Wednesday 13 March 2019

రామాయణము సుందరకాండ - ఆరవసర్గ

                                         రామాయణము  

                                                సుందరకాండ - ఆరవసర్గ 

మహా పరాక్రమ శాలి ఐన హనుమంతుడు లంక అంతా తిరిగినా కూడా సీతా దేవి కనిపించక విచార గ్రస్తుడు అయ్యెను . వెంటనే ఉత్సాహము తెచ్చుకొని , నేర్పుతో లంక అంతా వెతక సాగెను . మిక్కిలి పరాక్రమశాలి ఐన హనుమంతుడు వేగంగా ప్రహస్తుని భవనము పైకి దూకెను . పిమ్మట మహా పార్వ్సుని , కుంభకర్ణుని , విభీషణుని , విరూపాక్షుడు , విద్యుజ్జిహ్వుడు , విద్యున్మాలి , వజ్రదంష్ట్రుడు , శుకుడు , సారణుడు , ఇంద్రజిత్తు , జంబుమాలి , సుమాలి, రశ్మి కేతువు , సూర్య శత్రువు , వజ్రకాయుడు , ధూమ్రాక్షుడు , సంపాతి , విద్యుద్రూపుడు , భీముడు , ఘనుడు , విఘనుడు , సుపనాసుడు , వక్రుడు , శఠుడు , వికటుడు , హ్రస్వకర్ణుడు , దంష్ట్రుడు , రోమశుడు , యుద్దోన్మత్తుడు , మత్తుడు , ధ్వజగ్రీవుడు, కరాళుడు  , నాది , ఇంద్రజిహ్వుడు , హస్తిముఖుడు , పిశాచుడు , శోణితాక్షుడు , మొదలగు రాక్షసుల గృహములను మారుతి వరుసగా శోధించెను . 
సుప్రసిద్దుడైన మారుతి ఆ రాక్షుల భవనములు వెదుకు సమయమున సంపన్నులైన రాక్షసుల యొక్క ధనమును , తిలకించెను . ఆ భవనములను పూర్తిగా శోధించిన పిమ్మట రాక్షస రాజైన రావణుని ప్రాసాదమునకు చేరెను. అంతయును తిరుగుచు రావణుని సమీపమున శయనించిన వారిని , వికృతములైన చూపులుగలవారను ఐన  రాక్షస స్త్రీ లను  చూచెను . సీతాదేవి మాత్రము కనిపించలేదు . 

రామాయణము సుందరకాండ ఆరవసర్గ సమాప్తము . 

                          శశి 

ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment