Sunday 3 March 2019

రామాయణము కిష్కిందకాండ-ఏబదితొమ్మిదవ సర్గ

                                  రామాయణము 

                                  కిష్కిందకాండ-ఏబదితొమ్మిదవ సర్గ 

గ్రద్ద రాజైన సంపాతి నుడివిన అమృతతుల్యములగు వచనములు విన్న పిమ్మట ఆ వానరులందరును పరమానందభరితులైరి . వానర శ్రేష్ఠుడైన జాంబవంతుడు తోడి వానరులందరితో గూడి వెంటనే లేచి , నేలపై నిలబడెను . పిమ్మట అతడు సంపాతి ఇటలీ ప్రశ్నించెను . "ఇంతకును సీతాదేవి లంకనందు ఎక్కడ ఉన్నది ఆమెను చూచినవారెవరు ? ఆమెను ఎవరు అపహరించిరో నీకు ఎవరు చెప్పారు ?. 
అప్పుడు సంపాతి ఇట్లనెను "నేను  వృద్ధుడనై ఉన్నందున , నా ప్రాణశక్తియు బలపరాక్రమములు క్షీణించినవి , ఇట్టి స్థితిలో ఉన్న నన్ను నా కుమారుడైన సుపార్ఫ్యూడు ఆహారాదులను సమకూర్చి నన్ను పోషించుచున్నాడు. 
ఒకానొక నాడు ఆకలితో నాకనకలాడుచుంటిని . నాకు ఆహారము తీసుకొని వచ్చుటకై నా కుమారుడు బయటకు వెళ్లెను . మాంసము దొరకక పోవుటచే అతడు సూర్యుడు అస్తమించిన పిమ్మట రిక్త హస్తములతో తిరిగి వచ్చెను. అది చూచి మిక్కిలి ఆవాసముతో నేను నా కుమారుని తీవ్రముగా మందలించితిని. తిండి లేక భాదపడుచున్న నన్ను ఓదార్చి  ఇట్లు చెప్పదొండగెను "తండ్రీ !నేను ఎప్పటివలె ఆహారము సంపాదించుకొని వచ్ఛుటకై ఆకాశమునకు ఎగిరితిని . అంట మహేంద్రగిరి ద్వారము కడకు చేరి అచట నిలబడితిని . ఆ సమయమున చేదింపబడిన కాటుక కొండవలె నల్లగా నున్న ఒక దుష్టుడు ఒక స్త్రీ ని తీసుకొని పోవుచుండుట నేను చూచితిని . 
ఆ స్థితిలో ఉన్న నేను వారిద్దరిని నీకు ఆహారముగా తీసుకువచుటకు నిశ్చయించితిని . కానీ పురుషుడు సవినయముగా దారి ఇమ్ము అని నన్ను మృదువు గా అడిగెను నీచుడు సైతము తనను సవినయముగా సమీపించిన  వానిని హింసించడు . ఇక నా విషయమున చెప్పవలిసిన పని లేదు . ఆ తరువాతనే అక్కడి మునులచే నాకు తెలిసినది అతడు రావణాసురుడిని , ఆ స్త్రీ సీతాదేవి అని , శ్రీరాముని ధర్మ పత్ని అని , ఆమెను అతడు అపహరించుకు పోతున్నాడనియు నేను తెలుసుకొంటిని ఆమె రామలక్ష్మణులను  స్మరించుచుండెను "అని పలికెను . ఆ విషయము విన్నప్పటికీ , ఆదుష్టుడి పై విజృంభించాలనే ఆలోచన నాకు రాలేదు . ఏల ననగ  నేను రెక్కలు తెగిన పక్షిని , అనిపలికెను . 

రామాయణము -కిష్కిందకాండ - ఏబదితొమ్మిదవసర్గ . 

     శశి,

ఎం.ఏ,ఎం.ఏ,(తెలుగు),తెలుగుపండితులు . 








No comments:

Post a Comment