Saturday 2 May 2020

రామాయణము యుద్ధకాండ ---------నూటఎనిమిదవసర్గ

                                             రామాయణము 

                                        యుద్ధకాండ ---------నూటఎనిమిదవసర్గ 

రావణునిసారధి మిక్కిలి  సంతోషముతో  వెంటనే  రధమును  ముందుకు నడిపేడు . రావణునిరధము  ప్రతిధ్వనించునట్లు  పెద్దగా  ధ్వనిచేయుచూ  , తన వైపుకు  వేగంగా  వచ్చుచుండగా  శ్రీ రాముడు చూచెను .  మాతలి తన రధమును  అపసవ్యముగా వచ్చుచున్న  రావణుని రధముకు  కుడి వైపుగా  పోనిచ్చెను  . 
రావణుని వినాశనమును సూచించుచూ  అనేక అపశకునములు కనిపించుచున్నవి . శ్రీ రామునకు జయమును సూచించునట్టి  ప్రశాంతమైన శకునములు అంతటను  కన్పడినవి . 
అంతట శ్రీ రాముడు  తనకు జయమును సూచించునట్టి  శుభశకునములను  గమనించి,'ఇక రావణుడు హతమైనట్లే  అని తలఁచెను .  పిమ్మట యుద్ధమున  అమితమైన పరాక్రమమును ప్రదర్శించెను .  



రామాయణము ----------యుద్ధకాండ ----------నూటఏనిమిదవసర్గ --------------సమాప్తము ----------------------



శశి,

ఎం,ఏ , ఎం.ఏ (తెలుగు), తెలుగుపండితులు . 








No comments:

Post a Comment