Thursday 28 March 2019

రామాయణము సుందరకాండ -పదవసర్గ

                            రామాయణము 

                               సుందరకాండ -పదవసర్గ 

సీతాదేవి జాడకై అతినిశితముగా వెతుకుచున్న హనుమంతుడు ఆ మహాభవనము నందు ఒక శయనాసనము (మంచము )ను చూసేను . అది దంతపు నగిషీలతో ,బంగారు పూలతో ,రత్నములతో ,వజ్ర ,వైడూర్యములతో చక్కగా అలంకరింపబడి ఉండెను . అచట చామరములు చేతపట్టి చక్కగా విసురుతున్న స్త్రీలు ను మారుతి చూసేను . ఆ ప్రాంతము సుగంధభరితమై ఉండెను . ఆ మహాతల్పంపై ఉన్న రావణుని హనుమ చూసేను . ఏనుగు వలె గురక పెడుతున్న రావణుని చూసి మారుతి "ఛీ !యితడు పరస్త్రీ ని అపహరించిన దుర్మార్గుడు ,ఇతనికి దూరముగా ఉండాలి "అని అనుకొనెను . 

వెంటనే కొంచం దూరముగా వెళ్లి రావణుని పరీక్షగా చూసేను . రావణుడు దృడ కాయుడు ,బలిష్ఠుడు అతడు ఆదమరచి నిద్రించుచు ఉండెను . అతడి కాళ్లవద్ద వున్న అతడి ప్రియపత్నులను హనుమ చూసేను . అచ్చటికి దగ్గరలోనే ఒక ప్రత్యేక శయ్యపై వున్నా ఒక స్త్రీ ని మారుతి చూసాడు . ఆమె మిక్కిలి సౌందర్యవతి ,తేజోవతి ,ఆమె తేజస్సుతో ఆ భవనమునకే కళ వచ్చినట్లుండెను . అటువంటి స్త్రీ (రావణుని పట్టమనిషి ఐన మండోదరి )ని హనుమ చూసి ఆమే సీతాసాద్వి అని భావించి సంతోషముతో గట్టిగా భుజములను చరుచుకొనెను ,తన తోకను ముద్దాడెను ,పాటలు పాడెను ,నృత్యము చేసెను . 

రామాయణము సుందరకాండ పదవసర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment