Sunday 3 March 2019

రామాయణము కిష్కిందకాండ -ఏబదిమూడవసర్గ

                                     రామాయణము 

                                     కిష్కిందకాండ -ఏబదిమూడవసర్గ 

ఆ తపస్వి మాటలు విని హనుమంతుడు "మాతా  మేమందరం , నిన్ను శరణువేడుచున్నాము వానరరాజైన సుగ్రీవుడు సీతాన్వేషణకు మాకు ఒక నెలరోజుల గడువు మాత్రమే విదించెను ఈ గుహలో ఉండగానే , ఆ గడువు పూర్తి అయ్యింది.  కనుక మా మీద దయ ఉంచి ఈ గుహ నుండి బయటపడే  మార్గము తెలిపి పుణ్యం కట్టుకొనుము . అని బ్రతిమలాడెను . "అప్పుడు ఆ మహా సాత్వి "ఓ వనరులారా ఈ గుహలోకి ప్రవేశించిన వారు బయటపడుట అసాధ్యము కానీ నేను మిమ్ములను బయటకు చేర్చెదను .  అని పలికి వారందరిని బయటకు చేర్చి , ఓ వానరులారా క్షేమముగా వెళ్ళిరండి "అనిపలికెను . 
ఆ భయంకర గుహనుండి బయట పడిన వానరులు , ఒక మహా సముద్రము ఒడ్డుకు చేరిరి . ఆ సముద్రము పెద్ద పెద్ద అలలతో భయంకరంగా ఉండిని



. అప్పుడు యువరాజైన అంగదుడు 

" ఓ  వానర వీరులారా !సుగ్రీవుడు విధించిన గడువు పూర్తిఅయిపోయింది ఆయన ఆజ్ఞను మీరినమనకు చావు తప్పదు అక్కడికి వెళ్లి చచ్చుటకంటె ఇక్కడే ప్రాయోపవేశము చేయుట ఉత్తమము . కనుక నేను ఈ సముద్ర తీరమునందే ప్రాయోపవేశము చేయుదును అని పలికెను ". 

అప్పుడు తారుడు అను వానరవీరుడు "మనము మరణించుటకంటె ఆ బిలముతో ఫల కంద మూలాదులను , తింటూ హాయిగా జీవించుట ఉత్తమము అక్కడ మనకు దేవేంద్రుడి వలన కూడా అపాయము సంభవించదు" అని పలికెను . ఆ పలుకులకు , అంగదుడు సైతము అంగీకరించినట్లు అనిపించెను . 

రామాయణము - కిష్కిందకాండ _ఏబదిమూడవసర్గ . 

         శశి , 

ఎం.ఏ,ఎం. ఏ ,(తెలుగు),తెలుగు పండితులు . 


No comments:

Post a Comment