Monday 4 March 2019

రామాయణము కిష్కిందకాండ-అరువదిరెండవసర్గము

                                           రామాయణము 

                                            కిష్కిందకాండ-అరువదిరెండవసర్గము

ఆ మునివరునితో ఆ విధముగా చెప్పి , ఏడ్చితిని.  అప్పుడు మునీశ్వరుడు క్షణకాలం జ్ఞ్యాన నిమగ్నులై ఇలా పలికెను" ఓ సంపాతి  బాధపడకు , నీరెక్కలు మళ్ళీ వచ్చును. నీ బలపరాక్రమములు మళ్ళీ పుంజుకొనును కొంత కాలము తర్వాత దశరధుడు అను ,మహారాజు పుత్రుడు రాముడు అయన భార్య తమ్ములతో కలిసి తండ్రి ఆజ్ఞ ప్రకారము వనవాసము చేయును . ఆ సమయములో దేవతలకు సైతం ఎదిరింప శక్యము కానీ రావణుడు అను రాక్షసుడు ఆ పతివ్రతను అపహరించి తన రాజ్య భోగభాగ్యములు ఆశగా చూపును . కానీ ఆ సాద్వి వాటన్నిటిని తిరస్కరించి  శ్రీ రాముని తలుచుకుంటూ  బిక్కుబిక్కు మంటూ కాలంగడుపును. ఆ దేవి రావణుడి భావనమునుండి వచ్చిన  ఏఒక్క ఆహారమును ముట్టదు. అది తెలిసిన ఇంద్రుడు దివ్య పాయసమును ఆమెకు రోజు ఇచ్చును . రోజూ ఆమె ఆ పాయసమును తినుటకు ముందు ఒక ముద్ద శ్రీ రాముని ఉద్దేశించి  నేలపై ఉంచును.  
శ్రీ రాముని దూతలైన వానరులు సీతా దేవిని వెతుకుచూ  నీ వద్దకు వస్తారు . అప్పుడు నీవు ఆ సాధ్వి గురించి వారికి తెలియ పరుచు . అప్పటి వరుకు నీవు ఇక్కడి నుండి కదులుటకు వీలులేదు ఆవిధంగా నీవు ఆ మహా సాధ్వి గురించి సమాచారం అందించుట వలన వారికే కాక  బ్రాహ్మణులకు ఇంద్రాది దేవతలకు మునీశ్వరులు మంచిజరుగును. నేను ఆ అన్నదమ్ములను చూడాలని కుతూహల పడుతున్నాను. కానీ అంత సమయము నేను ప్రాణములతో ఉండను." అని ముని నాతో పలికెను . "అని సంపాతి వానరులతో చెప్పెను . 

రామాయణము - కిష్కింద కాండ-అరువదిరెండవసర్గ . 

               శశి , 

  ఎం.ఏ ,ఎం.ఏ (తెలుగు), తెలుగుపండితులు . 

No comments:

Post a Comment