Sunday 3 March 2019

రామాయణము కిష్కిందకాండ -ఏబదియైదవసర్గ

                                రామాయణము 

                            కిష్కిందకాండ -ఏబదియైదవసర్గ 

హనుమంతుడి మాటలు విన్న తర్వాత కూడా ధైర్యము రాని అంగదుడు "ఓ వీరా !ఏది న్యాయము ?సుగ్రీవుడు మా తండ్రి బతికి ఉండగానే అతడి సామ్రాజ్యమును ఆక్రమించెను . మా తండ్రి బయటకు రాకుండా గుహకు అడ్డుపెట్టేను . తనకు రాజ్యము అప్పగించిన శ్రీరాముని కార్యము కూడా మరచిపోయెను . లక్ష్మణుని కోపమునకు బయపడి మనల్ని ఈ కార్యమునకు నియమించెను . అతడు నన్ను యువరాజుగా ప్రకటించలేదు . ధర్మప్రభువైన ఆ రాముడే నన్ను యువరాజుగా నియమించెను . ఇక కార్యము పూర్తి కాలేదని తెలిసినచో సుగ్రీవుడు నన్ను ప్రాణములతో విడుచుట కల్ల . కావున నేను కిష్కింధకు రాను "అని దర్భాసనము వేసుకుని నిరాహార దీక్షద్వారా ప్రాయోపవేశమునకు కూర్చుండెను . అది చూసిన వానరులు తాము సైతము నిరాహార దీక్షకు కూర్చుండిరి . అలా కూర్చుండిన వారు శ్రీరాముని అరణ్యవాసము ,సీతాపహరణము ,సుగ్రీవుడితో మైత్రి ,వాలి వధ ,లక్ష్మణుని కోపము మొదలగు విషయములు చర్చించుకొనిరి . వాటి కోలాహలం మిన్ను ముట్టెను . 
రామాయణము కిష్కిందకాండ ఏబదియైదవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


No comments:

Post a Comment