Monday 11 March 2019

రామాయణము సుందరకాండ -మూడవసర్గ

                                రామాయణము 

                                  సుందరకాండ -మూడవసర్గ 

హనుమ చీకటిపడిన పిమ్మట నెమ్మిదిగా తన చిన్న ఆకారములో లంకలోకి ప్రవేశించ చూసేను . కానీ లంకాధిదేవత ఐన లంకిణి హనుమను చూసింది . అది వెంటనే భీకర స్వరముతో "ఓయ్ వానరా !ఎవరు నీవు నిజముచెప్పు ?ఎందుకు ఈ లంకా మహా నగరంలోకి ప్రవేశించాలని చూస్తున్నావు ?నన్ను దాటి ఎవ్వరు లోపలి వెళ్ళలేరు ?అనెను . అప్పుడు హనుమ తన ఆకారమును మాములుగా చేసి "నేనెవరో తర్వాత చెబుతా కానీ ముందు నువ్వెవరో చెప్పు "అనెను . 

అప్పుడు లంకిణి కోపము పెరగగా తీవ్ర స్వరముతో "వానరా !నేను ఈ లంకాధి దేవతను . రావణుడి విధేయురాలను . నన్ను దాటి ఎవరు లోపలి ఎవ్వరు వెళ్ళలేరు . ఇప్పుడు చెప్పు నువ్వెవరు ?ఎందుకు లోపలి వెళ్తున్నావ్ ?"అనెను . అప్పుడు హనుమ "అమ్మా !నేను ఈ అందమైన లంకా నగరమును చూడవలెననే ఉత్సాహముతో ఇచటికి వచ్చాను . చూసి వెంటనే వచ్చెదను ?అని పలికెను . అప్పుడు ఆ లంకిణి "దుర్బుద్ధి కల ఓ వానరా !నీ వేషములు నా దగ్గర సాగవు . మర్యాదగా వెనకకు వెళ్ళు "అని తీవ్ర స్వరముతో పలికెను . అప్పుడు హనుమ "ఓ శుభాoగి లోపలి వెళ్లి వెంటనే వచ్చెదను "అని పలికెను . 
అప్పుడా లంకిణి విపరీతమైన కోపముతో హనుమంతుడిని ఒక్క దెబ్బ వేసెను . ఆ దెబ్బకు హనుమంతుడు ఒక పెద్ద ధ్వని చేసి ,వెంటనే తన ఎడమ చేతితో స్త్రీ అని చిన్నగా కొట్టెను . 



ఆ దెబ్బకే లంకిణి అదిరిపడెను . అప్పుడా లంకిణి "ఓ వానరా !పూర్వము బ్రహ్మదేవుడు నాకు వరమిచ్చు సందర్భములో" ఒక వానరుడు వచ్చి నిన్ను జయించి లంకా నగరంలోకి పర్వేశించినపుడు రాక్షసులకు వినాశకాలము వస్తుంది . "అని పలికెను . ఇప్పుడు నీవు జయించినావు . ఇక రావణాది సమస్త రక్కసులకు  సీత కారణముగా వినాశకాలము రాబోవుచున్నది కాబోలు . నా అంచనా ప్రకారము  నీవు ఆవిడను వెతుకుతూ ఇక్కటిది వచ్చివుంటావు . వెళ్లు నేను నిన్ను ఆపలేను . నీవు లంకలోకి వెళ్లి సీతను అన్వేషించు "అని పలికి లంకలోకి దరి ఇచ్చెను . 

రామాయణము సుందరకాండ మూడవసర్గ సమాప్తము . 

           శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment