Sunday 3 March 2019

రామాయణము కిష్కిందకాండ - ఏబదినాలుగవసర్గ

                                           రామాయణము 

                                            కిష్కిందకాండ - ఏబదినాలుగవసర్గ 

అప్పుడు హనుమంతుడు ఇదంతా గమనించి , అంగదునితో "ఓ అంగదా !నీవు మహా పరాక్రమ శాలి అయిన వాలి పుత్రుడవు పైపెచ్చు గొప్ప వీరుడవు , నీవు పిరికి వాడి లాగా ఇలా మాట్లాడడం తగదు ఒక వేళ నీవు ఆ గుహలోకి వెళ్లి తలదాచుకున్నా ఈ చాపలచిత్తులైన వానరులు నీ తోనే ఉంటారని నమ్మకు వారు ఆకలిదప్పికలతోను , భార్యాబిడ్డల బెంగ తోను , ఉండిరి . నీవు వంటరివైపోతావు . నేను నాలాంటి ఇంకా , సుగ్రీవుడి శ్రేయోభిలాషులు మిత్రులు ఐన వానరవీరులు నీతో రారు . ఆ విధముగా నీవు ఇక్కడ ఉన్న విషయము సుగ్రీవునికి తప్పక తెలియును . లక్ష్మణుడి  బాణములు ఇంద్రుని వజ్రాయుధములకన్నా బయంకరమైనవి . వాటి నుండి తప్పించుకొనుట అసాధ్యము . 
మన కు అప్పగించిన సీతాన్వేషణను పూర్తి చేసే మనము తిరిగి వెల్దాము . సుగ్రీవుడు మనకు ఏ దండన విధించడు . పైపెచ్చు అతడు నీకు పినతండ్రి కూడా కదా . కావున నీవు భయపడవలసిన అవసరము లేదు . నీ తల్లి తార నిన్ను ప్రాణముగా చూసుకొనుచున్నది . ఆమెకు నీవు తప్ప వేరొక సంతానము లేదు . కావున మనము ఉత్సాహమును వీడక కార్యము సఫలము చేసుకొని వెళ్ళుట ఉత్తమము "అని పలికెను . 

రామాయణము కిష్కిందకాండ ఏబదినాలుగవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment