న పెద్దగా పిలుస్తూ ఆపెను . అంతట విభీషణుడు రామలక్ష్మణుల కన్నులను  మంత్రపూరిత జలములతో తుడిచెను . వారి దురవస్థను చూసిన వానరులందరూ మిక్కిలి చింతించసాగిరి . 
అప్పుడు సుగ్రీవుడు" వీరు కొంచం కోలుకున్నతర్వాత వీరిని కిష్కింధకు పంపి వానరసైన్యముతో నేనే లంకపై దాడి చేసి ఆ రావణుడిని ,అతడి పరివారమును చంపి సీతామాతను తీసుకువచ్చి శ్రీరాముడికి అప్పగిస్తాను "అని పలికెను . వానరులంతా మాట్లాడుకుంటుండగా పెద్దగా పెనుగాలులు వీచెను . సముద్రములో నీరు అల్లకల్లోలమయ్యెను . అందరూ ఏమిజరుగుతోందో అర్ధము కాక ,దిక్కులు చూడసాగిరి . అప్పుడే పక్షిరాజైన గరుత్మంతుడు అక్కడికి వచ్చెను గరుత్మంతుడు రావడంతోనే సర్పాస్త్రములో వున్న సర్పములన్నీ భయముతో ఆరిపోయెను . గరుత్మంతుడు రామలక్ష్మణుల వద్దకు వచ్చి ,రామలక్ష్మణులను తన చేతితి స్పృశించెను . వెంటనే రామలక్ష్మణుల శరీరముపై వున్న గాయములన్ని మాయమైపోయి వారికి పూర్వ రూపము వచ్చెను . 
అప్పుడు రామలక్ష్మణులు లేచి కూర్చొనెను . పిమ్మట గరుత్మంతుడు రామలక్ష్మణులను కౌగిలించుకొనెను . అప్పుడు శ్రీరాముడు గరుత్మంతునితో "మహానుభావా !నీవు రావటంతో మేము నాగాస్త్రము నుండి విముక్తులమయ్యాము . పైగా మాకు పూర్వపు జవసత్వములు వచ్చినవి . మాకు మహోపకారం చేసితివి . "అని పలికెను . ఆ మాటలకు గరుత్మంతుడు "శ్రీరామా !మనము స్నేహితులు మీరు ఆపదలో వున్నారని తెలిసి పరుగు పరుగు న వచ్చితిని . రాక్షసులు మాయా స్వభావులు . వారితో జాగ్రత్తగా ఉండండి . "అని పలికెను . ఆ విధముగా పలికి గరుత్మంతుడు శ్రీ రాముని వద్ద సెలవు తీసుకుని వెళ్లిపోయెను . 

రామాయణము యుద్ధకాండ ఏబదియవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





Friday 23 August 2019

రామాయణము యుద్ధకాండ -నలుబదితొమ్మిదవసర్గ

                                     రామాయణము 

                                  యుద్ధకాండ -నలుబదితొమ్మిదవసర్గ 

రామలక్ష్మణులు భయంకరమైన నాగాస్త్రముచే బందీలు అయి శరీరమంతా రక్తసిత్తమై పడివుండిరి . సుగ్రీవుడు మిగిలిన వానరులంతా వారి చుట్టూ చేరి ,కంగారుపడుతూ ఉండిరి . పరాక్రమశాలి ఐన శ్రీరాముడు నాగాస్త్రముతో బందించబడినప్పటికీ బలశాలి ,ధీరుడు కావున స్పృహలోకి వచ్చెను . స్పృహలోకి వచ్చిన శ్రీరాముడు పక్కనేపడివున్న తమ్ముడు లక్ష్మణుడిని చూసి మిక్కిలి విలపించెను . లక్ష్మణుడు లేనిచో తనకు సీతతోకాని ,తుదకు తన ప్రాణములతో కానీ పని ఏమున్నది బాధపడెను . లక్ష్మణుడు మరణించినచో తానూ మరణించేదని పలికెను . 
పిమ్మట సుగ్రీవుని తిరిగి కిష్కింధకు వెళ్లిపొమ్మని చెప్పెను . హనుమకు అంగదునికి కృతఙ్ఞతలు తెలిపి మిక్కిలి బాధపడసాగెను . అప్పుడు విభీషణుడు సైన్యమును తగురీతిగా నిలబెట్టి  రామలక్ష్మణులు వున్నా చోటికి రాసాగేను . కొందరు వానరులు అతడిని చూసి ఇంద్రజిత్తు అని భయపడి పారిపోయిరి . 

రామాయణము యుద్ధకాండ నలుబదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము యుద్ధకాండ -నలుబదియెనిమిదవసర్గ

                                    రామాయణము 

                                         యుద్ధకాండ -నలుబదియెనిమిదవసర్గ 

మహాబలశాలురైన రామలక్ష్మణులు యుద్ధభూమిలో కిందపడివుండుట చూసిన సీతాదేవి ,అంతులేని శోకముతో కృశించి విలపించసాగెను . ఆ సమయములో సీతామాత తనకు వివాహము కాకముందు పండితులు ,జ్యోతిషశాస్త్రజ్ఞులు తనను దీర్ఘసుమంగళీ అని చక్రవర్తికి భార్య అని చెప్పిన విషయములు గుర్తుతెచ్చుకుని ,ఈ రోజు ఇలా ఎందుకు జరిగిందని వారి మాటలు ఎలా తప్పయ్యాయని రోదించెను . ఆ విధముగా రోదిస్తున్న సీతాదేవిని చూసిన త్రిజట సీతాదేవితో
 "అమ్మా !నీవు దుఃఖించవలదు . నీ భర్త మరణించలేదు . సజీవంగానే వున్నాడు . అందుకు కారణములు చెబుతున్నాను విను . వానర సైన్యము అంతా ప్రశాంతముగా వున్నది . ఒకవేళ రామలక్ష్మణులు మరణించినట్లయితే ,వానరసైన్యము ఇప్పటికే భయముతో పారిపోయెడి వారు . లేదా దుఃఖించెడివారు . అదేమిలేక వారు ప్రశాంతముగా వున్నారు పైగా రామలక్ష్మణులను రక్షించుచున్నారు . మరణించినవారిని రక్షించరుకదా !మరణించినవారి ముఖములు నిర్జీవంగా వికృతముగా ఉంటాయి . రామలక్ష్మణులు కిందపడి వున్నా వారి ముఖములు కళగా వున్నవి . కావున వారు మరణించలేదు . నా మాటలు విని దుఃఖము మానుము . నీ మంచి కోరేదానిగా నీకు ఇవన్నీ చెప్పాను . నా మాట నిజము "అని పలికెను . 
త్రిజట మాటలు విన్న సీతాదేవి కొద్దిగా ఊరడిల్లెను . పిమ్మట రాక్షస స్త్రీలు అశోకవనమునకు సీతాదేవిని చేర్చిరి . రావణాసురునకు విహారభూమి ఐన అశోకవనమునకు చేరిన పిమ్మట సీతాదేవి తన మనసులో రామలక్ష్మణులను తలుచుకుని మిక్కిలి బాధపడెను . 

రామాయణము యుద్ధకాండ నలుబదియెనిమిదవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




Thursday 22 August 2019

రామాయణము యుద్ధకాండ -నలుబదియేడవసర్గ

                                   రామాయణము 

                                 యుద్ధకాండ -నలుబదియేడవసర్గ 

రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు చెప్పిన మాటలు విని మిక్కిలి సంతోషించిన రావణుడు ఇంద్రజిత్తును పంపించివేసి ,అశోకవనంలో సీతాదేవికి కాపలా పెట్టిన రాక్షసస్త్రీలను రప్పించెను . త్రిజట మొదలగు స్త్రీలు రావణుడి ఆజ్ఞ మేరకు వచ్చారు . వారితో రావణుడు "మీరు తక్షణమే బయలుదేరి ,అశోకవనమునకు వెళ్లి ఇంద్రజిత్తు రామలక్ష్మణులను చంపిన విషయము తెలిపి ,ఆమెను పుష్పకవిమానములో తీసుకువెళ్లి ,యుద్ధరంగములో పడివున్న రామలక్ష్మణులను చూపించండి "అని పలికెను . 
రావణుడి ఆజ్ఞ మేరకు త్రిజట మొదలగు రాక్షస స్త్రీలు పుష్పకవిమానమును అశోకవనమునకు తీసుకువెళ్లి ,సీతాదేవిని అందు ఎక్కించి ,యుద్దభూమికి తీసుకువెళ్లిరి . యుద్ధభూమిలో రాక్షసులు సంతోషముగా కోలాహలంగా ఉండిరి . వానరులందరూ బాధతో ఉండిరి . యుద్ధభూమిలో రామలక్ష్మణులు కిందపడి ఉండిరి . వారి కవచములు విరిగి ఉండెను . వారి శరీరములు మట్టికొట్టుకుని ఉండెను . అది చూసిన సీతాదేవి మిక్కిలి రోదించెను . 

రామాయణము యుద్ధకాండ నలుబదియేడవసర్గ సమాప్తము . 

                              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు )తెలుగుపండితులు . 

Wednesday 21 August 2019

రామాయణము యుద్ధకాండ -నలుబదిఆరవసర్గ

                                  రామాయణము 

                                       యుద్ధకాండ -నలుబదిఆరవసర్గ 

ఇంద్రజిత్తు ఉనికి తెలుసుకొనుటకై వెళ్లిన పదిమంది వానరులు ఆకాశము ,భూమిపై అంతా వెతికి అతడు కనపడకపోవుటచే తిరిగి రామలక్ష్మణులు వున్న చోటికి వచ్చిరి . సుగ్రీవుడు ,విభీషణుడు ,జాంబవంతుడు మిగిలిన వానరులందరూ రామలక్ష్మణులు వున్న చోటికి వచ్చి  చూసి మిక్కిలి శోకసంతస్తులయ్యిరి . 

వారందరిని చూసిన ఇంద్రజిత్తు  సైన్యముతో "చూసినారా ఖరదూషణాదులను చంపిన రాముడిని , సోదరుడు లక్ష్మణుడు ని చంపాను . దేవతలే దిగి వచ్చినా  రక్షించలేరు . మనల్నందరిని ఇంత ఇబ్బంది పెట్టిన వారిని నేను హతమార్చివేసాను . "అని పలికి నీలుని వాడి అయిన తొమ్మిది బాణములతో కొట్టెను . మైందుని ద్వివిదుని మూడు బాణములతో ,జాంబవంతుని ఒక  మీద ,హనుమంతునిపై  బాణములతో ,ఇంకా కొంత మంది మీద  ప్రయోగించి ఇంద్రజిత్తు యుద్ధరంగమునుండి లంకా నగరము  లోకి ప్రవేశించెను . 
రామలక్ష్మణుల దురవస్థ చూసిన సుగ్రీవుడు ధైర్యమును కోల్పోయి ,మిక్కిలి బాధపడసాగెను . అక్కడి వాతావరణము అంతా శోకముతో నిండిపోయెను . కన్నీరుమున్నీరు గా విలపించుచున్న సుగ్రీవుని విభీషణుడు తన మాటలతో ఓదార్చెను . "సుగ్రీవా !యుద్దములో ఈ విధముగా గాయపడుట సర్వసాధారణము . రామలక్ష్మణులకు  . వారిని హతమార్చగలవారు దేవతలలో లేరు . వారు ఆ నాగాస్త్ర ప్రభావము నుండి భయటపడు వరకు  జాగ్రత్తగా రక్షించవలెను . తర్వాత వారే మన బాగోగులు చూసుకుంటారు .  వుంది సమస్త  సైన్యమునకు ధైర్యము చెప్పు "అని పలికి మంత్రం పూరిత నీతితో సుగ్రీవుని నేత్రములను తుడిచెను . ఆ ప్రభావమున రాక్షస మాయలను సుగ్రీవుడు గుర్తించగలడు . 
 యుద్ధ రంగము నుండి అంతః పురములోకి ప్రవేశించిన ఇంద్రజిత్తు తండ్రిని చేరి రామలక్ష్మణులు మరణించిరని తెలిపెను . ఆ మాటలు విన్న రావణుడు సంతోషముతో  కౌగిలించుకొని యుద్ధ విశేషములు చెప్పమని కోరెను . అప్పుడు ఇంద్రజిత్తు యుద్ధరంగములో తన ప్రదర్శించిన విశేషములను తండ్రికి పూర్తిగా వివరించి చెప్పెను . 

రామాయణము యుద్ధకాండ నలుబదిఆరవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ, ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








