Saturday 2 May 2020

రామాయణము యుద్ధకాండ ---------నూటఏడవసర్గ

                                          రామాయణము 

                                        యుద్ధకాండ ---------నూటఏడవసర్గ

యుద్ధమును చూచుటకై దేవతలతో  కలసి అక్కడికి  వఛ్చిన  అగస్త్య మహర్షి  శ్రీ రాముని వద్దకు  వచ్చి  శ్రీ రాముడితో  ఓ రామా! మహా బాహూ  ! నాయనా! సనాతనము , మిగుల గోప్యము ఐన ఈ స్తోత్రమునుగూర్చి  తెలిపెదను వినుము .  దీనిని జపించినచో  సమరమున  నీవు  శత్రువులందరిపై  విజయమును సాధింపగలవు . "ఆదిత్య హృదయము ' అను ఈ స్తోత్రము  పరమపవిత్రమైనది .  సమస్త  శత్రువులను  నశింపజేయునది .  నిత్యమూ దీనిని జపించినచో  సర్వత్రా జయము  లభించుట  తధ్యము .  ఇది  సత్ఫలములను అక్షయముగా  ప్రసాదించునది . పరమ పావనమైనది . అన్ని వ్యాధులను తొలగించునది . ఆయుస్సును  వృద్ధి పరుచునది   అన్ని రకాల జపములలో  శ్రేష్టమైనది  .  కనుక దీన్ని జపించుట  ఉత్తమము . లోకములకు వెలుగుప్రసాదించునట్టి . సూర్యభగవానుని  ఏకాగ్రతతో పూజింపుము . ఈ ఆదిత్య  హృదయము  మూడు సార్లు  జపించినచో  నీవు  ఈ  మహా సంగ్రామములో  విజయము పొందగలవు" . అని పలికి  అగస్త్యముని  తన స్థానమునకు  చేరెను . అగస్త్య మహామునిచే  ఉపదేశం పొందిన ఆదిత్య  హృదయం  ను   జపించి  సూర్య భగవానునికి  నమస్కరించి  గట్టి పూనిక తో  ధనస్సును చేతబూని  రావణుడిని వధించుటకు  కృతనిశ్చయుడుఅయ్యెను .  సూర్యుడు శ్రీ రాముని చూచి  'రామ ! త్వరపడుము'  అని పలికెను . 


రామాయణము ----------యుద్ధకాండ ------------నూటఏడవసర్గ -------------సమాప్తము --------------------------



శశి,

ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 











No comments:

Post a Comment