Sunday 5 June 2016

                      రామాయణం 

                             బాల కాండము -మొదటి సర్గము 

తపశ్శీలుడు ,వేదాధ్యయ నిరతుడు ,వాక్చతురతలో గొప్పవాడు ,ముని శేకరుడు ,ఐన నారదుని గొప్ప తపస్వి అయిన వాల్మీకి మహర్షి జిజ్ఞాశ తో ఇలా ప్రశ్నించెను . 
"ఓ మహర్షీ !సకల సద్గుణ సంపన్నుడు ,ఎత్తి పరిస్థితులలో తొణకనివాడు ,లౌకిక అలౌకిక ధర్మములను తెలిసినవాడు ,ఎత్తి క్లిష్ట పరిస్థితులలో ఆడి  తప్పనివాడు ,నిశ్చలమైన సంకల్పము కలవాడు అగు పురుషుడు ఇప్పుడు ఈ భూమండలమున ఎవడు వున్నాడు . 
సదాచార సంపన్నుడు ,సకల ప్రాణులకు మంచి చేయువాడు ,సకల శాస్త్రములుతెలిసినవాడు ,సర్వ కార్య దురంధరుడు ,తన దర్శనము చే అందరికి సంతోషము కలుగ చేయువాడు ఐన మహాపురుషుడు ఎవడు వున్నాడు . 
దైర్య శాలి ,కోపమును జయించినవాడు ,ఎవ్వరిపైన అసూయ లేనివాడు ,రణరంగమున దేవాసురులను సైతము భయ కంపితులను చేయువాడు ఎవడు "?
ఈ విషయములు గురించి తెలుసుకోవాలని నేను మిక్కిలి కుతూహల పడుతున్నాను . ఓ మహర్షీ మీరు సర్వజ్ఞులు ,ఇటువంటి మహా పురుషుని గురించి తెలుపగల సమర్ధులు మీరే . 
త్రిలోకజ్ఞుడైన నారదుడు వాల్మీకి మాటలు విని సంతోషించి అతడు "ఓ మహర్షి సరే వినుము "అని ఇలా చెప్పెను . 
"ఓ మునీ !నీవు చెప్పిన బహువిధములైన గొప్ప గుణములు అన్నీ సాధారనముగా ఒక్కరిలోనే ఉండుట అసాధ్యము . ఐనను బాగా గుర్తుకు తెచ్చుకుని ,అట్టి గుణములు కల ఉత్తమ పురుషుని గురించి చెబుతాను వినుము . 
ఇక్ష్వాకు వంశము మిక్కిలి పేరు పొందిన వంశము . ఆ వంశములో లోకోత్తర పురుషుడు ఐన శ్రీ రాముడు జన్మించి జగత్ప్రసిద్దుడు  అతడు మనో నిగ్రహము కలవాడు ,గొప్ప పరాక్రమమవంతుడు ,మహా తేజస్వి ,దైర్యశాలి ,జితేంద్రియుడు ,ప్రతిభామూర్తి ,నీతి శాస్త్ర కుశలుడు ,చిరునవ్వుతో మితముగా మాట్లాడడం లో నేర్పరి . శత్రువులను సంహరించువాడు ,ఎత్తైన భుజములు కలవాడు ,బలిష్టమైన భాహువులు కలవాడు ,శంకము వలె నునుపైన కంటము కలవాడు ,ఉన్నతమైన హనువులు (చెక్కిలి పైభాగము )కలవాడు ,విశాలమైన వక్షస్థలము కలవాడు ,బలమైన ధనస్సు కలవాడు ,పుష్టిగా గూడముగా ఉన్న సంధి ఎముకలు కలవాడు ,అంతః శత్రువులను అదుపు చేయగలవాడు ,ఆజానుభాహుడు ,అందమైన గుండ్రని శిరస్సు కలవాడు ,అర్ధచంద్రాకారములొ ఎత్తైన నొసలు కలవాడు ,గజాదులకు వాలే గంభీరమైన నడక కలవాడు . 
శ్రీ రాముడు అంత పొడుగుగా కాని అంత పొట్టిగా కాని లేక సమానమైన దేహము కలవాడు . కనువిందు కావించు దేహ కాంతి కలవాడు . ధర్మమును స్వయముగా ఆచరించుచు లోకులచే ఆచరింప చేయుచు దానిని కాపాడువాడు . స్వధర్మమును పాటించువాడు . తనను ఆశ్రయించిన వారు ఎవరైనను ఎత్తి వారైనను వారిని రక్షించువాడు . వేదవేదాన్గముల పరమార్ధము తెలిసినవాడు . యుద్ద విద్యనందు  ఆరితేరినవాడు శాస్త్రాది విషయములనందు ఏమరపాటు లేనివాడు . సమస్త వ్యవహారములనందు చక్కని స్ఫూర్తి కలవాడు . సకల జనులకు ప్రీతిపాత్రుడు . సౌమ్య స్వభావము కలవాడు . వుదార స్వరూపుడు . సదసద్వివేక సంపన్నుడు . 

నదులు సముద్రము నందు కలిసినట్లు సత్పురుషులు నిరంతరము శ్రీరాముని చేరుచుందురు . అతడు అందరికిని పూజ్యుడు . ఎవ్వరి అందు విరోధముగాని ,తారతమ్యములు కాని లేనివాడు . కౌసల్యా నందనుడు ఐన శ్రీరాముడు సర్వ సద్గుణ విలసితుడు . అతడు సముద్రము వలె గంభీరుడు . దైర్యమున హిమవంతుడు ,పరాక్రమమున మహా విష్ణువు ,చంద్రుడి వలె ఆహ్లాదకరుడు ,సుతిమెత్తని హృదయము కలవాడు అయినను తనను నమ్ముకున్న వారి కి అపకారము చేసే వారి పట్ల ప్రలయగ్ని వంటివాడు . సహనమున భూదేవి వంటివాడు . కుభేరుని వలె త్యాగ స్వభావము కలవాడు . సత్యపాలనలో ధర్మ దేవత వంటి వాడు . 
అమోఘ పరాక్రమ శాలి ఐన శ్రీరాముడు ఇట్టి సద్గుణము లతో విలసిల్లువాడు . సోదరులలో పెద్దవాడు . దశరదుడికిప్రియ పుత్రుడు . ప్రజలకు హితము కూర్చువాడు . అట్టి సకల గుణాభిరాముడు అయిన శ్రీ రామచంద్రుని తన మంతుల విజ్ఞప్తి మేరకు ప్రజల క్షేమము కోరి దశరదుడు  మీకిలి సంతోషముతో యువరాజుగా పటాభిషేకము చేయుటకు సిద్దపడెను . 
శ్రీ రాముని యువరాజు పట్టాభిషేక ముకై జరుగుతున్న ఏర్పాట్లను దశరదుడి ప్రియ భార్య అయిన కైక తన ప్రియ దాసీ (మందర )ద్వారా తెలుసుకొనెను . పూర్వము
(శంభారాసురుని జయించిన సందర్భములో )దశరదుడు ఆమెకు రెండు వరములను ఇచ్చాడు . రాముని వనమునకు పంపమని ,భరతుడిని రాజుని చేయమని ఆ వరములను ఇప్పుడు ఆమె కోరెను .
సత్య సంధనుడు అయిన ఆ దశరద మహారాజు ధర్మమునకు కట్టుబడి ,ప్రియ తనయుడు అయిన శ్రీ రాముని వనములకు పంపవలసి వచ్చెను . వీరుడైన శ్రీ రాముడు పిత్రు వాక్య పరిపాలనకు వనములకు బయలుదేరెను . 
సుమిత్రా సుతుడు అయిన లక్ష్మణుడు శ్రీ రామునకు ప్రియ సోదరుడు ,మిక్కిలి వినయ సంపన్నుడు ,రాముని అందు భక్తి తత్పరుడు ,అన్న అడవులకు బయలుదేచుండగా లక్ష్మణుడు ఆయనను అనుసరించెను . 
జనక వంశమున పుట్టిన సీతా దేవి శ్రీ రామునకు ధర్మపత్ని ఆమెపై ఆయనకు ప్రేమ అపారము ,ప్రాణ సమానురాలు ,అపూర్వ సౌందర్యము కలది ,సర్వ సుభ లక్షణ శోభిత ,దశరుదుని కోడలు ,స్త్రీలలో ఉత్తమురాలు ఆమెయు శ్రీ రాముని అనుసరించి వనములకు వెళ్ళెను . 
దశరదుడు ద్వారము వరకు వారిని అనుసరించెను . పౌరులు వారిని చాలా దూరము అనుసరించిరి . ధర్మాత్ముడైన శ్రీ రాముడు గంగా నదీ తీరములో కల శృంగభేరి  పురమున తన భక్తుడు ,నిషాద రాజు అయిన గుహుని కలిసెను . పిమ్మట రాధా సారధిని వెనకకు పంపి వేసెను . శ్రీ రాముడు సీతా లక్ష్మణులతో ,గుహునితో కూడి వనములలో ముందుకు వెళ్తూ గుహుని సాయముతో జల సమృద్ది కల గంగా నదిని దాటెను . పిమ్మట భరద్వాజ మహర్షి ఆదేశము ప్రకారము మందాకినీ నదీ తీరమున కల చిత్ర కూటమును చేరెను . అక్కడ చక్కని పర్ణశాలను నిర్మించుకుని ఆ ముగ్గురు సుఖముగా ప్రశాంతముగా నివశించ సాగిరి . 

సీతారామ లక్ష్మణులు చిత్రకూటమును చేరగా దశరద మహా రాజు పుత్ర వియోగ శోకము కారణముగా విలపించుచు స్వర్గాస్తుడయ్యేను . 
దశరదుడు  పిమ్మట వశిష్టుడు మొదలగు భ్రాహ్మనోత్తములు రాజ్యాధికారమును స్వీకరిమ్పమని భరతుని కోరిరి . అందులకు ఆ మహా వీరు అంగీకరింపక రాజ్యా కాంక్ష లేక పూజ్యుడైన రాముని అనుగ్రహమును పోనాడ కోరినవారై వనములకు బయలుదేరెను . ప్రసన్నహ్రుదయుదు ,సత్య సందుడు అయిన శ్రీ రాముని వద్దకు వెళ్లి భరతుడు పూజ్య భావముతో ఓ ధర్మజ్ఞా జేష్టుడవు శ్రేష్టుడవు అయిన అయోధ్యకు రాజు కాదగిన వాడవు . అని పలుకుచు శ్రీ రాముని వేడుకొనెను . మిక్కిలి  ప్రస్సున్నుడు అయిన శ్రీరాముడు తమ్ముని ప్రార్ధన మన్నిన్చువాడే అయినప్పటికీ తండ్రి ఆదేశమును అనుసరించి రాజ్యాధికారమును చేపట్టుటకు ఇష్టపడలేదు . అనంతరము రాముడు తనకు ప్రతినిధిగా తన పాడుకులను భరతునకు ఇచ్చి పలు విధములుగా నచ్చచెప్పి అతనిని అయోధ్యకు పంపెను . 

                     శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు 

 
















 

No comments:

Post a Comment