Monday 11 May 2020

రామాయణము ఉత్తరకాండ ---------రెండవసర్గ

                                          రామాయణము 

                                               ఉత్తరకాండ ---------రెండవసర్గ 

శ్రీ రాముడు ఆ  విధముగా అడుగగా  అగస్త్య మహాముని  ఆ ప్రభువుతో"  రామా ! తేజోభాల మహిహుడైన ఆ ఇంద్రజిత్తు యొక్క  వృత్తాన్తమును  గూర్చి  వివరించెదను వినుము అతడు  తన శక్తీ సామర్ధ్యముల చే  అనే క  మందిని శత్రువులను  సంహరించెను .  సాదారణముగా  ఎంతటి శత్రువులైన  అతన్ని వధింపలేరు  రామా! ముందుగా  రావణుని  వంశ క్రమము  అతని పుట్టు  పూర్వోత్తరాలు , అతనికి వారములు లభించిన  విధము వివరించెదను . శ్రద్దగా వినుము . 
ఇది  కృతయుగము నాటికథ  పూర్వము  పులస్త్యుడు అను ఒక బ్రహ్మర్షి  కలదు .  అతడు  బ్రహ్మ దేవుడి మానస పుత్రుడు . సర్వ సమర్ధుడు  తేజ్జస్సయాలి  ధర్మ నిరతుడు .  అతడు  బ్రహ్మ దేవుని యొక్క  కుమారుడగుట వలన  సకల దేవతలకు ప్రీతీ పాత్రుడు . ఈ పులస్త్యుడు  మీరు పర్వతము పక్కన గల  కరుణ భిందు  మహర్షి యొక్క  ఆశ్రమునకు  వెళ్లి అక్కడ తపస్సు చూస్సుకుంటూ జీవింప సాగెను . ఆ ప్రదేశము  మిల్కీలి ఆహ్లాదకరంగా ఉండుటచే   దేవకన్యలు  నాగకన్యలు , ఋషితనాయాలు ,  అప్సరసలు , ఆ ప్రదేశమునకు వచ్చి  ఆట పాటలతో , భాగ్యములతో   నృత్యములతో  ,  వినోదించుచుండిరి .  వారి క్రీడల వలన  పులస్త్యముని యొక్క తపస్సు  విఘ్న్స్ములు కలుగస్హుండెను   నదులకు  కోపించిన ఆ మహర్షి  'న దృష్టి సోకినా కన్య  గర్భవతి అగును .  '  అని  కఠోరంగా పలికెను . 
ఆ మహాత్ముని  కైనా వచనములు వినినంతనే  వారందరు  భయపడి  ఆ ప్రదేశమునకు వచ్చుట  మానివేసిరి .  రాజర్షి అయిన కృంఅభింధుని  కూతురునకు  మాత్రము ఆ మాటలు వినబడలేదు . అందు వలన  ఆమె  నిర్భయముగా  యధాప్రకారం  ఆ అస్త్రము ప్రదేశమున సంచరింపసాగెను .  కానీ  ఆమెకు  తన స్నేహితులెవ్వరు అక్కడ కనిపించలేదు . ఆ సమయములో  పులస్త్యుడు  తన తపస్సులో బాలగంగా  వేదాధ్యయనము  చేయుచుండెను . ఆ వేదం పఠనము విన్న  ఆ కరుణ భిందు మహర్షి పుత్రిక  పులస్త్యుని వద్దకు వెళ్లి  ఆయనను దర్శించెను .  అపుడు  ఆమహర్షి  దృష్టి  సోకినా ఫలితముగా  ఆమె దేహములో  గర్భవతి లక్షణములు ఏర్పడెను . హఠాత్తుగా  తంలో కల్పడిన ఆ లక్షణములను గమనించి  ఆమె మిక్కిలి  ఆందోళనకి  గురిఅయ్యేను. ' నాలో ఈ  మార్పు  ఎట్లు ఏర్పడినది  ? అని చింతించుచూ  తడ్రివద్దకు వెళ్లి నిలిచెను .  అపుడు  తృణ భుందువు  తన దివ్య ద్రిష్టియహో జరిగిన  విషయములన్నిటినీ తెలుసుకొని తన కుమార్తెను వెంటబెట్టుకొని  పులస్త్యుని వద్దకు వెళ్లెను . 
అప్పుడు  తృణ భిందువు  పులస్త్యునితో " పూజ్య మహర్షి  ఈమె నా కూతురు  సద్గుణ సంపన్నురాలు , ఈమెను భార్యగా సవీకరింపుము ఈమె సర్వదా  నీకు సుశ్రూషులొనర్చగలదు " అని పలికెను . అప్పుడు పులస్త్యుడు  ఆమెను తన భార్యగా సవీకరించెను . 
తృణభిందువు  కుమార్తె  థన్ భర్త అయినా పులస్త్యుని సర్వదా  భక్తి ప్రభక్తులతో సేవించ సాగేను .  అందులకు సంతుష్టులైన పులస్త్యుడు  ఆమెతో దేవి నీ సత్ప్రవర్తనకు  నేను ముగ్దుడ్ని అయినాను . కనుక  ఓ  సుభాఆంగి  నేడు నీకు ఒక పుతృడిని  ప్రసాదించెదను . అతడు  నా  అంతటి వాడు  , మన ఉభయ వంశములకు వన్నె తెచ్చువేశాడు , నేను వేదపఠనం చేయునపుడు  ఆ వేదమంత్రములను  నీ గాభమునందునుండీ గ్రహించగలడు . కాబట్టి అతడికి  విశ్రవసుడు  అని  పేరు ఏర్పడును . " అని పలికెను . ఆ మాటలు విని  ఆమె  పరమానంద భరితురాలాయెను . పిమ్మట కొద్దీ కాలముఅంకే  విశ్రవసుడు జన్మించెను . అతడు ధర్మాత్ముడిగా  ముల్లోకములు యందును ప్రసిద్ధి వహించెను .  క్రమముగా  అతడు తండ్రివలనే  వేదం పండితుడు  సమదృష్టి కలవాడు సదాచారముల యందు , వ్రతములను ఆచరించుట యందు నిరతికలవాడై  తపశ్చర్యలతో  మునీశ్వరుడుగా  ప్రేఖ్యాతి లభించెను  .  

రామాయణము ---------ఉత్తరకాండ -------రెండవసర్గ ----------సమాప్తము 

శశి, 

ఎం.ఏ,ఎం.ఏ,(తెలుగు), తెలుగుపండితులు . 











No comments:

Post a Comment