Thursday 2 June 2016

రామాయణం-చతుర్దోధ్యాయః

                          రామాయణం-చతుర్దోధ్యాయః  

నారదుడు  పలికెను 

ఓ విప్రోత్తములారా! ఇతర  మాసములలో   రామాయణ  ప్రవచనమును, శ్రవణమును  చేయుట  వలన  కలిగెడి  మహా ఫలితములను  గూర్చి  వివరించెదను. సావధానముగా  వినుడు. తతప్రభావమున  అనంత  పుణ్యము  లభించును.  సమస్థపాపములు   అంతరించును.దుఖములు  అన్నియు  తొలగి  పోవును.  
బ్రాహ్మణులు ,క్షత్రియులు ,వైశ్యులు ,శూద్రులు అట్లే స్త్రీలు వీరందరును రామాయణ శ్రవణము వలన తమ తమ కోరికలు నెరవేర్చుకోనుదు రు . ఇది మహా వ్రత ఫలములను కుగా ప్రసాదించును . ఇది దుస్స్వప్నములను నశింపచేయును . ఇహ ,పర లాభములు సిద్దించును . కనుక రామాయణ మహత్యమును ప్రయత్నపూర్వకముగా వినవలెను . అట్టి వారు అందరు ధన్యులు అవుతారు . ఈ రామాయణ మహాత్య విషయమున విజ్ఞులు ప్రాచీనమైన ఒక ఇథిహాసమును ఉదాహరణగా చెబుతారు . దీనిని పటించు వారి యొక్క వినేది వారి యొక్క సమస్త పాపములు తొలగిపోవును . 
పూర్వకాలమున వింద్యారన్యము నందు కలికుడు అను వేటగాడు నిరంతరము పర స్త్రీ లను ,పరుల ద్రవ్యములను అపహరిస్తూ ఉండేవాడు . ఎల్లపుడు ఇతరులను నిందించుచు ఉండేవాడు . జంతువులను పీడించుట అతనికి వినోదము అతడు వందల కొద్దీ బ్రాహ్మణులను ,వేల కొద్దీ గోవులనుహతమార్చెను . అతడు పరుల సొత్తును అపహరించుటే కాక ప్రతి దినము దేవతల ఆభరణము మొదలైన వాటిని కుడా కాజేయు చు ఉండేవాడు . అతడు చేసేటి మహాపాపములకు నేరములకు అంతే లేకుండా వుండేది . అతడు చేసిన పాపములను లెక్కించుటకు ఎంత కాలమైన చాలదు . మహా  హంతకుడు ఐన అతనిని చుసిన వెంటనే ప్రాణులన్నీ గడ గడ వణికిపోవుచు ఉండేవి . అతడు ఒకానొక సమయమున సౌవీర నగరమునకు చేరెను . ఆ నగరము సకల  ఐశ్వర్యములతో తులతూగుచు ఉండెను . ఆ నగరమన్దలి స్ర్తీలు అమూల్యములు ఐన వస్త్రాభరణములతో శోబిల్లుచు వుండేవారు . అచటి సరస్సులు స్వచ్చములైన జలములతో ఉండెను . అందున్న కొట్లన్నీ చూడ ముచ్చటగా ఉండెను . అమరావతి వంటి ఆ సుందర నగరమున అతడు ప్రవేశించెను . ఆ నగరము లోని ఉద్యానవనముల మద్య ఒక రామ మందిరము కలదు . అది చాలా అందమైనది . ఆ దైవ మందిరము ఫై కల బంగారు కలశములు ధగ ధగ లాడుతూ ఉండెను . దొంగ ఐన ఆ కలికుడు ఆ కలశములను చూసి చాలా సంతోషపడెను . ఆ మందిరం లోని ముత్యములను ,మణులను పొదిగిన బంగారు నగలను చూసి వాటిని అన్నింటిని దొంగాలిమ్పాలని అనుకున్నాడు .
దొంగతనమునకు అలవాటు పడిన ఆ కాలికుడు ధనాశతో ఆ రామ మందిరమున ప్రవేశించెను . అచట అతనికి ఒక విప్రోత్తముడు కనబడెను . అతడు శాంత స్వబావుడు . గొప్ప తత్వవేత్త . 
ఆ బ్రాహ్మణుని పేరు ఉత్తంకుడు . అతడు   మహా తపస్వి దైవ సేవలలో చాలా గొప్పవాడు . పరమ దయాళువు . అతడు అచట ఒంటరిగా వుండి దైవ ద్యానము లో నిమగ్నుడై తనను తాను మరచి ఉండెను . అట్టి స్థితిలో వున్న ఆ బ్రాహ్మణుని కిరాతుడు చూసేను . అర్దరాత్రి వేల దైవ ద్రవ్యమును అపహరించ దలచి తన దొంగతనముకు ఆ విప్రుడు అడ్డు వచ్చునని అనుకుని ఆ మదోన్మత్తుడు కత్తితో ఆ వుత్తంకుని చంపుటకు సిద్దపడెను . అప్పుడు కిరాతుడు ఆ బ్రాహ్మణుని పడవేసి అతని గుండె పై కాలు వేసి తన చేతితో అతని జుట్టును పట్టుకొనెను . తనను చంపుటకు సిద్దపడిన ఆ కలికుడిని చూసి ఉత్తంకుడు అతనితో ఇట్లు అనెను . 

ఉత్తంకుడు పలికెను 

అయ్యా ఓ సాదు నిరపరాధిని అయిన నన్ను నిష్కారణముగా ఎందుకు చంపుతున్నావు . ఓ వ్యక్తీ నేను నీకు ఏమి అపకారము చేసాను ?చెప్పు . అపరాధము చేసిన వారిని లోకములో తప్పక శిక్షిస్తారు . ఓ సౌమ్యుడా సజ్జనులు నిర్దోషిని ఆకారణముగా భాదింపరు . శాంత చిత్తులైన సత్పురుషులు తమ యెడ విరోధ భావమును కలిగెడి మూర్ఖుల యందు సద్గునములనే చూసి వారి పట్ల శత్రు భావమును వహింపరు . 
కూడపెట్టిన సంపదలన్నిటిని బందువులు అందరు ఎల్లకాలము అనుభవించుదురు . తాను చేసిన పాపముల యొక్క ఫలితములను మాత్రము ఆ మనిషి ఒక్కడే అనుభవించును . వారెవ్వరూ ఆ పాప ఫలితములో పాలు పంచుకోరు . 
ఇలా పలికుతున్న ఆ ఋషి పలుకులను అవగాహన చేసుకుని కలికుడు నిజాము తెలుసుకుని బయముతో వణుకుతూ ఆయనను వదిలెను . తరువాత అతడు చేతులు జోడించి స్వామీ నన్ను క్షమించండి అని ఆయనను  పదే పదే వేడుకొనెను . ఉత్తంక మహర్షి యొక్క సాంగత్య ప్రభావము చే ఆ మందిరమున భగవత్ సన్నిదిలో ఉండుట వలన ఆ కలికుడి పాపములన్నీ పఠా పంచలయ్యెను . తర్వాత అతడు మిక్కిలి పశ్చాత్తాపముతో ఆ ఋషితో ఇలా పలికెను . 
ఓ విప్రోత్తమా నేను చేసిన మహా పాప కార్యములకు అంతమే లేదు . నీ దర్శన ప్రభావము చే వాటి నన్నింటి నుండి నేను విముక్తుడను అయ్యాను . నేను అనుదినము పాపములనే ఆచరించుచు చెప్పటానికి వీలులేని మహా అపరాధములకు పూనుకున్నాను . ఇక నాకు విముక్తి ఎలా లభిస్తుంది .ఓ స్వామీ నేను ఇప్పుడు ఎవరిని శరణు వేడను ?పూర్వ జన్మలో చేసిన పాపముల కారణముగా ఈ జన్మలో నేను ఇలా అయ్యాను . ఈ జన్మలో కుడా నేను చేసిన పాపములకు నాకు ఇంకా ఎలాంటి గతి లభిస్తుందో కదా ?మహాత్ముడైన కాలికుడు పలికిన వచనములు వినిన పిమ్మట ఆ ఉత్తంక మహర్షి మరల అతనితో ఇలా అనెను . 
ఓ కలికుడా నీవు ధన్యుడవు నీ భుద్ది నిర్మలమైనది . పదునైనది . కనుక నీవు నీ భుద్ది బలముతో ఈ సంసార దుఖముల నుండి బయట పడు ఉపాయము పొందగలవు . 
చైత్రమాస శుక్ల పక్ష పాడ్యమి మొదలుకుని 9 దినములు భక్తి శ్రద్దలతో రామాయణ గాధ వినవలెను . ఎవ్వరైనా ఈ గాధను వినినంత మాత్రమునే సకల పాపముల నుండి విముక్తులు అగుదురు . 
పాపరహితుడైన కలికుడు ఆ   క్షణము నందే రామాయణ వృత్తాంతమును వినెను . తరువాత అతడు తనువు చాలించెను . 
జాలి గుండె కలవాడగు వుత్తంకుడు నేలకొరిగిన ఆ కలికుడిని చూసి ,విశ్మయము చెంది శ్రీ మహా విష్ణువును స్తుతించెను . 
రామాయణ కదా శ్రవణము తో పాప రహితుడైన కలికుడు దివ్య విమానమును ఎక్కి ఉత్తంక మహర్షి తో ఇలా చెప్పెను . 

కలికుడు పలికెను 

దీక్ష తో వ్రతములను ఆచరించినా ఓ ఉత్తంక మహా మునీ నా పరమ గురువువు నీవే . నీ అనుగ్రహము వలనే మహా పాతక ప్రమాదములనుండి నేను విముక్తుడను అయ్యాను . ఓ మునీశ్వరా నీ ఉపదేశము వలెనే నాలో కనువిప్పు కలిగింది . అందువలన నేను చేసిన మహా పాపములన్నీ అతి తొందరగా అంతరించి పోయాయి . 
ఓ మునీ రామాయణ వృత్తాంతమును విని దాని మహిమచే మమకార భందములనుండి బయట పడ్డాను . మీ కృప చే ఆ కదా ప్రభావము వలన విష్ణు ధామమైన పరమ పదమునకు వెళ్ళుతున్నాను . 
ఓ గురు దేవా నీవు దయా సముద్రుడవు నీ వలననే నేను క్రుతార్దుడను అయ్యాను . ఓ తత్వజ్ఞాని అందువలన నేను నీకు పాదాభి వందనము ఒనర్చు చున్నాను . నా తప్పులను మన్నింపుము . 

సూతుడు పలికెను 

ఇట్లు పలికిన పిదప ఆ కాలికుడు దివ్య కుసుమములతో ఆ ఉత్తంక మునికి పుష్పాభిషేకము చేసెను . అనంతరము అతడు గురువునకు 3 సార్లు ప్రదక్షణ పూర్వకముగా నమస్కరించెను . 
అనంతరము అతడు ఆ దివ్య విమానమును ఎక్కి సకల భోగ శుభములకు నేలవైనది ,అప్సరసలతో విలసిల్లునది అయిన పరందామమునకు చేరెను . 
ఓ విప్రులారా వినుడు అందువలన చైత్రమాస శుక్ల పక్షమునందు దీక్షతో రామాయణ కదా శ్రవణము చేయవలెను . హరి భక్తి కలవాడు సంపూర్ణముగా ఇహ పర లాభములను కలుగ జేయు రామాయణ కధామ్రుతమును 9 రోజులు దీక్షతో అన్ని ఋతువుల లో తనివి తీరా గ్రోలవలెను . 
ఈ కధామ్రుతమును శ్రవణము ,పఠణము చేసిన వారి కోరికలు అన్నీ తప్పక నెరవేరును . సనత్కుమారాదులు అడిగిన విషయములు అన్నింటిని సమగ్రముగా వివరించితిని . మహిమాన్వితమైన ఈ రామాయణమును కాదని వేరే గాధను వినుటకు ఎలా ప్రయత్నిస్తారు . ?

ఇతి చాతుర్దాద్యాయః సమాప్తః 

                         శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు 











 

























No comments:

Post a Comment