Sunday 3 March 2019

                                            రామాయణము 

                                 కిష్కిందకాండ-ఏబదిఆరవసర్గ       

ఆ వానర వీరులందరు కూర్చునివున్న ప్రదేశమునకు సంపాతి అను పేరుగల ఒక గ్రద్దరాజు వచ్చెను . వారందరిని చూసి ," ఆహా  దైవానుగ్రహమువల్ల నాకీరోజు మంచిఆహారము లభించినది . అని అనుకొనెను , ఆ మాటలు విన్న అంగదుడు హనుమంతునితో . "ఓ మారుతి ప్రాయోపవేశమునకు కూర్చున్న మనకు చావు తెచ్చుటకు ఆ సూర్య భక్తుడైన యముడే ఈ వేషమున వఛ్చినట్లున్నాడు  గ్రద్దరాజైన జటాయువు సీతారాదేవిని అడ్డుకొనుటకు చేసిన సహస  కార్యమును  మనము వినే  ఉన్నాము . ఆ జటాయువు శ్రీరామునికి పరమ ఆప్తుడు ఆ జటాయువే మిక్కిలి అదృష్టవంతుడు . అతనికి మనవలె సుగ్రీవుని బాధ లేకుండాపోయినది . దశరధ మహా రాజు స్వర్గస్తుడగుట జటాయువు మరణించుట సీతాపహరణం మొదలైన సంఘటనలన్ని యావత్ వానర జాతి జీవనమునకు ముప్పు తెచ్చ్చిపెట్టాయి అని పలికెను. 

ఆ మాటలు విన్న సంపాతి "ఓ వానర వీరులారా మీరంతా ఎవరు  దండకారణ్యమున నివసించుచున్న నా తమ్ముడైన జటాయువు పేరుని చాలా కాలం తర్వాత మీ నోటివెంట విన్నాను అసలు జటాయువు వధ  ఎలా జరిగింది పరమ ధార్మికుడు పురుషోత్తముడు దశరధుని పుత్రుడు ఐన శ్రీ రామునితో జటాయువునకు స్నేహం ఎలా కుదిరెను దయ చేసి నాకు తెలపండి ఓ వీరులారా నన్ను ఈ పర్వతమునుండి మీ వద్దకు కిందకు దించండి సూర్య రసామికి నా రెక్కలు కాలి  పోయిన కారణమున  నేను ఎగరలేను అని పలికెను .  

 రామాయణం-కిష్కిందకాండ -ఏబదిఆరవసర్గ 

       శశి ,

ఎం.ఏ ఎం.ఏ ,(తెలుగు),తెలుగుపండితులు . 

No comments:

Post a Comment