Friday 3 June 2016

రామాయణం పంచమాధ్యాయః

             రామాయణం  పంచమాధ్యాయః 

సూతుడు పలికెను 

శ్రీ మద్రామాయణ మహత్యమును విని ,సనత్కుమార మహా ముని ఎంతయు సంత్రుప్తుడాయెను . పిమ్మట అతడు నారద మహర్షిని ఇంకను ఇట్లు ప్రశ్నించెను . 

సనత్కుమారుడు పలికెను 

ఓ దేవర్షీ మీరు రామాయణ మహత్యమును దయతో మాకు విశదీకరించి యుంటిరి . ఇప్పుడు శ్రీ రామాయణ పారాయణ విధానమును వినకోరుచున్నాము . ఓ మహానుభావా !మీరు తత్వార్ధములను వివరించుటలో సర్వ సమర్ధులు . కనుక మాయందు అనుగ్రహముతో  విశేషములను సమగ్రముగా వివరింప ప్రార్ధన . 

నారదుడు పలికెను 

ఓ మహర్షులైన !రామాయణ పారాయణాది విధి విధానములను చక్కగా వివరింతును . సావధానముగా వినుడు . ఇది స్వర్గ సుఖ లాభాములకును ,మోక్ష ప్రాప్తికిని పరమ సాధనము ,పారాయణ పద్దతిని తెలిపెదను . శ్రద్దగా ఆలకిమ్పుడు . దీనిని మిక్కిలి శ్రద్దలతో అనుష్టించుట ఎంతేని ముఖ్యము . 
ఈ పారాయణాది విధులను ఆచరించిన వారి యొక్క వివిధములగు పాపములు అన్నియు పూర్తిగా నశించును . ఈ అనుష్టానమును చైథ్రమాసమున కాని ,కార్తీక మాసము నందు కాని ,మాఘ మాసమున కాని శుక్ల పక్షము నందలి పంచమి నుండి అయినా ప్రారంభించవచ్చు . స్వస్తి వచన పూర్వకముగా ఈ కార్యక్రమమును 9 దినములు దీక్షతో చేయవలెను . 
"ఓ రామా !నేటి నుండి ప్రతి దినము నీ కధామ్రుతము ను  భక్తి శ్రద్దలతో గ్రోలెదను . రామాయణ పారాయణ ,కదా శ్రవణ పూర్వకమైన ఈ నవరాత్ర దీక్ష నిర్విగ్నముగా నెరవేరునట్లు అనుగ్రహింపుము "అని భగవంతుడిని ప్రార్ధింప వలెను . 
ప్రతి దినము ఉషః కాలముననే మేల్కొని ,ఉత్తరేనుపుల్లలతో దంత శుద్ధి చేసుకుని ,స్నానాదికములను ముగించుకునవలయును . పిమ్మట రామ బక్తి తత్పరులై అనుష్టానమునకు సిద్దము కావలెను . అనంతరము సంయమనము (ఓర్పు )తో ఏకాగ్రత వహించి భందు మిత్రుల తో కూడి రామ వృత్తాంతమును వినవలెను . 
ఇట్లే ప్రతి దినము సంప్రదాయానుసారము స్నానాది కృత్యములను ముగించుకుని ,శుబ్ర వస్త్రములను ధరించి పవిత్ర భావనముతో మౌనముగా ఇంటికి చేరవలెను . పిదప పాద ప్రక్షాళనము ఒనర్చుకుని ఆచమించి జగద్రక్షకుడు ఐన శ్రీ మన్నారాయణ ని స్మరింప వలెను . 
తర్వాత నిత్య దేవార్చనను ముగించుకుని సంకల్ప పూర్వకముగా శ్రీ మద్రామాయణ గ్రంధమును భక్తి శ్రద్ధలతో పూజింప వలెను . 
వ్రత దీక్షను వహించి ఆవాహన ఆసన ,అభిషేక ,గంధ పుష్పాలతో ,ఓం నమో నారాయణాయ అను మంత్రమును పటిన్చుచు ,స్వామికి భక్తితో షోడసోపచారములను చేయవలెను . 
భక్తి శ్రద్దలు కలవారు ఈ పూజాదికములకు అనుభందముగా ఒక పర్యాయము కాని రెండు పర్యాయములు కాని శక్తిని అనుసరించి మూడు పర్యాయములు కాని హోమ కార్యములను నిర్వర్తింప వలెను . దీక్షతో అట్లు హోమములను చేసినచో వారి పాపములన్నీ తొలగిపోవును . 
ఇట్లు రామాయణ పారాయనాది విధులను సావధానులై ఆచరించిన వారు దైవానుగ్రహమునకు పాత్రులై వారు పరమ పదమునకు చేరెదరు . వారికి ముక్తి కలుగుతుంది . 
చండాలురు ,పతితులు, వైదిక ధర్మములను మర్యాదలను నిందిన్చునట్టి నాస్తికులు ,దుర్భాషలాడువారు మొదలగు వారిని గూర్చి రామాయణ వ్రత దీక్షలో వున్నధర్మ నిరతులు మాట వరసకు ఐనను ఏమాత్రము ప్రస్తావింప రాదు . ఇట్లు అన్నివిధములుగా పవిత్రుడై పురుషుడు ఎల్లరుకును హితము కోరే వాడై శ్రీమద్రామాయణము నందు చక్కని శ్రద్దాధారములను కలిగి ఉన్నచో అట్టి వానికి ఐహిక సుఖలాభాములే కాక చివరకు మోక్షము కలుగును . గంగా జలము వలె పవిత్రమైన తీర్ధము తల్లితో సమానమగు గురువు , విష్ణువు తో సమానమగు దైవము రామాయణము కంటే పవిత్రమైన గ్రంధము లేవు . 
ఈ రామాయణ్ కధామ్రుతమును గ్రోలిన వారి పాపములు పటాపంచలు అగును . 
జితేన్ద్రియుడై వ్రత దీక్షతో రెండు సార్లు కదా శ్రవణము చేసిన వారికి పుండరీక యాగము చేసిన ఫలము లభించును . 
ఓ మునీశ్వరులారా ఈ కధాశ్రవనము4 సార్లు చేసిన వారికి 2 సార్లు అశ్వమేధ యజ్ఞము చేసిన ఫలము లభించును . శ్రీ రామ వృత్తాంతము 5 సార్లు విన్న మహాత్మునకు అగ్నిష్టోమ యాగ ఫలమునకు 8 రెట్లు పుణ్య లాభములు కలుగును . ఏకాగ్ర చిత్తముతో వ్రత నియమములను పాటించుచు  6 సార్లు ఈ కదా శ్రవణము చేసిన వారికి 2 సార్లు అత్యుత్తమ యాగం ఆచరించిన ఫలము రెండు రెట్లు లభించును . ధర్మాత్ముడై వ్రత దీక్షను పూని 7 సార్లు కదా శ్రవణము చేసిన పురుషునకు అగ్నిష్టోమము 8 సార్లు చేసిన ఫలము లభించును . 
ఓ మునీశ్వరులారా స్త్రీ పురుషులలో ఎవరైనను 8 సార్లు ఈ రామ గాధను శ్రద్దగా విన్న చొ వారికి అశ్వమేధ పలమునకు 8 రెట్లు ఫలము లభించును . 
మానవుడు ఈ రామాయణము నందలి ఒక్క శ్లోకమును కాని శ్లోకములోని సగ భాగమును కాని భక్తి శ్రద్దలతో పటించినచో అతడు తన స్వరూపములనుండి వెంటనే విముక్తుడు అగును . 
అత్యంత రహస్యమైన ఈ వృత్తాంతమును ఆ విశేషములను పుణ్య క్షేత్రమున కాని సత్పురుషుల సమక్షములో కాని రామ భక్తి తత్పరులై పూనికతో ప్రవచింప వలెను . 
అతి పవిత్రమైన ఈ రామాయణమును బ్రాహ్మణులను ద్వేషించు వారికి ,దంభాచారులకు ,దొంగ జపము చేయు వారికి వుపదేశింప రాదు . 
శ్రీ రాముడు సకల దేవతలకు అధినాధుడు ఆ దయా మయుని స్మరించినంత మాథ్రమునె ఆర్తుల దుఖములు మాయమగును . అతడు పతిత పావనుడు . పరమ భక్తులకు దయానిధి . అనన్య భక్తితో మాత్రమే ఆయన అనుగ్రహము లభించును . భాగావన్నామమును అప్రయత్నముగా అయినా కీర్తిన్చించో స్మరించినచో ఆవ్యక్తి యొక్క పాపములన్నీ అంతరించి పోవుటే కాక అతనికి పరమ పదము కుడా లభించును . 
 శ్రీ రాముని యందు రామాయణ కావ్యము నందు భక్తి విశ్వాసములు కలికి ప్రీతీ కలవాది నిజముగా చరితార్ధుడే . వాస్తవముగా అతడు సర్వ శాస్థ్రార్ధముల అందు ఆరితేరిన వాడు 
 ఓ ద్విజులారా ఈ ఘోరమైన కలియుగమున రామాయణ కదా శ్రవణము నందు ఆధారాభిమానములు కలవారు రామ నామమును జపించుట అ అందే నిరతులైన వారు మాత్రమే సఫలీకృతులు అగుదురు . వారి జన్మమే సఫలము . 

   సూతుడు పలికెను 

మహాతుడైన నారదుని నుండి చక్కని ఈ ప్రభోదనమును పొందిన వెంటనే సనత్కుమారుడు పరమానందభరుతుడు అయ్యెను . 
కనుక ఓ విప్రోత్తములారా రామాయణ కధామ్రుతమును గ్రోలినచో ప్రతి వ్యక్తియు పరమపదమును పొందును . 
కావున ఓ ద్విజోత్తములారా !పాపములను రూపుమాపునట్టి రామాయణ కధామ్రుతమును వరుసగా 9 దినములు పటించుట ఎంతేని యుక్తము . 
ఘోరమైన కలియుగమున జన్మించినవారు రామాయణము నందు నిరతులైన చొ వారు సమస్త పాపముల నుండి విముక్తులు అగుటయే కాక కడకు కైవల్యమును పొందుతారు . 
ఓ బ్రాహ్మనోత్తములారా మహిమాన్వితమైన ఈ రామాయణ మహా కావ్యమును వినిన పిదప ప్రవచనము చేసిన సజ్జనుని భక్తి శ్రద్దలతో పూజింప వలెను . అట్టి వారికి శ్రీ మహా విష్ణువు ప్రసన్నుడై సకల ఐస్వర్యములను అనుగ్రహించును . ఈ విధముగా రామాయణ ప్రవచనము చేసిన సత్పురుషుని సంతోష పెట్టినచో బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వరులు సైతము ప్రసన్నులు అగుదురు . ఇందు సందేహమునకు తావు లేదు . 
రామాయణ ప్రవచనము చేసిన వారికి గోవులను వస్త్రములను ,సువర్ణ ఆభరణములను ,రామాయణ కావ్యమును యదా శక్తి సమర్పింప వలెను . అట్లు చేసిన వారికి ప్రాప్తించే ఫలము గూర్చి వివరించెదను . సావధానులై వినుడు .  ఆ సత్పురుషుని పూజించిన వారిని భూత భేతాలాది దుష్ట శక్తులు కాని అరిష్ట స్థానముల లో వున్న గ్రహములు కాని భాదిన్చవు . 
శ్రీ రామ చరితమును విన్న వారికి సకల శ్రేయస్సులు చేకురును . అట్టి సత్పురుషులకు అగ్ని భాదలు కాని ,దొంగ భయములు కాని వుండవు . పూర్వ జన్మలలో చేసుకొనిన సమస్త పాపములనుండి వారికి వెంటనే విముక్తి లభించును . మరియు మరణానంతరము వారికి మోక్షము కుడా లభించును . అంతే కాక వారి వంశమునకు చెందిన 7 తరముల వారు తరింతురు . లోగడ శాంతకుమార మహర్షి అడుగగా నారద మహా ముని చెప్పిన విశేషములను అన్నింటిని నేను మీకు వివరించితిని . శ్రీమద్రామాయణము సంస్కృత వాజ్మయమునకే శ్రీకారము చుట్టిన ఆది కావ్యము ఇందు సర్వ వేదార్ధములు ప్రతిపాదింప బడినవి . ఇది నానా విధములైన పాపములను అంతరింప చేయగల పవిత్ర గ్రంధము . దీనిని పటించినను ,విన్ననూ వారి దుఖములన్నియు తొలగిపోవును . 

ఇతి పంచమాధ్యాయః సమాప్తః 


                     శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు 






 























No comments:

Post a Comment