Sunday 5 June 2016

రామాయణము బాల కాండము -మొదటి సర్గము

                      రామాయణము 

                  బాల కాండము -మొదటి సర్గము 

శ్రీ రాముడు సీతా దేవి కై అడవులలో వెతుకుచు కభందుడు అను పేరు గల రాక్షసుడిని చూసేను . అతడు విక్రుతాకారముతో భయంకరముగా ఉండెను . శ్రీ రాముడు ప్రాణులను హింసించు చు ఉన్న ఆ దానవుడిని హతమార్చి ,అతని కోరిక మేరకు ఆ కళేబరమును దహనము చేసెను . ఫలితముగా ఆ దానవుడికి స్వర్గలోక ప్రాప్తి కలిగెను . 
శాప విముక్తుడైన కభందుడు దివ్య రూపములో స్వర్గమునకు వెళ్ళునపుడు ఆకాశమున కొంత తడవ ఆగి ,శ్రీ రాముడితో "ఓ రామా ఈ సమీపముననే నీ భక్తురాలైన శబరి కలదు .  సన్యాసిని నీవు ఆ శబరి వద్దకు వెళ్ళుము . "అని పలికెను . 
శత్రువులను రూపుమాపువాడు ,మహా తేజశ్శాలి అయిన శ్రీ రాముడు శబరీ దగ్గరకు వెళ్ళెను . శబరీ భక్తి శ్రద్దలతో కొసరి కొసరి ఫలములను అర్పించి ,ఆయనను పూజించెను . 






పంపా సరస్సు తీరమున శ్రీ రాముడు వానరుడైన హనుమంతుని కలుసుకొనెను .



 ఆ వానరోత్తముని సూచన అనుసరించి రాముడు సుగ్రీవుని వద్దకు వెళ్ళెను . మహా వీరుడైన శ్రీ రాముడు సుగ్రీవునికు తన వృత్తాంతమును అంతయు తెలిపెను . మఱియు సీతాపహరణ గాదను కూడా ఆయనకు పూర్తిగా వివరించెను . 
సుగ్రీవుడు శ్రీ రాముడు చెప్పిన విశేషములను అన్నిటిని వినెను . శ్రీ రాముని సహకారము వలన తనకు ప్రయోజనము కలుగునని భావించి ,అతడు అగ్ని సాక్షిగా స్నేహము కుదుర్చుకొనెను . పిమ్మట సుగ్రీవుడు దుఃఖితుడై ఉండుట గమనించిన శ్రీ రాముడు ఏమైనది అని అడుగగా అప్పుడు సుగ్రీవుడు మొదట వాలికి తనపై గల ప్రేమను ,పిదప వాలికి తనతో ఏర్పడిన వైరమును అంతా రామునికి మిక్కిలి దుఃఖముతో తెలిపెను . 
రాముడు వాలిని వధిస్థానని ప్రతిజ్ఞ చేసెను . పిమ్మట సుగ్రీవుడు వాలి బల పరాక్రమముల గురించి వివరించెను . వాలిని హతమార్చుటకు శ్రీ రాముడి బల పరాక్రమముల విషయములో సందేహము కలిగెను . ఆయన బల పరాక్రమములు తెలుసుకొనుటకు వాలి చే హతుడైన దుంధుబి అను రాక్షస కళేబరమును సుగ్రీవుడు శ్రీ రాముడికి చూపెను . మహా పర్వథములా ఉన్న ఆ అస్తిపంజరమును చూసి ,మహా భాహువైన రాముడు ఒక చిరు నవ్వు నవ్వి ఇంతేనా అని దానిని తన బ్రొటన వేలితో అవలీలగా విసిరివేసెను . అప్పుడు ఆ కళేబరము 10 యోజనముల దూరములో పడెను . 

సుగ్రీవునకు పూర్తిగా విశ్వాసము కలిగించుటకు రాముడు ప్రయోగించిన బాణము రివ్వున సాగి ,వరసగా ఉన్న 7 మద్ది చెట్లను ఆ సమీపమునే ఉన్న ఒక పర్వతమును ,రసాతలమును భేదించి అదే వేగముతో వచ్చి ఆయన తునీరమున చేరెను . 
అప్పుడు సుగ్రీవుడు లోకోత్తరమైన శ్రీ రాముని పరాక్రమమును చూసి ,ఎంతో సంతోషించెను . సుగ్రీవునకు అతని పరాక్రమము పై పూర్తి నమ్మకము కలిగెను . పిమ్మట అతడు రాముడితో కూడి కొండల మద్య గుహ వాలే ఉన్న కిష్కిందను చేరెను . కపి శ్రేష్టుడు అయిన సుగ్రీవుడు బిగ్గరగా అరిచేను . ఆ మహా నాదము విని వానర ప్రభువైన వాలి తన గృహము నుండి బయటకు వచ్చెను . "సుగ్రీవుడితో యుద్దము చేయుటకు వెళ్ళవద్దు "అని వారించుచున్న తారను సమాధానపరచి ,వాలి సుగ్రీవుడితో తలపడెను . అప్పుడు రాఘవుడు వాలిని ఒకే ఒక్క భాణము తో వధించెను . పిమ్మట శ్రీ రాముడు సుగ్రీవుని కిష్కిందకు రాజుగా చేసెను . 


                  శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 









No comments:

Post a Comment