Sunday 18 August 2019

రామాయణము యుద్ధకాండ -నలుబది అయిదవసర్గ

                                 రామాయణము 

                               యుద్ధకాండ -నలుబది అయిదవసర్గ 

శ్రీరాముని ఆదేశము మేరకు ఇంద్రజిత్తు ఆచూకీ తెలుసుకొనుటకు 'సుషేణుడి కుమారులు ఇద్దరు ,నీలుడు ,అంగదుడు ,శరభుడు ,వినతుడు ,జాంబవంతుడు ,సానప్రస్తుడు ,ఋషభుడు ,ఋషభస్కందుడు 'మొదలగు 10 మంది వానరవీరులు పెద్దపెద్ద వృక్షములను పట్టుకుని ఆకాశమునకు ఎగిరిరి . ఇంద్రజిత్తు తన ఆచూకీ కోసము ఆకాశములోకి ఎగిరిన వానరులను చూసి వారిపై భయంకరములైన బాణములను ప్రయోగించెను . మాయా యుద్ధము చేయుచుండుటచే ఆ వీరులు ఇంద్రజిత్తుని కనిపెట్టలేకపోయిరి . 
ఇంద్రజిత్తు మాయా రూపమున ఉండియే ,ఇంకా నాగాస్త్రములను రామలక్ష్మణులపై ప్రయోగించుచు ఉండెను . ఆ బాణముల దాటికి రామలక్ష్మణుల శరీరము రక్తసిత్తమయ్యెను . హనుమంతుడు మొదలగు వానర ప్రముఖులందరూ రణరంగమున రఘువీరులు నాగాస్త్రముచే బంధింపబడి యుండగా చూసి ,వారి సమీపమున చుట్టూ చేరి ఆర్తులై తీరని దుఃఖంలో మునిగిపోయిరి . 

రామాయణము యుద్ధకాండ నలుబదియైదవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము యుద్ధకాండ -నలుబదినాలుగవసర్గ

                                  రామాయణము 

                                    యుద్ధకాండ -నలుబదినాలుగవసర్గ 

ఆ విధముగా వానరులకు రాక్షసులకు మధ్య ఘోర యుద్ధము జరుగుతుండగా సూర్యుడు అస్తమించెను . వానరులు ,రాక్షసులు యుద్ధము జయింపవలననే కోరికతో పట్టుదలతో యుద్ధము చేయసాగిరి . దట్టమైన చీకట్లు వ్యాపించుటచే ,ఇరుపక్షములవారు ఒకరినొకరు గుర్తింపలేక "నీవు రాక్షసుడవేనా ?"అని వానరులు ,"నీవు వానరుడవేనా "అని రాక్షసులు అడిగి తెలుసుకుని మరీ యుద్ధము చేయసాగిరి . 
రాక్షసులు క్రోధావేశముతో వానరులపై పడి వారిని భక్షించుచుండిరి . అప్పుడు వానరులు కూడా కోపోద్రిక్తులై రాక్షసులపై పడి తమ పదునైన దంతములతో వారిని చీల్చుచుండిరి . మాయావులైన రాక్షసులు ఒకొకప్పుడు కనపడుచు ,మరొకసారి కనపడక యుద్ధము చేయుచుండిరి . అక్కడ రక్తపుటేరులు ప్రవహించినవి . తీవ్రముగా గాయపడి ,గగ్గోలు పెట్టుచున్న రాక్షసుల ,వానరుల ఆర్తనాదములు ఎంతో దారుణముగా వినపడెను . ఆ సమర భూమి గుర్తుపట్టలేనంతగా మారిపోయెను . 
రాక్షసులందరూ ఒక్కుమ్మడిగా విజృంభించి వానరులపై శరవృష్టి కురిపించెను . అలా విజృంభించుచున్నవారిలో ఆరుగురిని శ్రీరాముడు తన బాణములతో చంపివేసెను . పిమ్మట శ్రీరామచంద్ర ప్రభువు అన్ని దిక్కులా తన బాణములను ప్రయోగించెను . ఆ బాణములు తగిలిన రాక్షసులందరూ అగ్నిలో పడిన మిడతలవలె మరణించిరి . 

అప్పుడు వానరులలో బలిష్ఠులు మహాకాయులైన కొండముచ్చులు రాక్షసులను అదిమి పట్టి సంహరించిరి . 
మరోయొకవైపు అందగనితో ఇంద్రజిత్తు యుద్ధమొనర్చుచువుండెను . అంగదుని చేతిలో ఇంద్రజిత్తు రధము అశ్వములు నాశనము కాగా ఏమి చేయలేక  వున్నచోటునే ఇంద్రజిత్తు మాయమయ్యెను . అది చూసిన దేవతలు మహర్షులు ,రామలక్ష్మణులు ఇంద్రజిత్తుని ప్రశంసించిరి . ఆ విధముగా అంగదుని చేతిలో పరాభవం చెందిన ఇంద్రజిత్తు కోపముతో ఎవ్వరికి కనపడకుండా మాయారూపములో ఉండి రామలక్ష్మణులపై నాగాస్త్రమును ప్రయోగించెను . ఆ నాగాస్త్ర ప్రభావము వలన రామలక్ష్మణులు మూర్చిల్లిరి . 

రామాయణము యుద్ధకాండ నలుబదినాలుగవసర్గ సమాప్తము . 

                           శశి 

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







రామాయణము యుద్ధకాండ -నలుబదిమూడవసర్గ

                                    రామాయణము 

                                    యుద్ధకాండ -నలుబదిమూడవసర్గ 

వానరసైన్యము రాక్షస సైన్యము మీదికి పరుగులు తీసెను . అప్పుడు ఆ ఇరువురి సైన్యము మధ్య ధ్వంధ్వ యుద్ధము జరిగెను . అంగదుడిని ఇంద్రజిత్తు తన గదతో కొట్టెను . అప్పుడు అంగదుడు అదే గదను లాక్కుని ,ఇంద్రజిత్తు రధమును ,రధాశ్వములను,సారధిని చిత్తు చేసెను . 
ప్రజంఘనుడు అను రాక్షసుడు విభీషణుడి సచివుడైన సంపాతి పై మూడు బాణములు ప్రయోగించెను . అప్పుడు సంపాతి అక్కడే వున్న నల్లమద్ది చెట్టు ను పీకి ,ప్రజంఘనుడిని కొట్టగా మరుక్షణమే అతడు మరణించెను . 
జంబుమాలి తన బలమును ప్రయోగించుచు ,హనుమంతుడి వక్షస్థలముపై కొట్టెను . వెంటనే హనుమ ఆకాశములో ఎగిరి తన రచేతితో జంబుమాలిని కొట్టెను వెంటనే అతడు మరణించెను . 
'ప్రతపనుడు 'అను రాక్షసుడు నలుడుని తన బాణములచే గాయపరిచేను . వెంటనే నలుడు 'ప్రతపనుడి 'కళ్లు రాలగొట్టెను . 
వానరులకు ప్రభువైన సుగ్రీవుడు తన సైన్యములను దెబ్బతీయుచున్న 'ప్రఘసుని 'సప్తవర్ణ వృక్షముతో చావకొట్టి నిహతుని చేసెను . శ్రీరాముడు తన మీదకు బాణములు వేయుచున్న అగ్నికేతువు ,రశ్మికేతువు ,సుప్తఘ్నుడు ,యజ్ఞకోపుడు అను రాక్షసులను తన బాణములచే యమపురికి పంపెను . 
'మైందుడు 'తన పిడికిలి దెబ్బతో 'వజ్రముష్టి 'అను రాక్షసుని చంపివేసెను . నికుంభుడు అను రాక్షసుడు నీలుని వంద బాణములచే గాయపరిచి ,వికటాట్టహాసము చేసెను . వెంటనే నీలుడు నికుంభుడి రధ చక్రమును పీకి దానితోనే నికుంభుని ,అతడి రధ సారధి ని తల మీద కొట్టెను . విద్యున్మాలి సుషేణుడిని తీవ్రముగా కొట్టి గర్జించెను . అప్పుడు సుషేణుడు ఒక కొండరాయితో విద్యున్మాలి రధమును ధ్వంసము చేసెను అప్పుడు విద్యున్మాలి రధము దిగి ,గదతో తనపై దాడిచేస్తున్న సుషేణుడిని కొట్టెను . ఆ దెబ్బను పట్టించుకొనక సుషేణుడు ఒక కొండరాయితో విద్యున్మాలిని తీవ్రముగా కొట్టెను . వెంటనే అతడు మరణించెను . 
వానర వీరులకు ,రాక్షస యోధులకు ఇలా ఘోరముగా జరిగిన ధ్వంధ్వ యుద్దములో రాక్షసులు వానరుల చేతిలో మట్టికరిచితిరి . ఆ యుద్ధరంగమున ఖడ్గములు ,గదలు ,బల్లెములు ,ఇనుపగుదియలు ,అడ్డుకత్తులు విరిగి పడియుండెను . ముక్కలై పడిపోయిన రథములు చచ్చిపడి వున్న రధాశ్వములు ,మదపుటేనుగులు ,వానరుల యొక్క ,రాక్షసుల యొక్క కళేబరములు రథముల యొక్క చక్రములు  ఆ సమారా భూమి అందు కనపడుచున్నవి . శవములు భక్షించుటకై అక్కడికి నక్కలు గుంపులు గుంపులుగా వచ్చి వున్నవి . రాక్షస యోధులను చీల్చి చెండాడుటచే వానరుల దేహములు రక్తసిత్తములై వున్నవి . అప్పుడు నిశాచరులు (రాత్రిపూట తిరుగు వారైన రాక్షసులు )మళ్లీ ఘోరముగా యుద్ధము చేయుటకై సూర్యాస్తమయముకై (సూర్యాస్తమయ సమయములో రాక్షసుల శక్తి అధికమగును )నిరీక్షించుచుండెను . 

రామాయణము యుద్ధకాండ నలుబదిమూడవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .