Sunday 5 June 2016

రామాయణము బాలకాండ - మొదటి సర్గ

                        రామాయణము 

                బాలకాండ  - మొదటి సర్గ 

అయోధ్యకు శ్రీ రాముని తీసుకురావలననే తన లక్ష్యము నెరవేరకపోయినా ,భరతుడు రాజ ప్రతినిధిగా రామ పాదుకలను సింహాసనం పై ప్రతిష్టించి ,వాటిని సేవించుచు నంది అను గ్రామముననే వుండి ,రామునకై ఎదురు చూస్తూ రాజ్యపాలన చేస్తూ ఉండెను . 
భరతుడు అయోధ్యకు తిరిగి వెళ్ళిన పిదప ,సత్యసంధనుడు ,జితేంద్రియుడు ఐన శ్రీ రాముడు తన దర్శనముకై రోజు పౌరులు జానపదులు అచటికి వచ్చుట చూసి ,ఆ కారణం గా అక్కడి మునుల తపశ్చర్యలకు ఆటంకమును ఏర్పడునని భావించెను . పిమ్మట అతడు దండకారణ్యము చేరుటకు నిశ్చయించుకొనెను . సావధానముగా సీతా రామ లక్ష్మణులు దండకారణ్యము చేరెను . 

దండక వనమునకు ప్రవేశించిన పిమ్మట రాజీవలోచనుడు అయిన శ్రీరాముడు "విరాధుడు "అను రాక్షసుని చంపెను . శరభంగ మహర్షిని ,సుతీక్ష్ణుని ,అగస్త్యమునిని ,ఆయన సోదరుని దర్శించెను . 
శ్రీ రాముడు అగస్త్యాదేశానుసారం ఆయన వద్ద నుండి ఇంద్ర చాపము ఖడ్గము ,అక్షయములైన బాణములు గల తుణీరములు స్వీకరించెను . 
వనవాసులతో కూడి ,సీతా లక్ష్మణులతో రాముడు దండకారన్యమున నివసించుచుండగా పరిసరములలో ఉన్న ఋషులు అందరు తమను భాదించుచున్న రాక్షసులను వధింపు ము అని కోరుటకు శ్రీ రాముని వద్దకు వచ్చిరి . 
శ్రీ రాముడు ఆ ఋషుల ప్రార్ధనలను ఆలకించి "ఈ వనములలోని రాక్షసులను అందరిని మట్టు  పెట్టెదను "అని ప్రమాణము చేసెను . ఆ దండకారణ్యం లో శుర్పనఖ అను రాక్షసి నివసించుచు ఉండెను . శ్రీ రాముడు లకష్మణుడి చే ఆ రాక్షసి ముక్కు చెవులు కోయించి ఆమెని వికృతిని కావించెను . 
అనంతరము శూర్పనఖ చే రెచ్చ గొట్టబడిన ఖరుడు ,దూషణుడు ,త్రిశురుడు అను రాక్షస ప్రముఖులు అసంఖ్యాక రాక్షసులతో కలసి శ్రీ రాముడి మీదకు యుద్దమునకు వచ్చెను . అంత శ్రీ రాముడు ఒక్కడే జన స్థాన నివాసులు ఐన 14000 రాక్షస యోదులను ఖర దూషణ ,త్రిశురలను యొద్ద భూమిలో మట్టి కరిపించెను . 
రావణుడు తన దాయాదులైన ఖర ,దూషణ ,త్రిశురలను శ్రీ రాముడు చంపిన వార్తను శూర్పనఖ ద్వారా విని క్రొదముతో  ఉడికి పోయెను . పిమ్మట అతడు మారీచుడు అను రాక్షసుడి వద్దకు వెళ్లి అతని సహాయమును అర్ధించెను . 

అప్పుడు మారీచుడు "శ్రీ రాముడు నీకన్నా భలవంతుడు అంతటి వానితో నీకు విరోధము తగదు "అని చెప్పి అనేక విధములుగా రావణునికి నచ్చచేప్పుటుకు ప్రయత్నించెను . వాని హెచ్చరికలు పెడచెవిన పెట్టి ,ఆయువు మూడిన రావణుడు మారీచుని వెంట పెట్టుకుని శ్రీ రాముని ఆశ్రమసమీపమునకు చేరెను . 
పిమ్మట రావణుడు మాయావి అయిన మారీచుని సహకారముతో రామ లక్ష్మణులను ఆశ్రమము నుండి దూరముగా పంపి సీత ను అపహరించుకు పోయెను . దారిలో తనకు అడ్డు తగిలిన జటాయువు ను తీవ్రముగా గాయపరిచెను . పిమ్మట శ్రీ రాముడు సీతను వెతుకుతూ ప్రాణ అవసాన దశలో ఉన్న జటాయువును చూసేను . ఆ గ్రుధము సీతను అపహరించుకు పోయిన వార్తను తెలిపి రామ పాద సన్నిదిలో ప్రాణము విడిచెను . శ్రీ రాముడు జటాయువుకు అంత్య సంస్కారములు నిర్వహించెను . 


                  శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు 










No comments:

Post a Comment