Sunday 3 March 2019

రామాయణము కిష్కిందకాండ -ఏబదియెనిమిదవసర్గ

                               రామాయణము 

                           కిష్కిందకాండ -ఏబదియెనిమిదవసర్గ 


వానరుల మాటలు విన్న సంపాతి , కన్నీరు పెడుతూ వనరులతో" ఓ వానరులారా మీరు తెలిపిన జటాయువు నాతమ్ముడు పూర్వము వృత్తాసురుడు వద్ద అనంతరం నేను నా తమ్ముడు పోటీపడి పైపైకి ఎగరనారంభించెను నేను మిక్కిలి పైకి ఎగురట చే , సూర్యకాంతి వేడికి నారెక్కలు తెగి ఇచ్చట పడిపోతిని అప్పటినుండి నా తమ్ముడు గురించిన ఈ వివరములు నాకు తెలియనేలేవు "అని పలికెను. 
ఆ మాటలు విన్న అంగదుడు "ఓ పక్షి రాజా , నీకు తెలిసిన చొ  రావణుడి స్థావరం , దయ తో తెలుపుము , అని పలికెను" . అప్పుడు సంపాతి"ఓ వానరులారా  నేను రెక్కలు కాలిన  పక్షినిఐనా శ్రీ రామునికి చేతనైనంత సహాయం చేస్తాను . నేను అతలవితలాది , అదో ఊర్ధ్వ ఏడేడు పదునాలుగు లోకములను బాగుగా ఎరుగుదును . దేవాసురుల సంగ్రామము , క్షీరసాగర మధనము , నాకు తెలుసును . చక్కని రూపము కలిగిన ఒక స్త్రీ ని  రావణుడు అపహరించి పోవుచుండగా నేను చూసితిని ఆమె బిగ్గరగా రామా లక్స్మనా , అని అరుచుచుండెను ఆమె శరీరమంతా వణికిపోవుచున్నది బహుశా ఆమె సీతాదేవి అయిఉండవచ్చూ  ఓ వనరులారా , ఆ రాక్షసుని పేరు రావణుడు అతడు విశ్ర వాసుని ఔరస పుత్రుడు కుభేరుని సోదరుడు లాకా నగరం అతని నివాసము , ఇక్కడికి వంద యోజనముల దూరమున సముద్ర మధ్యముగా ఒక ద్వీపము కలదు . విశ్వకర్మ లంకా నగరమును నిర్మించెను సీతాదేవి ఆ లంక యందును , రావణుని అంతఃపురము నందు బంధింపబడి ఉన్నది . రాక్షస స్త్రీ లు ఆమెకు  కాపలా కాయుచున్నారు. ఓ వానరులారా వెంటనే మీ పరాక్రమమును చూపుచూ సముద్రమును లంఘించుటకు త్వరపడుదు మీరు అక్కడ అవశ్యము సీతాదేవిని దర్శించి క్షేమముగా తిరిగిరాగలరు . నా దివ్యదదృష్టి తో చూచి పలుకుచున్న మాటలివి . మిగిలిన పక్షుల కంటే మా జాతి పక్షులు వందయోజనములు , లేదా అంతకంటే దూరము ఎగురగలము . 
"నేను ఆవైనతేయని వంశము వాడిని గనుక ఇక్కడ నుండియే రావణుని , జానకిని స్పష్టముగా చూడగలను మాకును గరుడుని వలే శక్తియు , దివ్యదృష్టి గలదు . నా యెడల దయుంచి నన్ను వరుణునకు నిలయమైన సముద్రతీరమునకు చేరుటకై సహాయపడుటకు మిమ్ము అర్ధించుచున్నాను . అక్కడ నా తమ్ముడగు జటాయువునకు తర్పణములు సమర్పితును. "
అనంతరము మిగుల బలశాలులైన ఆ వానరులు రెక్కలు మాడిపోయిన సంపాతిని  తీరా ప్రదేశమునకు చేర్చిరి 
సంపాతి తన సోదరునికి తర్పణములు అర్పించెను . పిమ్మట వానరులు అతనిని మరల యథాస్థానమునకు చేర్చిరి 
అతని ద్వారా సీతాదేవి సమాచారం తెలుసుకున్నందుకు ఎంతయు సంతోషపడిరి . 

రామాయణము - కిష్కింద కాండ - ఏబదియెనిమిదవ సరిగా సమాప్తం . 

      శశి,

ఎం.ఏ ఎం.ఏ,(తెలుగు ),తెలుగుపండితులు. 

No comments:

Post a Comment