Tuesday 5 May 2020

                                       రామాయణము 

                              యుద్ధకాండ ----------నూటఇరువదిరెండవసర్గ 

శ్రీ రాముడి మాటలను విన్న పిమ్మట  పరమేశ్వరుడు శ్రీ  రామునితో  " కమలాక్షా ! రామా! సమస్త లోకముల యందు  పెరిగిన  దారుణమైన  రావణుడి భయమని చీకట్లను  రూపుమాపితివి ఇక దైన్యముతో ఉన్న  భరతుడిని ఊరడించుము . యశస్వి ఐన  కౌశలాయ మాతను ఓదార్చుము . కైకేయి దేవిని , సుముత్రాదేవిని  భక్తితో  దాసించుము ఆయుద్యా  రాజ్యమునకు  పట్టాభిషిక్తుడవై  బంధుముత్రులను , సజ్జనులను , ఆనందింపచేయుము . మహా బలశాలి  పుత్రపౌత్రాదులతో ఇక్ష్వాకు వంశమునకు వన్నెతెచ్చిపెట్టుము . అశ్వమేధాది యజ్ఞములను  ఆచరించి , చక్కని  కీర్తిప్రతిష్టలను  గడియింపుము .  బ్రాహ్మణాది సజ్జనులను దానధర్మముల  ద్వారా  సంతోషపరుచుము . ఇలా  చక్కని పరిపాలన ద్వారా  ధర్మసంస్థాపనము ఒనర్చి  పిమ్మట  పరంధామమునకు చేరుము . రామ  అదిగో  ఆకాశమున  నిలబడిఉన్న మీ తండ్రిగారిని చూడుము  ఆయనకి  నీవును  లక్ష్మణుడును   నమస్కరించుము . " అనిపలికెను . 
పరమశివుడి మాటలు విన్న శ్రీ రాముడు తలపైకెత్తి  విమానంలో ఉన్న తండ్రిని చూసేను  పిమ్మట  శ్రీ రాముడు  లక్ష్మణుడు  మిక్కిలి సంతోషముతో  కళ్ళవెంట  నీళ్లు కారుచుండగా  దశరధుని నమస్కరించెను .  దశరధుడు ప్రాణాలకంటే  మిన్న ఐన కుమారులను దర్శించి ,తన విమానముపై స్వర్గమునకు వెళ్లెను. 

రామాయణము యుద్ధకాండ నూటఇరువదిరెండవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం .ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment