Saturday 30 March 2019

రామాయణము సుందరకాండ -పదమూడవసర్గ

                                    రామాయణము 

                                 సుందరకాండ -పదమూడవసర్గ 

మహా పరాక్రమశాలి అయిన వాయుసుతుడు రావణ గృహములన్ని చుట్టి వచ్చి ,జానకి జాడ తెలియక తనలో తానూ ఇలా అనుకొనెను . "రావణుని భవనములు ఒక్కటి కూడా వదలక  వెతికితిని ,కానీ సీతాదేవి జాడ మాత్రము కనుగొనలేకపోయితిని . ఆ పరమ దుర్మార్గుడైన రావణుడు ఆ సాధ్విని అపహరించి తీసుకువచ్చునపుడు పెనుగులాటలో జారీ సముద్రములో పది చనిపోయినదేమో ? ఆ దుర్మార్గుడి నుండి తనను తాను రక్షించుకొనుటకై తానె సముద్రములో పది మరణించినదేమో ? నీచుడైన రావణునిచే భక్షించబడినదేమో ?ఆ కోమలాంగి అనేక విధములుగా రామా !లక్ష్మణా !అని విలపించుచు మరణించినదేమో ?
అయ్యో !ఇప్పుడు నేను వెళ్లి సీతాదేవి కనిపించలేదు అని చెప్పినచో ,ఆమెను ప్రాణతుల్యముగా భావించు శ్రీరామచంద్రుడు జీవించునా ?ఆయన మరణించినచో లక్ష్మణుడు మరణించును . అన్న గారి మీద అపారమైన ప్రేమ కల భరతుడు కూడా మరణించును ,తన అన్నలందరూ మరణించినచో శత్రుఘ్నుడు మాత్రము ఎలా బతకగలడు ? వీరందరి మరణ వార్త విన్నచో కౌసల్య ,సుమిత్ర ,కైకేయి మాటలు కూడా తప్పక మరణించెదరు . యావత్ అయోధ్యే శోకసంద్రమైపోతుంది . ఉత్తముడు శ్రీరాముని ప్రాణమిత్రుడుగా భావించు సుగ్రీవుడు సైతము బతకడు . అతని భార్య ఐన రుమ కూడా జీవించదు . తార ,అంగదు కూడా జీవించరు . సుగ్రీవుని హితులైన వానరులందరూ మరణించును . ఇందరి మరణమునకు కారణము అగుట కంటే అక్కడికి వెళ్లక నేనే మరణించుట మంచిది ? నేను వెళ్లకపోవుటచే వారు ఇంకా నేను వస్తా అని ఎదురుచూస్తూ జీవించివుందురు "అనుకొనెను . 

కాసేపటికి తన ఆలోచన తప్పని గ్రహించి ,మరణించుట అంత నీచకార్యము మరొకటి లేదని భావించెను . సీతాదేవి కనిపించకపోతే తపో దీక్ష పూని తపము ఆచరించుట ఉత్తమమని భావించెను . పిదప "మరియొకసారి వెతికెదను . సీతాదేవి ఈ లంకలోని వున్నదని దివ్యదృష్టితో చూసిన సంపాతి చెప్పియున్నాడు కదా ,ఇప్పటివరకు జనుల నివాస స్థానములు వెతికితిని . ఇప్పటి వరకు వెతకని ఈ అశోకవనమును వెతుకుదును . ఇక్కడ సీతామాత దర్శనము నాకు లభించు గాక "అని తలచి ఒక్క నిముషము కింద కూర్చుని ధ్యానము చేసెను . పిదప ఇంద్రాది దేవతలకి సీతారామ, లక్ష్మణులకు ,సుగ్రీవునికి మనసులో  నమస్కారము చేసుకొనెను 

రామాయణము సుందరకాండ పదమూడవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









Friday 29 March 2019

రామాయణము సుందరకాండ -పండ్రెడవసర్గ

                                         రామాయణము 

                                             సుందరకాండ -పండ్రెడవసర్గ 

సీతాదేవి దర్శనమునకై ఆరాటపడుచున్న మారుతి ఆ రావణుని భవనమంతా వెతికేను . కానీ సీతాదేవి మాత్రము కనిపించలేదు . ఆ మహాసాధ్వి కనిపించకపోవుట చే ఆ మారుతి "సీతాదేవి జీవించి వుండకపోయివుండొచ్చు . అందుకే ఎంతగా వెతికినా ఆమె కనిపించలేదు . దుష్టుడైన రాక్షసుడు ఆ తల్లిని వధించి వుండవచ్చు . లేదా పతివ్రతా శిరోమణియైన సీతాదేవి తనను తానూ రక్షించుకొనుటకు ఆమె మరణించివుండవచ్చు . సముద్రము లంఘించి వచ్చిన నా ప్రయత్నమూ అంతా వ్యర్ధమైనది . నేను తిరిగి వెళ్ళినచో నా రాకకై నిరీక్షించుచున్న వానరులందరూ నా చుట్టూ చేరి ఏమందురో ?లంకకు వెళ్లి ఏమి చేసివచ్చితివి ?అని నన్ను అడుగుదురేమో సమయము మించిపోయినచో వారందరూ ప్రాయోపవేశము చేస్తారు . కావున నేను ఉత్సాహము తెచ్చుకుని మల్లి వెతకాలి " అని భావించెను . 
పిదప మారుతి భూగర్భగృహములను ,దేవాలయములు ,విహారార్ధము దూరముగా నిర్మింపబడిన గృహములను పట్టిపట్టి వెతికేను . ఎత్తైన ప్రదేశములు ఎక్కుతూ ,దిగుతూ ,నిలబడుతూ ,ముందుకు సాగుతూ ,తలుపులను తెరుచుచూ ,మూయుచూ ,లోనికి ప్రవేశించుచు ,బయటకు వచ్చుచు ,దిగుచు ఎక్కుచు అన్ని ప్రదేశములలందు సంచరించెను . రావణాంతః పురమున ఆ హనుమంతుడు వేటకని స్థలమే లేదు . అతడు ప్రతి అంగుళమూ గాలించెను . సీతాన్వేషణకై కిష్కింద నుండి అన్ని దిక్కులకు వెళ్లిన వానరుల ప్రయత్నములు తన సముద్రాలంగణము వృధా అయినదని మిక్కిలి చింతాక్రాంతుడయ్యెను . 

రామాయణము సుందరకాండ పండ్రెండవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



రామాయణము సుందరకాండ -పదకొండవసర్గ

                                    రామాయణము 

                                         సుందరకాండ -పదకొండవసర్గ 

ఆ కపివరుడు అప్పటి వరకు చేసిన ఆలోచన తప్పని భావించసాగెను . రాముని ఎడబాటుకు గురియైన సీతాదేవి ఇలా నిద్రించుట సంభవమా ?అట్టి స్థితిలో ఆమెకు అన్నపానాదులమీద మనసే పోదు . ఆభరణములు విషయమే పట్టదు . పరపురుషుడు అంతటి వాడైనను ,కడకు సురాదిపతి అయినను ,అతనిని ఆ మహా సాధ్వి దరి చేరదు దేవతలలో సైతము ఎవ్వడూ రామునితో సమానుడైనవాడు లేడు . కనుక ఈమె సీతాదేవి కానేకాదు . అని నిశ్ఛయించుకొనెను . అలా నిశ్చయించుకున్న పిదప హనుమ ,మళ్లీ ఆ భవనమును అత్యంత నిశితముగా పరిశీలించసాగెను . ఆ పానశాలలో పెద్దపెద్ద బంగారు పాత్రలలో సగము తిని వదిలివేయబడిన రకరకముల మాంసాహార పదార్ధములు కలవు . వివిధ రకములైన పచ్చళ్ళను ,పానీయములను ,భోజ్యములను ,పులుపు ,ఉప్పు మొదలగు షడ్రసోపేతమైన తినుబండారములను ఆ హనుమ చూసేను . 
వివిధ పల రసములతో నిండి వున్న పాత్రలను ,చెల్లాచెదురుగా పడి  వున్న అమూల్య హారములను ,అందెలను ,కేయూరములను మారుతి చూసేను .  మణిమయములైన వెండి ,బంగారు పాత్రలతో మద్యము ను చూసేను . ఆ పాత్రలలో కొన్ని సగము త్రాగి వున్నవి ,కొన్ని పూర్తిగా త్రాగినవి ,మరికొన్ని అసలు ముట్టనివి . అటువంటి పాత్రలన్నిటిని హనుమ చూసేను . ఆ భవనంలో నిద్రించుచు వున్న స్త్రీలందరిని మారుతి మరొక సారి పరీక్షగా చూసేను . కానీ సీతాదేవి జాడమాత్రము తెలియరాలేదు . అప్పుడు ఆ వాయు సుతుడు ,"నిద్రించుచున్న పరస్త్రీలను చూసాను . నా డ్రామమునకులోపము జరిగినదేమో "అని సందేహపడెను . బ్రహ్మచర్య నిష్ఠ దెబ్బతినునేమో అని ఆలోచించెను . 
పిదప ఆయనే  తనలో తాను "నిద్రించుచున్న రావణుని స్త్రీలందరిని పరికించి చూసినది నిజమే ,అయినను నాకు ఎట్టి మనోవికారము కలుగలేదు . శుభాశుభ విషయములందు ,సమస్తమైన తీరుతెన్నులపై మనస్సే కారణము , కానీ నా మనస్సు ఎట్టి వికారమునకు లోనుకాకుండా మనసు నిశ్చలముగా ఉన్నది . వైదేహిని మరియొక చోట ఎక్కడ వెతికను ?స్త్రీలను ,స్త్రీల సమూహము మధ్యలోనే వెతకవలెను . ఒక ప్రాణిని ఆ జాతి ప్రాణుల మధ్యనే వెతకవలెను . తప్పిపోయిన ఒక స్త్రీని లేళ్ల మధ్య వెతుకుట వలన ప్రయోజనము లేదు . అందువలన నేను నిర్మలమైన మనస్సుతో నేను ఈ రావణ అంతః పురమును నిశితముగా పూర్తిగా గాలించితిని . కానీ జానకీ దేవి మాత్రము కన్పించలేదు  "అని అనుకొనెను . వీరుడైన హనుమంతుడికి దేవగంధర్వ నాగ కన్యలు కనపడిరి కానీ సీతాదేవి మాత్రము కన్పించలేదు . హనుమంతుడు ఆ భవనము నుండి బయటకు వచ్చి కృత నిశ్చయుడై ,మరల ఆ రావణ అంతః పురమున సీతాదేవి కొఱకు వెతకసాగెను . 

రామాయణము సుందరకాండ పదకొండవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ , ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Thursday 28 March 2019

రామాయణము సుందరకాండ -పదవసర్గ

                            రామాయణము 

                               సుందరకాండ -పదవసర్గ 

సీతాదేవి జాడకై అతినిశితముగా వెతుకుచున్న హనుమంతుడు ఆ మహాభవనము నందు ఒక శయనాసనము (మంచము )ను చూసేను . అది దంతపు నగిషీలతో ,బంగారు పూలతో ,రత్నములతో ,వజ్ర ,వైడూర్యములతో చక్కగా అలంకరింపబడి ఉండెను . అచట చామరములు చేతపట్టి చక్కగా విసురుతున్న స్త్రీలు ను మారుతి చూసేను . ఆ ప్రాంతము సుగంధభరితమై ఉండెను . ఆ మహాతల్పంపై ఉన్న రావణుని హనుమ చూసేను . ఏనుగు వలె గురక పెడుతున్న రావణుని చూసి మారుతి "ఛీ !యితడు పరస్త్రీ ని అపహరించిన దుర్మార్గుడు ,ఇతనికి దూరముగా ఉండాలి "అని అనుకొనెను . 

వెంటనే కొంచం దూరముగా వెళ్లి రావణుని పరీక్షగా చూసేను . రావణుడు దృడ కాయుడు ,బలిష్ఠుడు అతడు ఆదమరచి నిద్రించుచు ఉండెను . అతడి కాళ్లవద్ద వున్న అతడి ప్రియపత్నులను హనుమ చూసేను . అచ్చటికి దగ్గరలోనే ఒక ప్రత్యేక శయ్యపై వున్నా ఒక స్త్రీ ని మారుతి చూసాడు . ఆమె మిక్కిలి సౌందర్యవతి ,తేజోవతి ,ఆమె తేజస్సుతో ఆ భవనమునకే కళ వచ్చినట్లుండెను . అటువంటి స్త్రీ (రావణుని పట్టమనిషి ఐన మండోదరి )ని హనుమ చూసి ఆమే సీతాసాద్వి అని భావించి సంతోషముతో గట్టిగా భుజములను చరుచుకొనెను ,తన తోకను ముద్దాడెను ,పాటలు పాడెను ,నృత్యము చేసెను . 

రామాయణము సుందరకాండ పదవసర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








రామాయణము సుందరకాండ -తొమ్మిదవసర్గ

                                       రామాయణము 

                                                  సుందరకాండ -తొమ్మిదవసర్గ 

శ్రేష్ఠముగా విలసిల్లెడి ఆ పుష్పక విమానమును పూర్తిగా వెతికిన పిమ్మట మారుతి ఆ పుష్పక విమానంపై కూర్చొనెను . అప్పుడు శ్రేష్ఠమైన ఆహార పదార్థముల నుండి మంచి వాసన హనుమ కు వచ్చెను . అది వాయుదేవుడే ఇటు రమ్మని పిలిచినట్లుండెను . ఆ వాసన వచ్చిన దిశగా అంజనీపుత్రుడు వెళ్లెను . అది రావణుడి భవనము . అక్కడ అనేకులైన స్త్రీలు ఉండిరి . వారందరూ మద్యపానము చేయుటచే ,అర్ధరాత్రి అగుటచే మత్తులో ఎక్కడివారక్కడ పడుకుని దొల్లుతూ ఉండిరి . వారందరూ ముగ్దమనోహరముగా ఉండిరి . వారి నగలు చిందరబందరగా వున్నవి . వారందరి మధ్యలో రావణుడు నిద్రిస్తూ ఉండెను .వారిలో కొందరు రావణుడు గెలిచి తీసుకురాబడినవారు , మరికొందరు రావణుడిని ఇష్టపడి తామంతటతామే వచ్చినవారు . వారిలో ఒక్కరు కూడా బలవంతముగా తేబడినవారు లేరు .  వారిని చూసిన హనుమంతుడు . రావణుడు అతడి భార్యలతో సంతోషముగా వున్నట్టే ,శ్రీరామచంద్రమూర్తి కూడా తన ధర్మపత్నితో వుంది వుండే ,రావణుడికి ఆపద తప్పి ఉండేదని భావించెను . రావణుడు ఉత్తమ వంశమున జన్మించాడు . లంకకు ప్రభువు ,గొప్ప శివ భక్తుడు ,అయినప్పటికీ అతడు చేసిన పాపా కార్యము (సీతాపహరణము )వలన అతడికి ముప్పు రాబోవుచున్నదని మారుతి భావించెను . 

రామాయణము సుందరకాండ తొమ్మిదవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . . 

Monday 25 March 2019

రామాయణము సుందరకాండ -ఎనిమిదవసర్గ

                            రామాయణము 

                      సుందరకాండ -ఎనిమిదవసర్గ 

అమిత బలపరాక్రముడైన మారుతి ఆ పుష్పక విమానమునందలి గోడలను ,సౌధములను ,అక్కడి చిత్ర కళను చూసి బాగు బాగు అనుకొనెను . 

రామాయణము సుందరకాండ ఎనిమిదవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Friday 15 March 2019

రామాయణము సుందరకాండ -ఏడవసర్గ

                               రామాయణము 

                                సుందరకాండ -ఏడవసర్గ 

హనుమ లంకలో ఆ విధముగా సీతాదేవిని వెతుకుతూ గొప్పది ,బహు విశాలమైనది ,మహిమాన్వితమైనది ,అత్యంత సుందరమైనది ,చాలా అరుదైనది ఐన పుష్పకవిమానమును చూసేను . దానిపై అందమైన పెక్కు బొమ్మలు వేయబడి వున్నవి . అవి చాలా అందముగా వున్నవి . దానిలో లక్ష్మి దేవి తామరలతో నిండిన సరస్సు మధ్యలో .చేతిలో తామరలతో కూర్చున్నట్లుగా అందముగా చిత్రించబడి వున్నది . ఆ దేవికి ఇరుపక్కలా రేణు ఏనుగులు ఆ సరస్సులోని తామరలను తీసి ఆ దేవికి సమర్పిస్తున్నట్లుగా వున్నది . ఆ పుష్పక విమానమంతయు ,ఆ చుట్టుపక్కల మారుతి బాగుగా వెతికేను . కానీ ,శ్రీరాముని ధర్మపత్ని ఐన సీతామహాసాధ్వి మాత్రము కనిపించలేదు . 

రామాయణము సుందరకాండ ఏడవసర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Wednesday 13 March 2019

రామాయణము సుందరకాండ - ఆరవసర్గ

                                         రామాయణము  

                                                సుందరకాండ - ఆరవసర్గ 

మహా పరాక్రమ శాలి ఐన హనుమంతుడు లంక అంతా తిరిగినా కూడా సీతా దేవి కనిపించక విచార గ్రస్తుడు అయ్యెను . వెంటనే ఉత్సాహము తెచ్చుకొని , నేర్పుతో లంక అంతా వెతక సాగెను . మిక్కిలి పరాక్రమశాలి ఐన హనుమంతుడు వేగంగా ప్రహస్తుని భవనము పైకి దూకెను . పిమ్మట మహా పార్వ్సుని , కుంభకర్ణుని , విభీషణుని , విరూపాక్షుడు , విద్యుజ్జిహ్వుడు , విద్యున్మాలి , వజ్రదంష్ట్రుడు , శుకుడు , సారణుడు , ఇంద్రజిత్తు , జంబుమాలి , సుమాలి, రశ్మి కేతువు , సూర్య శత్రువు , వజ్రకాయుడు , ధూమ్రాక్షుడు , సంపాతి , విద్యుద్రూపుడు , భీముడు , ఘనుడు , విఘనుడు , సుపనాసుడు , వక్రుడు , శఠుడు , వికటుడు , హ్రస్వకర్ణుడు , దంష్ట్రుడు , రోమశుడు , యుద్దోన్మత్తుడు , మత్తుడు , ధ్వజగ్రీవుడు, కరాళుడు  , నాది , ఇంద్రజిహ్వుడు , హస్తిముఖుడు , పిశాచుడు , శోణితాక్షుడు , మొదలగు రాక్షసుల గృహములను మారుతి వరుసగా శోధించెను . 
సుప్రసిద్దుడైన మారుతి ఆ రాక్షుల భవనములు వెదుకు సమయమున సంపన్నులైన రాక్షసుల యొక్క ధనమును , తిలకించెను . ఆ భవనములను పూర్తిగా శోధించిన పిమ్మట రాక్షస రాజైన రావణుని ప్రాసాదమునకు చేరెను. అంతయును తిరుగుచు రావణుని సమీపమున శయనించిన వారిని , వికృతములైన చూపులుగలవారను ఐన  రాక్షస స్త్రీ లను  చూచెను . సీతాదేవి మాత్రము కనిపించలేదు . 

రామాయణము సుందరకాండ ఆరవసర్గ సమాప్తము . 

                          శశి 

ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Tuesday 12 March 2019

రామాయణము సుందరకాండ -అయిదవసర్గ

                           రామాయణము 

                            సుందరకాండ -అయిదవసర్గ 

కపిశ్రేష్టుడైన ఆ మారుతి లంకలోని సమస్త భవనములను ,వనములను ,జనులు వుండు ప్రదేశములను అణువణువూ వదలక గాలించెను . ఎక్కడ వెతికినను సీతాదేవి జాడ తెలియలేదు . 

రామాయణము సుందరకాండ అయిదవసర్గ సమాప్తము . 

 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Monday 11 March 2019

రామాయణము సుందరకాండ -నాల్గవసర్గ

                              రామాయణము 

                                   సుందరకాండ -నాల్గవసర్గ 

ఆ విధముగా లంకిణి ని జయించిన మారుతి ముఖద్వారం నుండి కాక ప్రాకారము దూకి వెళ్లెను . అలా వెళ్లునప్పుడు కూడా ఎడమకాలిని ముందు పెట్టి వెళ్లెను (శత్రువుల ఇంటికి వెళ్లునప్పుడు ఎడమకాలు పెట్టి వెళ్ళవలయును . ఇది బృహస్పతివాక్యము ). ఆ విధముగా లంకా నగరములో ప్రవేశించిన మారుతి అక్కడి భవనములు వెతకసాగెను . ఆ బవనములన్ని బహు సుందరముగా ఉండెను . అవి ఒకదానినిమించిఒకటి అందముగా ఎత్తుగా ఉండెను . ఆ భవనములలో రకరకాల స్త్రీలను ,రకరకాల రాక్షసులను చూసేను . అందమైన వనములను ,సరస్సులను చూసేను . కాపలా కాయుచున్న వేల  సైనికుల్ని మారుతి చూసేను . అక్కడ ఒంటి కన్ను వాణ్ని ,ఒంటి చెవివాన్ని ,పోట్ట ఎదరకు వున్నవాణ్ణి ,కోరలు కలవాణ్ణి ,ఇలా రకరకాల జనులను మారుతి చూసేను . తర్వాత హనుమ రావణుని అంతఃపురములోకి ప్రవేశించెను . అక్కడ గోడలన్నీ బంగారముతో తాపడము చేసివున్నవి వాటిపై మణులు ,రత్నములు అందముగా అతకబడి వున్నవి . ఆ గుమ్మములకు ముత్యములు తోరణములుగా కట్టబడి వున్నవి ఆ తోరణముల మధ్యలో వైడూర్యములు ,అందముగా వేలాడదీయబడి వున్నవి . 

రామాయణము సుందరకాండ నాల్గవసర్గ సమాప్తము . 

            శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము సుందరకాండ -మూడవసర్గ

                                రామాయణము 

                                  సుందరకాండ -మూడవసర్గ 

హనుమ చీకటిపడిన పిమ్మట నెమ్మిదిగా తన చిన్న ఆకారములో లంకలోకి ప్రవేశించ చూసేను . కానీ లంకాధిదేవత ఐన లంకిణి హనుమను చూసింది . అది వెంటనే భీకర స్వరముతో "ఓయ్ వానరా !ఎవరు నీవు నిజముచెప్పు ?ఎందుకు ఈ లంకా మహా నగరంలోకి ప్రవేశించాలని చూస్తున్నావు ?నన్ను దాటి ఎవ్వరు లోపలి వెళ్ళలేరు ?అనెను . అప్పుడు హనుమ తన ఆకారమును మాములుగా చేసి "నేనెవరో తర్వాత చెబుతా కానీ ముందు నువ్వెవరో చెప్పు "అనెను . 

అప్పుడు లంకిణి కోపము పెరగగా తీవ్ర స్వరముతో "వానరా !నేను ఈ లంకాధి దేవతను . రావణుడి విధేయురాలను . నన్ను దాటి ఎవరు లోపలి ఎవ్వరు వెళ్ళలేరు . ఇప్పుడు చెప్పు నువ్వెవరు ?ఎందుకు లోపలి వెళ్తున్నావ్ ?"అనెను . అప్పుడు హనుమ "అమ్మా !నేను ఈ అందమైన లంకా నగరమును చూడవలెననే ఉత్సాహముతో ఇచటికి వచ్చాను . చూసి వెంటనే వచ్చెదను ?అని పలికెను . అప్పుడు ఆ లంకిణి "దుర్బుద్ధి కల ఓ వానరా !నీ వేషములు నా దగ్గర సాగవు . మర్యాదగా వెనకకు వెళ్ళు "అని తీవ్ర స్వరముతో పలికెను . అప్పుడు హనుమ "ఓ శుభాoగి లోపలి వెళ్లి వెంటనే వచ్చెదను "అని పలికెను . 
అప్పుడా లంకిణి విపరీతమైన కోపముతో హనుమంతుడిని ఒక్క దెబ్బ వేసెను . ఆ దెబ్బకు హనుమంతుడు ఒక పెద్ద ధ్వని చేసి ,వెంటనే తన ఎడమ చేతితో స్త్రీ అని చిన్నగా కొట్టెను . 



ఆ దెబ్బకే లంకిణి అదిరిపడెను . అప్పుడా లంకిణి "ఓ వానరా !పూర్వము బ్రహ్మదేవుడు నాకు వరమిచ్చు సందర్భములో" ఒక వానరుడు వచ్చి నిన్ను జయించి లంకా నగరంలోకి పర్వేశించినపుడు రాక్షసులకు వినాశకాలము వస్తుంది . "అని పలికెను . ఇప్పుడు నీవు జయించినావు . ఇక రావణాది సమస్త రక్కసులకు  సీత కారణముగా వినాశకాలము రాబోవుచున్నది కాబోలు . నా అంచనా ప్రకారము  నీవు ఆవిడను వెతుకుతూ ఇక్కటిది వచ్చివుంటావు . వెళ్లు నేను నిన్ను ఆపలేను . నీవు లంకలోకి వెళ్లి సీతను అన్వేషించు "అని పలికి లంకలోకి దరి ఇచ్చెను . 

రామాయణము సుందరకాండ మూడవసర్గ సమాప్తము . 

           శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








రామాయణము సుందరకాండ -రెండవసర్గ

                                        రామాయణము 

                                               సుందరకాండ -రెండవసర్గ 

సముద్రమును దాటి తీరము చేరిన హనుమ లంకా నగరమును చూసి, ఆ  నగరంలోకి ప్రవేశించుట ఎట్లు అని ఆలోచించసాగెను .

 సీతాపహరణ కారణముగా లంకా నగరబయట భయంకరులైన అనేక మంది రాక్షసులు కాపలా కాస్తున్నారు . యదార్ధ రూపములో వెళితే లోపలి వెళ్ళుట అసాధ్యము . పైపెచ్చు వచ్చిన పని అవ్వకపోవచ్చు . ఈ మాయావులైన రాక్షసులను మోసగించి ,వారికి కనపడకుండా లంకా నగరంలోకి ప్రవేశించాలి . సీతాదేవిని వెతకాలి . అని మనసులో బాగుగా ఆలోచించుకుని చివరకు చీకటి పడిన తర్వాతే మార్జాల ప్రమాణములో లంకలోకి ప్రవేశించుట ఉత్తమమని హనుమ భావించెను . 

రామాయణము సుందరకాండ రెండవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Sunday 10 March 2019

రామాయణము సుందరకాండ - మొదటిసర్గము

                                    రామాయణము 

                               సుందరకాండ - మొదటిసర్గము 

అనంతరము జాంబవంతుని ప్రేరణ తో అరివీర భయంకరమైన ఆంజనేయుడు రావణాపహృతయైన సీతయొక్క జాడను అన్వేషించుటకై , చారణాది దివ్య జాతులవారు సంచరించు ఆకాశమార్గమున వెళ్ళుటకు నిర్ణయించుకొనెను .
దుష్కరమైన సాటిలేని వాడై హనుమంతుడు తన మెడను శిరస్సును నిటారుగా నిలిపి వృషాబెంద్రునివలె ,  ప్రకాశించుచుండెను . 
ఆ మహేంద్రగిరి సహజముగానే నీలము , ఎరుపు , పసుపు,ఆకుపచ్చ , తెలుపు , నలుపు మొదలగు చిత్ర విచిత్రమైన వర్ణముల కల దాతువులచే ,అలంకృతమై వున్నది . అక్కడ దేవతాసములైన యక్ష ,కిన్నెరా గంధర్వ ,నాగులు ఎప్పుడూ సంచరిస్తూ వుంటారు . అనేకమైన ఏనుగులతో వున్న ఆ మహేంద్రగిరి శిఖరంపై ఉన్న ఆ హనుమంతుడు జలాశయములో వున్న పెద్ద ఏనుగులా కనిపించాడు . 
ముందుగా మారుతి వాయుదేవునికి ,సూర్యదేవునికి ,బ్రహ్మ దేవునికి నమస్కారము చేసెను . పిదప ఆయన కొండను తన కాళ్లతో గట్టిగా అదిమి పైకి లంఘించుటకు సిద్దపడెను . 

 అలా ఆయన లంఘించునపుడు అది పెద్ద పర్వతమే అయినా కొన్ని క్షణములపాటు అది చలించెను . అలా చలించునపుడు ఆ పర్వతముపై కల గుహలలో వున్న జంతువులన్నీ భయముతో పెద్దగా అరుస్తూ ,పారిపోసాగెను . 
విద్యాధరులు మెదలగు దేవతాసములు కంగారుగా అక్కడి నుండి ఆకాశముపైకి ఎగిరిరి . అలా ఎగిరినప్పుడు వారి హారములు ,మిగిలిన ఆభరణములు అచటనే పడిపోయినవి . వారికి ఏమి జరుగుతోందో తెలియక ఆకాశముపై నిలబడి ఏమి జరుగుతోందో చూడసాగిరి . అక్కడే నిలబడి చూస్తున్న ఋషులు వారిలోవారు "ఈ మారుతి శ్రీరాముని కార్యమార్థమై అన్యులకు అసాధ్యమైన ఈ సముద్రమును లంఘించుచున్నాడు "అని అనుకోసాగిరి . ఆమాటలు విన్న విద్యాధరాదులు మారుతిని చూసిరి . 
అప్పుడు ఆ మారుతి ఊపిరి గట్టిగా పీల్చి ,చేతులు నడుముపై ఉంచి ,తోకను ఆకాశవీధిని పెంచి తననే చూస్తున్న వానరులతో "ఓ వానరవీరులారా !నేను ఇప్పుడే బయలుదేరి లంకకు వెళ్లి అక్కడ సీతా దేవి ఎక్కడున్నా వెతికి సీతాదేవిని తీసుకు వచ్చెదను ఒకవేళ అక్కడ ఆ సాద్వి కనిపించనిచో ఆ లంకని పెకలించి తెచ్చెదను . "అని పలికెను . అలా పలికి తీవ్ర బలముతో ఎగిరెను . 

అలా ఎగిరిన మారుతిని చూసి దేవతలు ,నాగులు ,యక్షులు ,కిన్నెరలు ,ఋషులు మొదలగు వారందరూ మారుతిని పొగడసాగిరి . అలా ఎగురుతున్న మారుతిని చూసి సముద్రుడు "నేను ఇంతటివాడను అగుటకు ఇక్ష్వాకు ప్రభువైన సగరుడే కారణము . కావున ఆ వంశ సంభూతుడైన శ్రీరాముని పనిపై వెళుతున్న మారుతికి కాసేపు విస్రాంతిని ఇవ్వవలెను "అని మనసులో తలుచుకుని ,తనలో దాగి వున్నా మైనాకుని పైకి పిలిచెను . 


అకస్మాత్తుగా ఎదురుగా నిలిచినా మైనాకుని చూసిన మారుతి అది అడ్డముగా తలచి దానిని తన వక్ష స్థలముతో త్రోసెను . అప్పుడా మైనాకుడు మారుతి వెంటే వెళ్లి మానవరూపము దాల్చి ఆ పర్వతము శిఖరంపై నిలబడి "ఓ మారుతీ !నీకు అలసట తెలియకుండా కాసేపు విశ్రమించుటకు నన్ను సముద్రుడు పంపాడు . నాకును నీవు ప్రీతికరమైనవాడవు ఎలా అంటే ,ఒకానొక సమయములో కులపర్వతముల రెక్కలు త్రెంచుటకు పూనుకొనెను . అప్పుడు మీ తండ్రి ఐన వాయుదేవుడు నన్ను ఈ సముద్రములో పడవేసెను . ఆ విధముగా నేను రక్షించబడ్డాను . ఆ కారణము చేత కూడా నేను నిన్ను కాసేపు నాపై విశ్రమించామని కోరుతున్నాను "అని పలికెను . 
అప్పుడు మారుతి అంత సమయము లేదు రామ కార్యమునకు ఆలస్యము అవుతున్నది చీకటి పడక మునుపే సముద్రము దాటవలెను . అన్యదా భావించవద్దు . నేను ఆతిధ్యము స్వీకరించినట్టే భావించుము . "అని పలికి మునుఁడుకు సాగెను . అలా ముందుకు వెళ్తున్న హనుమను చూసి దేవతలు హనుమ బలమును (ముఖ్యముగా బుద్ధి  బలమును )పరీక్షింపగోరి నాగమాట ఐన' సురస 'ను పిలిచి హనుమను అడ్డుకుని పరీక్షించామని పలికిరి . అప్పుడు ;సురస ;విస్తృతాకారము కల రాక్షసిలా మారి హనుమకు అడ్డుగా నిలిచి తన నోట్లోకి వచ్చి తనకు ఆహారము కమ్మని ,ఏ ప్రాణి అయినా తనను దాటి ముందుకు పోలేదని , అది తనకు బ్రహ్మ దేవుడి వరమని పలికెను . అప్పుడు మారుతి "ఓ మాతా !నేను రామకార్యార్థినై వెళుతున్నాను . కావున అడ్డు తొలగు నీకు కావాలంటే నేను సీతామాత జాడ తెలుసుకుని వచ్చి నీకు ఆహారమవుతాను అని పలికెను . 
కానీ  'సురస' ఒప్పుకొనక ఆహారము నోటిలోకి వచ్చితీరవలెనని పలికెను . ఆ మాటలు విన్న హనుమ తన శరీరమును మరింతగా పెంచెను . అప్పుడు 'సురస కూడా తన నోటిని మరింత వెడల్పు చేసెను . హనుమ మళ్ళీ శరీరము పెంచెను .  ఆమాత కూడా నోటిని వెడల్పు చేసెను . ఇలా కొంతసేపు గడిచినపిదప హనుమ చాలా చిన్నగా మారి ,నోటిలో ప్రవేశించి ,వెంటనే బయటకు వచ్చెను . 

అతడి బుద్ధిబలమునకు మెచ్చిన సురస అతడిని ఆశీర్వదించి పంపెను . అది చూసిన దేవతలు ఋషులు అందరూ హనుమను పొగిడిరి . 
పిమ్మట వేగముగా ముందుకు సాగిపోవుచున్న హనుమను చూసిన 'సింహిక 'అను రాక్షసి చాలా కాలము తర్వాత మంచి ఆహారము లభించిందని సంతోషించి తన బలముతో హనుమను లాగసాగెను . తాను అప్రయత్నముగా సముద్రమువైపు ఆకర్శించబడుట గమనించిన హనుమ అది సింహిక ప్రబావమని గమనించి తన శరీరమును పెంచెను సింహిక కూడా తన నోటిని పెంచెను . హనుమ ఎంతగా పెరిగితే సింహిక అంత పెద్దగా తన నోటిని తెరవసాగెను . అప్పుడు హనుమ చిన్నగా మారి దాని నోటిలోకి ప్రవేశించి తన వాడి గోళ్ళతో దానిని చీల్చి చంపి బయటకు వచ్చి మల్లి ఆకాశమువైపుగా పైకి ఎగిరి దక్షిణ దిక్కుగా ఎగరసాగెను . 

అది చూసి అక్కడే వున్నా సిద్దులు ,దేవతలు మంచి పని చేసావు అని హనుమని పొగిడిరి . 
అలా సముద్ర ము ను దాటిన హనుమ ఇంత పెద్ద ఆకారములో తనను రాక్షసులు చూసినచో తాను వేళ్ళు పనికి ఆటంకము కలగవచ్చునని భావించి ,తన ఆకారమును చిన్నగా చేసుకుని లంబాపర్వతముపై దిగెను . అలా దిగి మహాపర్వతము పై భాగమున వున్న  లంకను చూసేను . 

రామాయణము సుందరకాండ మొదటి సర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






రామాయణము కిష్కిందకాండ -అరవదియేడవసర్గ

                              రామాయణము 

                        కిష్కిందకాండ -అరవదియేడవసర్గ 

నూరుయోజనములు దూరము వున్న సముద్రమును లంఘించుటకు హనుమంతుడు సిద్దపడుతూ ,తన శరీరమును పెద్దగా పెంచెను . 

అలా పెద్దగా పెరిగిన హనుమంతుడిని చూసిన వానరులందరూ విచారమును వదిలి ,ధైర్యము తెచ్చుకుని సంతోషముతో జయజయద్వానములు చేసిరి . వారి జయజయ నాదములతో మరింత ఉత్సాహముగా శరీరమును పెంచిన హనుమంతుడు ని చూచుటకు వానరులందరూ తలలు ఎత్తవలసివచ్చినది . ఆ సమయములో వానరులు హనుమంతుడి మోకాలివరకు కూడాలేరు . 
అప్పుడు హనుమంతుడు వానరుల ఉత్సాహమును మరింత పెంచుతూ "ఓ వానరులారా !నేను అవలీలగా ఆకాశములో నక్షత్రములను దాటి వెళ్ళగలను . ఈ భూమండలమును చుట్టి రాగలను . కొండలను పిండి చేయగలను . సముద్రమును భూమిపై వేయగలను . "అని పలికెను . 
ఆ మాటలు విన్న జాంబవంతుడు "నాయనా !హనుమా !నీ పరాక్రమునకు తగినట్టు మాట్లాడావు . నీ మాటలతో మాలో బతుకు ఆశని పెంచావు . మా వనరులందరి ప్రాణములు నీ పైనే ఆధారపడి వున్నాయి . నీవు వచ్చేవరకు మేము ఎదురుచూస్తూ ఇక్కడే ఉంటాము "అని పలికెను . అప్పుడు మారుతి "నేను వెంటనే ఈ సముద్రమును లంఘించెదను . అయితే నా బలమును ఈ భూమి తట్టుకోలేదు . కావున నేను ఈ మహేంద్ర గిరిపై నుండి ఎగురుతాను . "అని పలికెను . 
అప్పుడు హనుమంతుడు గబగబా నడుస్తూ ,మహేంద్రగిరిని ఎక్కసాగెను . అలా ఎక్కేటప్పుడు అక్కడి రాళ్లన్ని కదిలిపోసాగెను . ఆ గిరిపై కల సమస్త ప్రాణులు ఆ అలికిడికి భయముతో పారిపో సాగెను . 

రామాయణము కికిష్కిందకాండ సమాప్తము . 

           శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 
























Tuesday 5 March 2019

రామాయణము కిష్కిందకాండ-అరువదిఆరవసర్గ

                                      రామాయణము 

                                       కిష్కిందకాండ-అరువదిఆరవసర్గ 

జాంబవంతుడు హనుమంతున్ని ప్రేరేపించుచు , "ఓ ఆంజనేయ నీవు వానరులందరిలోకల్లా సర్వ శ్రేష్ఠుడవు . సకల శాస్త్రములలోను ఆరితేరినవాడవు , పుంజికస్థల అనే అప్సరస  కపిశ్రేష్టుడైన కేసరికి భార్యగా జనించింది . ఆ ఉత్తమ దంపతులకు నీవు వాయు దేవుని వరమువల్ల జనించినావు . 

కేసరి బల పరాక్రమములు, అలాగే వాయు దేవుని యొక్క బల పరాక్రమములను , కలిగియున్నావు . నీవు చిన్ననాటి నుండే మహా వీరుడవు .

 నీ బాల్యములో ఒక నాడు నీవు సూర్యుని ఫలముగా భావించి దానిని ఆరగించుటకై సూర్యునివైపుగా ఎగరనారంభించావు . సూర్యుని దగ్గరదగ్గరకు  వెళ్లి నప్పటికీ కూడా సూర్య కిరణముల వేడి నీకు ఏమాత్రమును హాని కలిగించలేకపోయినది . 

సూర్య మండలం వైపుగా దూసుకు వస్తున్న నిన్ను చూసి ఇంద్రుడు కోపముతో తన వజ్రాయుధము ప్రయోగించెను . అపుడు నీవు భూమి మీద ఓ పర్వత శిఖరంపై పడిపోగా సుకుమారమైన నీ దవడలు  దెబ్బ తిన్నవి అప్పటి నుండి నీవు హనుమంతుడు అనే పేరుతొ ప్రసిద్ధికెక్కెను . 
అది చూసిన వాయుదేవుడు కోపముతో ముల్లోకాలు లోని గాలిని స్తంభింప జేసెను . అప్పుడు సకల దేవతలు వాయుదేవుని ప్రసన్నుడిని చేసుకొనిరి . అప్పుడు బ్రహ్మ దేవుడు ఏ  ఆయుధముచేత నీకు మరణము లేకుండా స్వచ్చంద మరణమును వరంగా ఇచ్చెను . నీవు తిరుగు లేని వీరుడవు . పరాక్రమమున నీకు నువ్వే సాటి . ఇది లోకకళ్యాణము కోసం చేయు కార్యము దీనికి నీవే సర్వ సమర్థుడవు .ఈ వానర వీరులందరి ప్రాణములు నీ చేతిలోనే ఉన్నవి . అని జాంబవంతుడు పలుకగా మారుతికి తన వేగము బల సామర్ధ్యములపై నమ్మకము కుదిరెను. వెంటనే హనుమంతుడు వానరులకు ఉత్సాహము పెంచుతూ తన అద్భుత రూపమును ప్రదర్శించెను . 

రామాయణము కిష్కిందకాండ అరువదిఆరవసర్గసమాప్తము . 

               శశి 

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


















Monday 4 March 2019

                                      రామాయణము 

                                      కిష్కిందకాండ-ఆరుబదిఐదవసర్గ 

అంగదుని మాటలు విన్న వానర వీరులు తమ తమ సామర్ద్యముల గురించి తెలుప సాగిరి . ఒక వీరుడు తాను  పది యోజనాల దూరము ఎగురగలనని మరొకవీరుడు ఇరువై యోజనాల దూరం ఎగురగలనని , ఇంకొక వీరుడు నేను ముప్పైయొజనాలాదూరం ఎగురగలనని తెల్పెను . ఇంతలో జాంబవంతుడు , తానూ తొంభైయోజనాల దూరం ఎగురగలనని కానీ ముసలివాడు అగునచో , ఇప్పుడు తమ సామర్ధ్యముపై అనుమానంగా వున్నదని పల్కెను అప్పుడు అంగదుడు తానూ వందయోజనాలాదూరం ఎగురగలనని కానీ తిరిగిరాగాలనోలేదోసందేహముగా ఉన్నదని  పలికెను . మరి ఈసముద్రమును దాట గల సమర్ధుడు ఎవరని వారిలోవారు తర్జన భర్జనలు పడసాగిరి . వీరందరూ ఈ విధముగా చేర్చించుకొనుచుండగా హనుమంతుడుమాత్రం . దూరముగా ఒంటరిగా కూరుకొనిఉండెను
తుదకు  జాంబవంతుడు , హనుమంతుడే  సముద్రమును దాటగల సమర్థుడని నిశ్చయానికి వచ్చెను . 

రామాయణము -కిష్కిందకాండ -అరుబదిఐదవ సర్గ సమాప్తం. 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ,(తెలుగు)తెలుగుపండితులు . 

రామాయణము కిష్కిందకాండ - అరువదినాలుగవసర్గ

                                               రామాయణము 

                                              కిష్కిందకాండ - అరువదినాలుగవసర్గ 

సంపాతి మాటలు విన్న వానరులు సంతోషముతో కేరింతలు కొట్టిరి సీతాదేవిని దర్శించుటకై ఉబలాట పడిరి . వారందరు లంకా నగరము చేరుటకై సముద్ర తీరమునకు చేరిరి.  ఆ సముద్రము పెద్దపెద్ద అలలతో భయంకరముగా ఉండెను 


ఆ సముద్రమును చూసిన వెంటనే వానరుల ఉత్సాహము నీరు కారి పోయింది . సముద్రమును దాటుట  ఎట్లు ?అని , ఈ సముద్రమును దాటగల సమర్ధుడు ఎవరు? అని , వారిలోవారు చర్చించుకోసాగిరి . ఇంతలో చీకటి పడుటచే వారంతా ఒక ప్రదేశములో విశ్రమించిరి . అంగదుడి చుట్టూ వానరులంతా చేరిరి . అంగదుడు వానరులందరిని ఉద్దేసించి , "ఓ వానరులారా మీరందరూ మహా వీరులు సింహబలులు. ఎవడైనను , ఎక్కడైనను , మీ గమనమును అడ్డుకొనువాడు లేడు . కావున బాగుగా ఆలోచించి ఈ మహా సముద్రమును దాటగలవాడు ఎవడైనా ఉంటె ఎడారికి రండి . సముద్రమును డాటా గలిగిన వారివలన మనమందరము తిరిగి కిష్కిందలోని మన కుటుంబములను కలుసుకొనువచ్చును . 

రామాయణము - కిష్కిందకాండ -అరువది నాలుగవసర్గ సమాప్తము . 

శశి , 

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు), తెలుగుపండితులు . 











రామాయణము కిష్కిందకాండ-అరువదిమూడవసర్గ

                                            రామాయణము 

                                             కిష్కిందకాండ-అరువదిమూడవసర్గ 

ఈ విధముగా సంపాతి వానర వీరులతో పలుకుతుండగానే, అందరు చూస్తుండ  గానే సంపాతికి రెక్కలు మొలుచుకొచ్చేను అప్పుడు సంపాతి వానర వీరులతో "మిత్రులారా సూర్య కిరణముల వేడికి కాలి  పోయిన నా రెక్కలు మళ్ళీ తిరిగివచ్చాయి.  ముసలి వాడినైనా నాకు యువకునికి ఉండేటంత బలము శక్తీ లభించాయి . సీతాదేవి జాడ లభించుననుటకు ఇదే ప్రభల నిదర్శనం.  గట్టి పూనికతో ప్రయత్నం చేయండి" . అని పలికెను . ఆ విధముగా పలికిన తరువాత  సంపాతి తన రెక్కల బలము తెలుసుకోవాలని   ఆకాశములోకి  ఎగిరెను . 

అప్పుడు వానర వీరులందరు పరమ సంతోషముతో పొంగిపోయిరి. నూతన ఉత్సాహముతో  సీతాన్వేషణకు ఉన్ముఖులైరి . 

రామాయణము-కిష్కిందకాండ - అరువదిమూడవ సర్గ 

శశి , 

ఎం.ఏ,ఎం.ఏ , (తెలుగు),తెలుగుపండితులు . 

రామాయణము కిష్కిందకాండ-అరువదిరెండవసర్గము

                                           రామాయణము 

                                            కిష్కిందకాండ-అరువదిరెండవసర్గము

ఆ మునివరునితో ఆ విధముగా చెప్పి , ఏడ్చితిని.  అప్పుడు మునీశ్వరుడు క్షణకాలం జ్ఞ్యాన నిమగ్నులై ఇలా పలికెను" ఓ సంపాతి  బాధపడకు , నీరెక్కలు మళ్ళీ వచ్చును. నీ బలపరాక్రమములు మళ్ళీ పుంజుకొనును కొంత కాలము తర్వాత దశరధుడు అను ,మహారాజు పుత్రుడు రాముడు అయన భార్య తమ్ములతో కలిసి తండ్రి ఆజ్ఞ ప్రకారము వనవాసము చేయును . ఆ సమయములో దేవతలకు సైతం ఎదిరింప శక్యము కానీ రావణుడు అను రాక్షసుడు ఆ పతివ్రతను అపహరించి తన రాజ్య భోగభాగ్యములు ఆశగా చూపును . కానీ ఆ సాద్వి వాటన్నిటిని తిరస్కరించి  శ్రీ రాముని తలుచుకుంటూ  బిక్కుబిక్కు మంటూ కాలంగడుపును. ఆ దేవి రావణుడి భావనమునుండి వచ్చిన  ఏఒక్క ఆహారమును ముట్టదు. అది తెలిసిన ఇంద్రుడు దివ్య పాయసమును ఆమెకు రోజు ఇచ్చును . రోజూ ఆమె ఆ పాయసమును తినుటకు ముందు ఒక ముద్ద శ్రీ రాముని ఉద్దేశించి  నేలపై ఉంచును.  
శ్రీ రాముని దూతలైన వానరులు సీతా దేవిని వెతుకుచూ  నీ వద్దకు వస్తారు . అప్పుడు నీవు ఆ సాధ్వి గురించి వారికి తెలియ పరుచు . అప్పటి వరుకు నీవు ఇక్కడి నుండి కదులుటకు వీలులేదు ఆవిధంగా నీవు ఆ మహా సాధ్వి గురించి సమాచారం అందించుట వలన వారికే కాక  బ్రాహ్మణులకు ఇంద్రాది దేవతలకు మునీశ్వరులు మంచిజరుగును. నేను ఆ అన్నదమ్ములను చూడాలని కుతూహల పడుతున్నాను. కానీ అంత సమయము నేను ప్రాణములతో ఉండను." అని ముని నాతో పలికెను . "అని సంపాతి వానరులతో చెప్పెను . 

రామాయణము - కిష్కింద కాండ-అరువదిరెండవసర్గ . 

               శశి , 

  ఎం.ఏ ,ఎం.ఏ (తెలుగు), తెలుగుపండితులు . 

రామాయణము కిష్కిందకాండ - అరువదిఒకటవ సర్గ

                                           రామాయణము 


                               కిష్కిందకాండ - అరువదిఒకటవ సర్గ 

నిశాకర మహర్షి అలా అడిగినప్పుడు నేను ఆ మహర్షితో "మహాత్మా !నేనూ  నా తమ్ముడు పైపైకి ఎగురుతూ మిక్కిలి పైకి చేరుకున్నాము . సూర్యమండలం దగ్గరదగ్గరకు చేరుకున్నాము . ఆ వేడిని తట్టుకోలేక నా తమ్ముడు జటాయువు ,కిందపడిపోనారంభించెను . అప్పుడు నేను నా తమ్ముడికి అడ్డముగా నా రెక్కలను పెట్టితిని . అప్పుడు నా రెక్కలు ఇంకా కొన్ని అవయవములు కాలిపోయినవి . అప్పుడు నా తమ్ముడు కిందకు పడిపోయెను . కొంతసేపటికి నేను కింద పడిపోయాను . నేను అనుకున్న ప్రకారము నా తమ్ముడు దండకారణ్యములో పడివుంటాడు . నేను వింధ్య పర్వతముపై పడిపోయాను . రాజ్యము కోల్పోయాను ,తమ్ముడు దూరమయ్యాడు ,రెక్కలు కాలిపోయెను , పరాక్రమము నశించెను . ఈ గిరిశిఖమునుండి క్రింబడి చచ్చిపోవుటయే  మేలని అనుక్షణము ఆలోచించుచుంటిని. 

రామాయణము-కిష్కిందకాండ -అరువది ఒకటవసర్గము . 

           శశి ,

ఎం.ఏ ,ఎం.ఏ,(తెలుగు),తెలుగుపండితులు . 


                                   రామాయణము 

                         

                                         కిష్కిందకాండ -అరువదియవసర్గ 

తన తమ్ముడికి జల తర్పణములు వదిలిన పిమ్మట , సంపాతి వానరుల సహాయముతో పర్వతముపైన కూర్చుండెను ఆలా కూర్చున్న సంపాతి చుట్టూ వానరులు కూర్చుని ఉండిరి . అప్పుడు సంపాతి తిరిగి వానరులతో ఇలా చెప్పసాగెనును  "ఓ వానరులారా నేను నా తమ్ముడు పోటీపడి పైకి ఎగిరినప్పుడు సూర్య రశ్మికి నా రెక్కలు శరీరములోని కొన్ని భాగములు కాలిపోయి నేను నెల మీద పడిపోయాను.  ఆలా పడిన ఆరురోజుల తరువాత కళ్ళు తెరిచి చూసాను. ఇదువరుకే ఈ భూమండలమంతా తిరిగి ఉండుట చే ఈ ప్రాంతమును గుర్తుపట్టగలిగాను . ఈ ప్రాంతములో నిసాకారుడు అనే ముని ఒక ఆశ్రమమును ఏర్పరుచుకొని నివసించుచున్నారు ఆయన గొప్ప మహిమాన్వితుడు . ఆయన ఆశ్రమమునకు నేను ఎలాగోలా దేకుతూ వెళ్లాను ఇంతకుముందు నేను మా తమ్ముడు ఆయన ఆశ్రమముకు వెళ్లియున్నాము ఆ ముని నన్ను చూసి "ఏమిజరిగినది నీకు రెక్కలు ఎందుకు లేవు , నీ జుట్టు ఎందుకు అలా ఉన్నది , నీకు వచ్చిన రోగమేమి అని ప్రశ్నించెను . 

Sunday 3 March 2019

రామాయణము కిష్కిందకాండ-ఏబదితొమ్మిదవ సర్గ

                                  రామాయణము 

                                  కిష్కిందకాండ-ఏబదితొమ్మిదవ సర్గ 

గ్రద్ద రాజైన సంపాతి నుడివిన అమృతతుల్యములగు వచనములు విన్న పిమ్మట ఆ వానరులందరును పరమానందభరితులైరి . వానర శ్రేష్ఠుడైన జాంబవంతుడు తోడి వానరులందరితో గూడి వెంటనే లేచి , నేలపై నిలబడెను . పిమ్మట అతడు సంపాతి ఇటలీ ప్రశ్నించెను . "ఇంతకును సీతాదేవి లంకనందు ఎక్కడ ఉన్నది ఆమెను చూచినవారెవరు ? ఆమెను ఎవరు అపహరించిరో నీకు ఎవరు చెప్పారు ?. 
అప్పుడు సంపాతి ఇట్లనెను "నేను  వృద్ధుడనై ఉన్నందున , నా ప్రాణశక్తియు బలపరాక్రమములు క్షీణించినవి , ఇట్టి స్థితిలో ఉన్న నన్ను నా కుమారుడైన సుపార్ఫ్యూడు ఆహారాదులను సమకూర్చి నన్ను పోషించుచున్నాడు. 
ఒకానొక నాడు ఆకలితో నాకనకలాడుచుంటిని . నాకు ఆహారము తీసుకొని వచ్చుటకై నా కుమారుడు బయటకు వెళ్లెను . మాంసము దొరకక పోవుటచే అతడు సూర్యుడు అస్తమించిన పిమ్మట రిక్త హస్తములతో తిరిగి వచ్చెను. అది చూచి మిక్కిలి ఆవాసముతో నేను నా కుమారుని తీవ్రముగా మందలించితిని. తిండి లేక భాదపడుచున్న నన్ను ఓదార్చి  ఇట్లు చెప్పదొండగెను "తండ్రీ !నేను ఎప్పటివలె ఆహారము సంపాదించుకొని వచ్ఛుటకై ఆకాశమునకు ఎగిరితిని . అంట మహేంద్రగిరి ద్వారము కడకు చేరి అచట నిలబడితిని . ఆ సమయమున చేదింపబడిన కాటుక కొండవలె నల్లగా నున్న ఒక దుష్టుడు ఒక స్త్రీ ని తీసుకొని పోవుచుండుట నేను చూచితిని . 
ఆ స్థితిలో ఉన్న నేను వారిద్దరిని నీకు ఆహారముగా తీసుకువచుటకు నిశ్చయించితిని . కానీ పురుషుడు సవినయముగా దారి ఇమ్ము అని నన్ను మృదువు గా అడిగెను నీచుడు సైతము తనను సవినయముగా సమీపించిన  వానిని హింసించడు . ఇక నా విషయమున చెప్పవలిసిన పని లేదు . ఆ తరువాతనే అక్కడి మునులచే నాకు తెలిసినది అతడు రావణాసురుడిని , ఆ స్త్రీ సీతాదేవి అని , శ్రీరాముని ధర్మ పత్ని అని , ఆమెను అతడు అపహరించుకు పోతున్నాడనియు నేను తెలుసుకొంటిని ఆమె రామలక్ష్మణులను  స్మరించుచుండెను "అని పలికెను . ఆ విషయము విన్నప్పటికీ , ఆదుష్టుడి పై విజృంభించాలనే ఆలోచన నాకు రాలేదు . ఏల ననగ  నేను రెక్కలు తెగిన పక్షిని , అనిపలికెను . 

రామాయణము -కిష్కిందకాండ - ఏబదితొమ్మిదవసర్గ . 

     శశి,

ఎం.ఏ,ఎం.ఏ,(తెలుగు),తెలుగుపండితులు . 








రామాయణము కిష్కిందకాండ -ఏబదియెనిమిదవసర్గ

                               రామాయణము 

                           కిష్కిందకాండ -ఏబదియెనిమిదవసర్గ 


వానరుల మాటలు విన్న సంపాతి , కన్నీరు పెడుతూ వనరులతో" ఓ వానరులారా మీరు తెలిపిన జటాయువు నాతమ్ముడు పూర్వము వృత్తాసురుడు వద్ద అనంతరం నేను నా తమ్ముడు పోటీపడి పైపైకి ఎగరనారంభించెను నేను మిక్కిలి పైకి ఎగురట చే , సూర్యకాంతి వేడికి నారెక్కలు తెగి ఇచ్చట పడిపోతిని అప్పటినుండి నా తమ్ముడు గురించిన ఈ వివరములు నాకు తెలియనేలేవు "అని పలికెను. 
ఆ మాటలు విన్న అంగదుడు "ఓ పక్షి రాజా , నీకు తెలిసిన చొ  రావణుడి స్థావరం , దయ తో తెలుపుము , అని పలికెను" . అప్పుడు సంపాతి"ఓ వానరులారా  నేను రెక్కలు కాలిన  పక్షినిఐనా శ్రీ రామునికి చేతనైనంత సహాయం చేస్తాను . నేను అతలవితలాది , అదో ఊర్ధ్వ ఏడేడు పదునాలుగు లోకములను బాగుగా ఎరుగుదును . దేవాసురుల సంగ్రామము , క్షీరసాగర మధనము , నాకు తెలుసును . చక్కని రూపము కలిగిన ఒక స్త్రీ ని  రావణుడు అపహరించి పోవుచుండగా నేను చూసితిని ఆమె బిగ్గరగా రామా లక్స్మనా , అని అరుచుచుండెను ఆమె శరీరమంతా వణికిపోవుచున్నది బహుశా ఆమె సీతాదేవి అయిఉండవచ్చూ  ఓ వనరులారా , ఆ రాక్షసుని పేరు రావణుడు అతడు విశ్ర వాసుని ఔరస పుత్రుడు కుభేరుని సోదరుడు లాకా నగరం అతని నివాసము , ఇక్కడికి వంద యోజనముల దూరమున సముద్ర మధ్యముగా ఒక ద్వీపము కలదు . విశ్వకర్మ లంకా నగరమును నిర్మించెను సీతాదేవి ఆ లంక యందును , రావణుని అంతఃపురము నందు బంధింపబడి ఉన్నది . రాక్షస స్త్రీ లు ఆమెకు  కాపలా కాయుచున్నారు. ఓ వానరులారా వెంటనే మీ పరాక్రమమును చూపుచూ సముద్రమును లంఘించుటకు త్వరపడుదు మీరు అక్కడ అవశ్యము సీతాదేవిని దర్శించి క్షేమముగా తిరిగిరాగలరు . నా దివ్యదదృష్టి తో చూచి పలుకుచున్న మాటలివి . మిగిలిన పక్షుల కంటే మా జాతి పక్షులు వందయోజనములు , లేదా అంతకంటే దూరము ఎగురగలము . 
"నేను ఆవైనతేయని వంశము వాడిని గనుక ఇక్కడ నుండియే రావణుని , జానకిని స్పష్టముగా చూడగలను మాకును గరుడుని వలే శక్తియు , దివ్యదృష్టి గలదు . నా యెడల దయుంచి నన్ను వరుణునకు నిలయమైన సముద్రతీరమునకు చేరుటకై సహాయపడుటకు మిమ్ము అర్ధించుచున్నాను . అక్కడ నా తమ్ముడగు జటాయువునకు తర్పణములు సమర్పితును. "
అనంతరము మిగుల బలశాలులైన ఆ వానరులు రెక్కలు మాడిపోయిన సంపాతిని  తీరా ప్రదేశమునకు చేర్చిరి 
సంపాతి తన సోదరునికి తర్పణములు అర్పించెను . పిమ్మట వానరులు అతనిని మరల యథాస్థానమునకు చేర్చిరి 
అతని ద్వారా సీతాదేవి సమాచారం తెలుసుకున్నందుకు ఎంతయు సంతోషపడిరి . 

రామాయణము - కిష్కింద కాండ - ఏబదియెనిమిదవ సరిగా సమాప్తం . 

      శశి,

ఎం.ఏ ఎం.ఏ,(తెలుగు ),తెలుగుపండితులు. 

రామాయణము కిష్కిందకాండ -ఏబదియేడవసర్గ

                                         రామాయణము 

                                          కిష్కిందకాండ -ఏబదియేడవసర్గ 

సంపాతి ఆ విధముగా మాట్లాడినప్పటికీ , వానర వీరులకు ఆ గ్రద్ద పై నమ్మకము కుదరలేదు అది తమను భక్షించుతాహీ వచ్చినదని వారు నమ్మిరి ఎలాగో చనిపోవుటకు సిద్దపడ్డాము ఆ చావు ఈ గ్రద్ద రూపములో వఛ్చినదని భావిద్దాము అని వారు సమాధానపడి ఆ గ్రద్దను పర్వతముపైనుండి క్రిందకు దించిరి . అప్పుడు అంగదుడు సంపాతితో సీతారామ లక్ష్మణుల వనవాసము సీతాపహరణము జటాయువు మరణము, జటాయువుకు శ్రీ రాముడు అగ్ని సంస్కారములు చేయటం సుగ్రీవ శ్రీ రాముల మైత్రి వాలి వద సీతాన్వేషణకై సుగ్రీవుని ఆజ్ఞ కార్యము సాధించ లేకపోవుటచె వానరుల ప్రాయోపవేశము మొదలగు వృత్తాన్తములుఅన్నియు సవివరముగా చెప్పెను . 
రామాయణము -కిష్కిందకాండ -ఏబదిఒకటవ సర్గము సమాప్తం . 

శశి 

ఎం.ఏ ఎం.ఏ (తెలుగు),తెలుగు పండితులు . 

                                            రామాయణము 

                                 కిష్కిందకాండ-ఏబదిఆరవసర్గ       

ఆ వానర వీరులందరు కూర్చునివున్న ప్రదేశమునకు సంపాతి అను పేరుగల ఒక గ్రద్దరాజు వచ్చెను . వారందరిని చూసి ," ఆహా  దైవానుగ్రహమువల్ల నాకీరోజు మంచిఆహారము లభించినది . అని అనుకొనెను , ఆ మాటలు విన్న అంగదుడు హనుమంతునితో . "ఓ మారుతి ప్రాయోపవేశమునకు కూర్చున్న మనకు చావు తెచ్చుటకు ఆ సూర్య భక్తుడైన యముడే ఈ వేషమున వఛ్చినట్లున్నాడు  గ్రద్దరాజైన జటాయువు సీతారాదేవిని అడ్డుకొనుటకు చేసిన సహస  కార్యమును  మనము వినే  ఉన్నాము . ఆ జటాయువు శ్రీరామునికి పరమ ఆప్తుడు ఆ జటాయువే మిక్కిలి అదృష్టవంతుడు . అతనికి మనవలె సుగ్రీవుని బాధ లేకుండాపోయినది . దశరధ మహా రాజు స్వర్గస్తుడగుట జటాయువు మరణించుట సీతాపహరణం మొదలైన సంఘటనలన్ని యావత్ వానర జాతి జీవనమునకు ముప్పు తెచ్చ్చిపెట్టాయి అని పలికెను. 

ఆ మాటలు విన్న సంపాతి "ఓ వానర వీరులారా మీరంతా ఎవరు  దండకారణ్యమున నివసించుచున్న నా తమ్ముడైన జటాయువు పేరుని చాలా కాలం తర్వాత మీ నోటివెంట విన్నాను అసలు జటాయువు వధ  ఎలా జరిగింది పరమ ధార్మికుడు పురుషోత్తముడు దశరధుని పుత్రుడు ఐన శ్రీ రామునితో జటాయువునకు స్నేహం ఎలా కుదిరెను దయ చేసి నాకు తెలపండి ఓ వీరులారా నన్ను ఈ పర్వతమునుండి మీ వద్దకు కిందకు దించండి సూర్య రసామికి నా రెక్కలు కాలి  పోయిన కారణమున  నేను ఎగరలేను అని పలికెను .  

 రామాయణం-కిష్కిందకాండ -ఏబదిఆరవసర్గ 

       శశి ,

ఎం.ఏ ఎం.ఏ ,(తెలుగు),తెలుగుపండితులు . 

రామాయణము కిష్కిందకాండ -ఏబదియైదవసర్గ

                                రామాయణము 

                            కిష్కిందకాండ -ఏబదియైదవసర్గ 

హనుమంతుడి మాటలు విన్న తర్వాత కూడా ధైర్యము రాని అంగదుడు "ఓ వీరా !ఏది న్యాయము ?సుగ్రీవుడు మా తండ్రి బతికి ఉండగానే అతడి సామ్రాజ్యమును ఆక్రమించెను . మా తండ్రి బయటకు రాకుండా గుహకు అడ్డుపెట్టేను . తనకు రాజ్యము అప్పగించిన శ్రీరాముని కార్యము కూడా మరచిపోయెను . లక్ష్మణుని కోపమునకు బయపడి మనల్ని ఈ కార్యమునకు నియమించెను . అతడు నన్ను యువరాజుగా ప్రకటించలేదు . ధర్మప్రభువైన ఆ రాముడే నన్ను యువరాజుగా నియమించెను . ఇక కార్యము పూర్తి కాలేదని తెలిసినచో సుగ్రీవుడు నన్ను ప్రాణములతో విడుచుట కల్ల . కావున నేను కిష్కింధకు రాను "అని దర్భాసనము వేసుకుని నిరాహార దీక్షద్వారా ప్రాయోపవేశమునకు కూర్చుండెను . అది చూసిన వానరులు తాము సైతము నిరాహార దీక్షకు కూర్చుండిరి . అలా కూర్చుండిన వారు శ్రీరాముని అరణ్యవాసము ,సీతాపహరణము ,సుగ్రీవుడితో మైత్రి ,వాలి వధ ,లక్ష్మణుని కోపము మొదలగు విషయములు చర్చించుకొనిరి . వాటి కోలాహలం మిన్ను ముట్టెను . 
రామాయణము కిష్కిందకాండ ఏబదియైదవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


రామాయణము కిష్కిందకాండ - ఏబదినాలుగవసర్గ

                                           రామాయణము 

                                            కిష్కిందకాండ - ఏబదినాలుగవసర్గ 

అప్పుడు హనుమంతుడు ఇదంతా గమనించి , అంగదునితో "ఓ అంగదా !నీవు మహా పరాక్రమ శాలి అయిన వాలి పుత్రుడవు పైపెచ్చు గొప్ప వీరుడవు , నీవు పిరికి వాడి లాగా ఇలా మాట్లాడడం తగదు ఒక వేళ నీవు ఆ గుహలోకి వెళ్లి తలదాచుకున్నా ఈ చాపలచిత్తులైన వానరులు నీ తోనే ఉంటారని నమ్మకు వారు ఆకలిదప్పికలతోను , భార్యాబిడ్డల బెంగ తోను , ఉండిరి . నీవు వంటరివైపోతావు . నేను నాలాంటి ఇంకా , సుగ్రీవుడి శ్రేయోభిలాషులు మిత్రులు ఐన వానరవీరులు నీతో రారు . ఆ విధముగా నీవు ఇక్కడ ఉన్న విషయము సుగ్రీవునికి తప్పక తెలియును . లక్ష్మణుడి  బాణములు ఇంద్రుని వజ్రాయుధములకన్నా బయంకరమైనవి . వాటి నుండి తప్పించుకొనుట అసాధ్యము . 
మన కు అప్పగించిన సీతాన్వేషణను పూర్తి చేసే మనము తిరిగి వెల్దాము . సుగ్రీవుడు మనకు ఏ దండన విధించడు . పైపెచ్చు అతడు నీకు పినతండ్రి కూడా కదా . కావున నీవు భయపడవలసిన అవసరము లేదు . నీ తల్లి తార నిన్ను ప్రాణముగా చూసుకొనుచున్నది . ఆమెకు నీవు తప్ప వేరొక సంతానము లేదు . కావున మనము ఉత్సాహమును వీడక కార్యము సఫలము చేసుకొని వెళ్ళుట ఉత్తమము "అని పలికెను . 

రామాయణము కిష్కిందకాండ ఏబదినాలుగవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము కిష్కిందకాండ -ఏబదిమూడవసర్గ

                                     రామాయణము 

                                     కిష్కిందకాండ -ఏబదిమూడవసర్గ 

ఆ తపస్వి మాటలు విని హనుమంతుడు "మాతా  మేమందరం , నిన్ను శరణువేడుచున్నాము వానరరాజైన సుగ్రీవుడు సీతాన్వేషణకు మాకు ఒక నెలరోజుల గడువు మాత్రమే విదించెను ఈ గుహలో ఉండగానే , ఆ గడువు పూర్తి అయ్యింది.  కనుక మా మీద దయ ఉంచి ఈ గుహ నుండి బయటపడే  మార్గము తెలిపి పుణ్యం కట్టుకొనుము . అని బ్రతిమలాడెను . "అప్పుడు ఆ మహా సాత్వి "ఓ వనరులారా ఈ గుహలోకి ప్రవేశించిన వారు బయటపడుట అసాధ్యము కానీ నేను మిమ్ములను బయటకు చేర్చెదను .  అని పలికి వారందరిని బయటకు చేర్చి , ఓ వానరులారా క్షేమముగా వెళ్ళిరండి "అనిపలికెను . 
ఆ భయంకర గుహనుండి బయట పడిన వానరులు , ఒక మహా సముద్రము ఒడ్డుకు చేరిరి . ఆ సముద్రము పెద్ద పెద్ద అలలతో భయంకరంగా ఉండిని



. అప్పుడు యువరాజైన అంగదుడు 

" ఓ  వానర వీరులారా !సుగ్రీవుడు విధించిన గడువు పూర్తిఅయిపోయింది ఆయన ఆజ్ఞను మీరినమనకు చావు తప్పదు అక్కడికి వెళ్లి చచ్చుటకంటె ఇక్కడే ప్రాయోపవేశము చేయుట ఉత్తమము . కనుక నేను ఈ సముద్ర తీరమునందే ప్రాయోపవేశము చేయుదును అని పలికెను ". 

అప్పుడు తారుడు అను వానరవీరుడు "మనము మరణించుటకంటె ఆ బిలముతో ఫల కంద మూలాదులను , తింటూ హాయిగా జీవించుట ఉత్తమము అక్కడ మనకు దేవేంద్రుడి వలన కూడా అపాయము సంభవించదు" అని పలికెను . ఆ పలుకులకు , అంగదుడు సైతము అంగీకరించినట్లు అనిపించెను . 

రామాయణము - కిష్కిందకాండ _ఏబదిమూడవసర్గ . 

         శశి , 

ఎం.ఏ,ఎం. ఏ ,(తెలుగు),తెలుగు పండితులు . 


                                      రామాయణము 

                                    కిష్కిందకాండ - ఏబదియవసర్గము 

వానరప్రముఖుడైన హనుమంతుడు  తారునితో,అంగదునితో గూడి, వింధ్యపర్వతములందలి గుహలను దట్టమైన అడవులను, గాలించెను. ఇంకను ఆ మహాత్ముడు సింహములు , పెద్ద పులులు సంచరించేతి గుట్టలను , గుబురులను నాదీ తీరములును ఆ వింధ్యకు సంబంధించిన ఎగుడు దిగుడు నేలలు పెద్దపెద్ద సెలయేళ్ళు గల ప్రదేశములను అన్వేషించెను. ఆ ప్రదేశమున వారు సమైక్య భావముతో ఒకరిపైఒకరు తూడుగా ప్రక్కప్రక్కనే నడుచుచుండగా మారుతి ఆ పర్వతమును పూర్తిగా గాలించెను . 
గజుడు , గవాక్షుడు, గవయుడు, శరభుడు , గంధమాదనుడు , మైందుడు మొదలగువారు మున్నగు వానరుల యాదక్షిణ దిశయందు కొండలతోనిండిన ఆయా ప్రదేశములను వెదుకుచూ ఉండగా అక్కడ వారికి తెరువబడియున్న ఒక బిలాము కనబడెను. ఆ దుర్గము పేరు" బుక్షబిలము "అది ఒక దానవుని ఆధీనములో గలదు అక్కడకు చేరిన హనుమదాదులు మిక్కిలి అలసిపోయిరి. ఆకలిదిప్పలకు లోనై యుండిరి. కనీసము దాహముతీర్పుకొనుటకై  మంచినీరైనను దొరికిన బాగుండునని తపనపడుచుండిరి. బాగుగా పరికించి చూచినా పిమ్మట  "ఆ మహా బిలము లతావృక్షములతో కప్పబడియున్నట్లు వారు గమనించిరి. ఆ గుహ లోపలినుండి క్రౌంచపక్షులు , హంసలు , బెగ్గురపక్షులు, చక్రవాకములు బయటకివచ్చుచుండెను ఆ పక్షులు నీటితో తడిసియుండెను పద్మముల రేణువులు అంటుకొని యుండుటచే అవి ఎర్రగా కనబడుచుండెను. 
పిమ్మట ఆ వానరోత్తములు బిలము  కడకు చేరిరి. ఆ బిలమునుండి సువాసనలు వచ్చుచుండెను వారికి అందు ప్రవేశించుట అసాధ్యముగా తోచిరి. ఆస్తితిని జూచి వారు ఆశ్చర్యచకితులైరి . ఆ వానర ప్రముఖులు అచటకు చేరిన పిమ్మట దానిని బాగుగా పరికించిచూచిరి . అప్పుడు వారికి ఇది పాతాళ గుహాయ?, లేక రావణుని మాయా మందిరమా ?, అను శంకలు కలిగెను పక్షులు తడసియుండుట బట్టి వాటి రాకపోకలను అనుసరించి అందు జలములుండెనని  ఊహించిరి అచటి ప్రతికూల పరిస్థితికి వారు వారు యెంతయు నీరసపడిరి 
ఎట్టి దుర్గమారణ్యములయందైనను  సంచరించుటలో నిపుణుడు , ఐన మారుతి ఆ వనరులందరితో ఇట్లు అనెను . "ఈ బిలము నుండి హంసలు బయటకు వచ్చినవి  పైగా ఈ బిలద్వారమునొద్దగల వృక్షములుఅన్నియు  పచ్చని ఆకులతో కలకాలాడుచున్నవి కావున ఇచట చక్కని జలమూలేహి నిండిన భావి గాని మడుగు గాని తప్పుగా ఉండితీరును " ఆ వానరోత్తములు వేగముతో పూర్తిగా ఆగుహ లోపలి చేరిరి ఆ ప్రదేశమంతయు వెలుతురుతో నిండియుండెను. అది మిగుల మనోహరముగా ఉండెను. 
దప్పిగొని యుండుట వలన వారిలో చురుకు దానము తగ్గియుండెను అయినాను దాహము తీర్చుకొనుటకై తహతహలాడుచు అలసత్వమునకు తావీయక కొంత తడువు వేగముగా ముందుకు సాగిరి ఆ వానర వీరులు మిక్కిలి అలసిపోయి ఆకలి దప్పులచే కృశించియుండిరి. వారు తమ జీవితములపై ఆశ వదులుకుని దీనవధానులై యుండిరి అట్టి స్థితిలో వారికి ఒక వెలుగు కనబడెను. వారు ఆ ప్రదేశమునకు రాగానే వారికి ప్రత్యేకమైన ఒక వనము కనపడెను. అది వెలుతురుతో నిండి యుండెను అందలి వృక్షములు అగ్నిజ్వాలలవలె వెలుగొందుచు బంగారు కాంతులీనుచుండెను అచటయెర్రని చిగురుటాకులు అల్లుకొని ఉన్న లతలు అచటి చెట్లకు ఆభరణములుగా విలసిల్లుచుండెను అవి ఉదయ సూర్య కాంతులతో మెరయచుండెను. వాటి వేదికలపై వైడూర్యములను పొడగబడిన భవనములు  యుండెను. 

ఆవృక్షముల కాండములు రాజతకాంతులతో తళతళ లాడుచుండెను. అక్కడి సరస్సులు నీల వైడూర్యములతో విలసిల్లుచు పలువిధములుగా పక్షులు నిలయములై యుండెను బాలభానుని కాంతులతో చక్కని కేసరళములతో ఒప్పుచున్న  అచటి పద్మములు మనో జ్ఞముగా యుండెను  ఆ సరస్సులయందలి నిర్మల జలములతో అట్టి అందమైన సరస్సులు ఆవాసరా ప్రముఖులు బాగుగా తిలకించిరి. 
మిగుల బలశాలులైన ఆవానరులు ఆ గుహ యందు పలుప్రదేశములు వెదకినా పిమ్మట సమీపమున యున్న ఒక స్త్రీని చూచిరి ఆమె కృష్ణ జనమును వస్త్రముగా ధరించి యుండెను ఆహార నియమములను పాటించుచుండుటయే ఆ సాత్వి తేజోరాశిగా విలసిల్లుచుండెను ఆ దివ్య స్త్రీని చూచి ఆ వానరులు  సంబ్రమాశ్చర్యములకు లోనై దూరముననే యుండిపోతిరి అప్పుడు హనుమంతుడు అమ్మా నీవు ఎవరావు ఈ గుహ ఎవరిదీ అని ఆమెను అడిగెను . 
పర్వతాకారుడైన హనుమంతుడు అంజలి ఘటించి వృద్ధురాలైన ఆ తాప్సికి ప్రణమిల్లి ఇట్లు అర్ధించెను "మాట, ఎవరమ్మా నీవు,?ఈ భవనము , గుహలు,బంగారురత్నరాసులు,ఎవరివి? దయతో తెల్పుము . 

రామాయణము-కిష్కింద కాండ-ఏబదియెవసర్గము సమాప్తం . 

                      శశి 

             ఎం.ఏ , ఎం.ఏ (తెలుగు),తెలుగు పండితులు . 

Saturday 2 March 2019

రామాయణము కిష్కింద కాండ -నలుబదితొమ్మిదవసర్గ

                                     రామాయణము 

                                  కిష్కింద కాండ -నలుబదితొమ్మిదవసర్గ 

ఆ విధముగా దీనులై కూర్చున్న వానరులతో అంగదుడు దీనత్వము తగదని ఉత్సాహము కార్యసాధకుల లక్షణమని పలు రకముల ప్రత్సాహపూరితములైన మాటలు చెప్పి ఉత్సాహపరిచేను . ఉత్సాహము తెచ్చుకున్న వానరులు తిరిగి ఆ ప్రదేశమంతా అణువణువూ గాలించిరి . అక్క్కడ వున్న గుహలను గాలించి ముందుకు సాగిరి . 

రామాయణము కిష్కిందకాండ నలుబది తొమ్మిదవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము కిష్కింద కాండ -నలుబదియేడవసర్గ

                               రామాయణము

                               కిష్కింద కాండ -నలుబదియెనిమిదవసర్గ 

తారుడు ,అంగదుడు  మొదలగు వానర వీరులతో కలిసి దక్షిణ దిక్కుకు వెళ్లిన హనుమంతుడు సుగ్రీవుడు చెప్పిన ప్రాంతములన్ని వెతుకుతూ వింధ్యకు చేరెను అక్కడ సీతామాత జాడ కోరకై వెతికేను . వింధ్య పరిసర ప్రాంతములో కల ఒక ప్రదేశములో చొరరాణి గుహాలతో కీకారణ్యములతో నిండి ఉండును . అక్కడ ప్రాణులేవి వుండవు . అక్కడ నీరు కూడా ;లభించదు . అలంటి భయంకర ప్రదేశములలో వారు పెక్కు శ్రమనోర్చి అన్వేషించిరి . పిమ్మట వారు మరొక దుర్గమ ప్రదేశములో ప్రవేశించిరి . అక్కడ అంటా సూన్యము కనీసము చెట్లు కూడా వుండవు . అక్కడ ఏ ప్రాణి ఉండదు ,నీరు దొరకదు . ఒకానొకప్పుడు 'కండుడు 'అనే మహా ముని అక్కడ వుండేవాడు . అతడి 16 సంవత్సరాల కుమారుడు అక్కడ చనిపోయినాడు . దాంతో ఆముని ఆ వనముని ప్రాణి రహితము కమ్మని శపించాడు . ఆ విధముగా ఆప్రాంతము అలా తయారయ్యినది . వానరులంతా మిక్కిలి కష్టముతో ఆప్రాంతమునంతా వెతికి పిమ్మట ఒక దుర్గమారణ్యమునకు చేరిరి . అక్కడ ఒక రాక్షసుడిని చూసిరి . ఆరాక్షసుడిని సీతామాతను అపహరించిన రావణునిగా భావించిన అంగదుడు ఒక్క దెబ్బతో అతడిని కూలవేసెను . 
అప్పుడు వానరులంతా విజయోత్సాయముతో ఆ ప్రాంతమంతా వెతికి మరి ఒక గుహను చేరిరి . వారు ఆ గుహలను కూడా వెతికి సీతాదేవి జాడ తెలియకపోవుటచే దీనవధానులై ఒక చెట్టు కింద కూర్చుండిరి . 

రామాయణము కిష్కిందకాండ నలుబదియెనిమిదవసర్గ సమాప్తము . 

               శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




రామాయణము కిష్కింద కాండ -నలుబదియేడవసర్గ

                                      రామాయణము 

                                  కిష్కింద కాండ -నలుబదియేడవసర్గ 

సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారం  ఆయా దిక్కులకు వెళ్లిన వానర వీరులందరు సీతాదేవి జాడకొరకు జనావాసములను కొండలను కోణాలను సరస్సులను నాదీ తీరములను , క్షుణ్ణముగా వెదికిరి . సుగ్రీవుడుచెప్పిన ప్రదేశములలో ఈ ఒక్క ప్రదేశమును విడిచిపెట్టక బాగుగా వెదికిరి గడువు (నెలరోజులు ) తక్కువుగా ఉండటంతో  వారంతా పగలంతా ఆకలి అన్న ఆలోచన లేకుండా ఆయా ప్రదేశములన్ని క్షుణ్ణముగా గాలించ సాగిరి రాత్రి పూత మాత్రము ఆయా ప్రాంతములలో దొరికే పళ్లను ఆరగించి విశ్రాంతి తీసుకొనేది వారు . ఆవిధముగా వెదికి వెదికి నిరాశతో  తూర్పు దిక్కుకు వెళ్లిన వినాథుడు తిరిగి వచ్చెను. ఉత్తరదిక్కుకు వెళ్లిన సత్వాలికూడా రిక్త హస్తములతో తిరిగివచ్చెను పశ్చిమదిక్కుకు వెళ్లిన సుషేణుడు కూడా దీన వదనంతో తిరిగి వచ్చెను. (హనుమంతుడు అతనితో దక్షిణ దిక్కుకు వెళ్లిన వానరవీరులు మాత్రం తిరిగిరాలేదు ) వారందరు ప్రసవం గిరి పై శ్రీ రామునితో కూడి ఉన్న సుగ్రీవుడి వద్దకు వెళ్లి నమస్కరించి "ఓ వానర రాజా ! మీరు ఆదేశించినా కూడా సమస్త ప్రాంతములను పర్వతములను వనములను కీకారణ్యములను నాదీ తీరములను సముద్రాఖాతములను జానపదములను సకల గుహలను ప్రవేశించుటకు ఆసాధ్యములైన పలువిధములైన ద్వీపములను పెక్కు దేశములను కాలుమోపుటకే అస్సాధ్యముగా ఉన్న పెక్కు ప్రాంతములను అణులమాంలుము గాలించితిమి మాకు అడ్డు వచ్చిన క్రూర మృగములను చంపితిమి శ్రీరామచంద్ర ప్రభువు యొక్క కార్యము సాధించుటకు మా సర్వ శక్తులను ఒడ్డి ప్రయత్నించితిమి కానీ మా కృషి ఫలించలేదు  ఓ మహా రాజా వాయుసుతుడైన హనుమంతుడు మహా శక్తి శాలి కారణం జన్ముడు  ఆ మహా శివుడే సీతా మాట జాడను తెలుసుకొని రాగలదు ఎందుకనగా రావణుడు సీతాదేవిని అపహరించునని తీసుకువెళ్లిన దక్షిణ దిశకే హనుమంతుడు కూడా ఆంగదాది వీరులాటినో కలసి వెళ్లెను"అని పలికెను . 

రామాయణము కిష్కింద కాండ -నలుబది ఆరవసర్గ

                                 రామాయణము 

                            కిష్కింద కాండ -నలుబది ఆరవసర్గ 

 వానర ప్రముఖులందరూ తమతమ భళా ములతో వెళ్లిన తరువాత  శ్రీరాముడు  "ఈ సమస్త  భూ మండలము గురించి నీకు ఎలా తెలుసు ఇంత విపులముగా ఎలాచెప్పగలుగుతున్నావు ? " అని సుగ్రీవుని ప్రశ్నించెను

 అప్పుడు సుగ్రీవుడు శ్రీ రామునికి నమస్కరించి "రామా  మా అన్న అగు వాలి  ఒక రాక్షసుని  వెంబడిస్తూ మలయపర్వత  గుహలో ప్రవేశించెను.  ఆయన వెనుకే పరిగెడుతున్న నేను  ఆయన మీద ప్రేమతో అక్కడే వేచియున్నాను  సంవత్సర  కాలము అయినా మా అన్న తిరిగి రాలేదు. ఒక రోజు వేగముగా ప్రవహించుచు వచ్చిన రక్తమును చూసి మా అన్న ఏ  దానవుని చేతిలో మరణించి ఉండునని భావించాను, నేను తీవ్ర శోకములో మునిగి పోయాను కొంత సేపటి తరువాత అభిలము మూసివేసినచో మా అన్నాను చంపిన రాక్షసుడు కూడా మరణించునాని భావించి పెద్ద కొండరాయిని ఐ కష్టము మీద ఆ బిలామును మూసివేసితిని. పిమ్మట ఆసక్తుడ నయి  మిక్కీ విచారంతో  కాళ్ళీడ్చుకుంటూ కిష్కింధకు చేరితిని అలా ఉన్న నన్ను చూసి  మంత్రులు సన్నిహితులు నా చుట్టూ చేరి విషయమును రాబట్టి నన్ను ఓదార్చిరి  పిమ్మట సింహాసనం కాలీగా ఉండ రాదనీ నన్ను రాజును చేసితిరి అలా రాజయిన నేను కార్య భారములలో పడి  మా అన్న మరణాన్ని నెమ్మిదిగా మరచి  సంతోషముగా ఉండ సాగితిని ఇంతలో ఒక రోజు మా అన్న కిష్కింద కు రానే వచ్చెను. ఆయన్ని చూసిన వెంటనే సగౌరవంగా  సంతోషముగా, రాజ్యాధికారమును  ఆయనకు అప్పగించితిని కానీ మా అన్న నన్ను అపార్థము చేసుకొని మనస్తాపముకు లోనై క్రోధముతో ఉడికిపోవుచు నన్ను చంపుటకు సిద్దప్పడెను అప్పుడు నేను ప్రాణభయముతో నా మిత్రులతో సహా పారిపోసాగాను.   మా అన్న చాలా దూరము నా వెంట బడెను నేను మొదట తూర్పుదిశకు వేళ్లా ను. అక్కడి ప్రదేశములు అన్ని చూసాను  క్షీర సాగరమును కూడా చూసాను మా అన్న కూడా నన్ను తరుముతూ వస్తుండగా భయముతో దక్షిణ దిశగా పరుగులు తీసాను అక్కడి ప్రాంతములను వింధ్య పర్వతమును చూసాను అక్కడకి కూడా వాలి నన్ను వెంటాడుతూ వచ్చుటచే  పశ్చిమ దిక్కుకు పరిగెత్తితిని. అక్కడి ప్రదేశములను  గిరి శ్రేష్ఠ మైన అస్త్రద్రి ని చూసితిని వాలి విడిచిపెట్టక నన్ను వెంటాడుచుండుట చే  నేను ఉత్తర దిశకు పరిగెట్టితిని  ఆ దిక్కున హిమవత్పర్వతమును  మేరుగిరిని లవణ సముద్రమును గాంచితిని  ఆ విధముగా వాలి నన్ను తరుముతుండుట చే ఎక్కడ నాకు రక్షణ లేకపోయెను అప్పుడు హనుమంతుడు  మాతంగముని ఇచ్చిన సేపే కారణముగా వాలి ఋష్యమూక పర్వతముపైకి  రాలేదన్న సంగతిని నాకు జ్ఞప్తికి తెచ్చెను కావున అప్పటినుండి నేను ఈర్ష్యమూక పర్వతముపైనే ఉంటున్నాను ఓ ప్రభు ఈ విదముగా నేను భూ మండలాన్ని మొత్తాన్ని  ప్రత్యక్షంగా చూసాను అని పలికెను"

              రామాయణము  నలుబది ఆరవ సర్గ -కిష్కింద కాండ సమాప్తము . 

            శశి 

     ఎం.ఏ, ఎం.ఏ ,(తెలుగు ) తెలుగుపండితులు . 


                                    రామాయణము 

                                  కిష్కింద కాండ - నలుబదిఐదవ సర్గము 

వానర ప్రభువైన సుగ్రీవుడు ఆవానరులను అందరిని సమావేశపరిచి   "శ్రీ రామకార్యము (సీతాన్వేషణ)   సఫలమగుటకై నేను విపులముగా తెల్పిన ప్రదేశములను అన్నింటిని  వెదకుడు . " అని పల్కెను అంతట ఆవానరప్రముఖులు  తమప్రభువు యొక్క తిరుగులేని  శాసనము  తలదాల్చి మిడుతలవలె భూమిని  కప్పివేయుచు   అచ్చటినుండి బయలుదేరిరి. 


      సీతాదేవిని అన్వేషించుటకై  విధించిన  నేలగడువును  నిరీక్షించుచు  శ్రీ రాముడు లక్ష్మణ సహితుడై ఆ  ప్రస్రవణ  గిరియందే వినిపించుచుండెను. గిరిరాజమైన  హిమవత్పర్వతములో మనోహరముగా ఒప్పుచున్న ఉత్తరదిశకు వానర వీరుడైన శతవలి తన అనుచరులతో గూడి వెంటనే  బయలుదేరెను. వినతుడు అను వానర నాయకుడు తనవారితోగూడ తూర్పుదిక్కుకు  ప్రయాణమాయెను  తారుడు అంగదుడు మొదలగు వారిని వెంటనిడుకొని కపిశ్రేష్టుడైన మారుతి  అగస్త్యమహాముని  సంచరించిన  దక్షిణ దిశకు వెడలెను కపివరుడు వానర నాయకుడు ఐన సుషేణుడు వరుణదేవుని  పాలనలో ఉన్నదియు  మిక్కిలి దుర్గమమైనది అగు పడమర దిక్కుకు  తనవారిని వెంటబెట్టుకొని అటునుండి కదిలేను. 
   వానర రాజైన సుగ్రీవుడు ప్రముఖులైన వానరసేనాపతులను  నలుదిక్కులకు  యధావిధిగా  పంపించి  సంతృప్తుడై  హాయిగా ఉండెను ఆయా వానర సేన నాయకులందరూ రాజాజ్ఞనను  శిరసావహించి  తమతమదిశలకు శీఘ్రముగా సాగిపోయిరి. రావణుని  హతమార్చి సీతామాతను తీసుకొనివచ్చెదను  అని  పలుకుచు ఆ వానరులు సంతోషాతిశయముచే బిగ్గరగా అరచుచు , గర్జించుచు , తమనుతాము  తమనుతాము ప్రశంసించుకొనుచు  సింహనాదములను గావించుచు వికృతముగా కేకలు వేయుచు ముందుకు సాగిరి. 
   ఆ దుష్ట రావణుడు నా చేతికి చిక్కినచో  నేనొక్కడినే వానిని రణరంగమున నేలగూల్చెదను పిమ్మట అతని సేనానాలను అన్నింటిని చికాకు పరవహి క్షణములో జానకీదేవిని గైకొని వచ్చెదను. మీరందరును ఇక్కడే ఉండండి జానకి దేవి బిక్కుబిక్కు మనుచు పాతాళములో  ఉన్నప్పటికీ  నేను ఒక్కడినే అక్కడికి వెళ్లి ఎన్నిశ్రమాలకు ఓర్చి అయినాను  ఆ తల్లిని తీసుకు వచ్చెదను.  వృక్షములను  పెకలించి  వైచెదను  కొండలను పిండిచేసెదను  భూమిని  బ్రద్దలు కావించెదను సముద్రములను  కల్లోల పరిచెదను  నేను ఎన్ని యోజనములయెత్తుకైనను  నిస్సంశయముగా ఎగురగలను నేను వందల కొలది యోజనాలు ఎగురగలను  నేను వందల కొలది యోజనాలు ఎగురగలను  భూమండలమున గాని సముద్రమున గాని  పర్వతములయందు గాని  అరణ్యములలోగాని పాటల లోకమున గాని నన్ను ఆపగలవారు ఎవ్వరు ఉండరు భళా గర్వితులైన వానరులలో  ఒక్కొక్కడు ఈ విధముగా సుగ్రీవుని ఎదుట ఒక్కొక్కరు ప్రగల్బాములు పల్కిరి   

                          శశి 

                 ఎం.ఏ , ఎం.ఏ ,(తెలుగు ) , తెలుగు పండితులు .