Monday 11 March 2019

రామాయణము సుందరకాండ -నాల్గవసర్గ

                              రామాయణము 

                                   సుందరకాండ -నాల్గవసర్గ 

ఆ విధముగా లంకిణి ని జయించిన మారుతి ముఖద్వారం నుండి కాక ప్రాకారము దూకి వెళ్లెను . అలా వెళ్లునప్పుడు కూడా ఎడమకాలిని ముందు పెట్టి వెళ్లెను (శత్రువుల ఇంటికి వెళ్లునప్పుడు ఎడమకాలు పెట్టి వెళ్ళవలయును . ఇది బృహస్పతివాక్యము ). ఆ విధముగా లంకా నగరములో ప్రవేశించిన మారుతి అక్కడి భవనములు వెతకసాగెను . ఆ బవనములన్ని బహు సుందరముగా ఉండెను . అవి ఒకదానినిమించిఒకటి అందముగా ఎత్తుగా ఉండెను . ఆ భవనములలో రకరకాల స్త్రీలను ,రకరకాల రాక్షసులను చూసేను . అందమైన వనములను ,సరస్సులను చూసేను . కాపలా కాయుచున్న వేల  సైనికుల్ని మారుతి చూసేను . అక్కడ ఒంటి కన్ను వాణ్ని ,ఒంటి చెవివాన్ని ,పోట్ట ఎదరకు వున్నవాణ్ణి ,కోరలు కలవాణ్ణి ,ఇలా రకరకాల జనులను మారుతి చూసేను . తర్వాత హనుమ రావణుని అంతఃపురములోకి ప్రవేశించెను . అక్కడ గోడలన్నీ బంగారముతో తాపడము చేసివున్నవి వాటిపై మణులు ,రత్నములు అందముగా అతకబడి వున్నవి . ఆ గుమ్మములకు ముత్యములు తోరణములుగా కట్టబడి వున్నవి ఆ తోరణముల మధ్యలో వైడూర్యములు ,అందముగా వేలాడదీయబడి వున్నవి . 

రామాయణము సుందరకాండ నాల్గవసర్గ సమాప్తము . 

            శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment