Thursday 28 March 2019

రామాయణము సుందరకాండ -తొమ్మిదవసర్గ

                                       రామాయణము 

                                                  సుందరకాండ -తొమ్మిదవసర్గ 

శ్రేష్ఠముగా విలసిల్లెడి ఆ పుష్పక విమానమును పూర్తిగా వెతికిన పిమ్మట మారుతి ఆ పుష్పక విమానంపై కూర్చొనెను . అప్పుడు శ్రేష్ఠమైన ఆహార పదార్థముల నుండి మంచి వాసన హనుమ కు వచ్చెను . అది వాయుదేవుడే ఇటు రమ్మని పిలిచినట్లుండెను . ఆ వాసన వచ్చిన దిశగా అంజనీపుత్రుడు వెళ్లెను . అది రావణుడి భవనము . అక్కడ అనేకులైన స్త్రీలు ఉండిరి . వారందరూ మద్యపానము చేయుటచే ,అర్ధరాత్రి అగుటచే మత్తులో ఎక్కడివారక్కడ పడుకుని దొల్లుతూ ఉండిరి . వారందరూ ముగ్దమనోహరముగా ఉండిరి . వారి నగలు చిందరబందరగా వున్నవి . వారందరి మధ్యలో రావణుడు నిద్రిస్తూ ఉండెను .వారిలో కొందరు రావణుడు గెలిచి తీసుకురాబడినవారు , మరికొందరు రావణుడిని ఇష్టపడి తామంతటతామే వచ్చినవారు . వారిలో ఒక్కరు కూడా బలవంతముగా తేబడినవారు లేరు .  వారిని చూసిన హనుమంతుడు . రావణుడు అతడి భార్యలతో సంతోషముగా వున్నట్టే ,శ్రీరామచంద్రమూర్తి కూడా తన ధర్మపత్నితో వుంది వుండే ,రావణుడికి ఆపద తప్పి ఉండేదని భావించెను . రావణుడు ఉత్తమ వంశమున జన్మించాడు . లంకకు ప్రభువు ,గొప్ప శివ భక్తుడు ,అయినప్పటికీ అతడు చేసిన పాపా కార్యము (సీతాపహరణము )వలన అతడికి ముప్పు రాబోవుచున్నదని మారుతి భావించెను . 

రామాయణము సుందరకాండ తొమ్మిదవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . . 

No comments:

Post a Comment